ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన గల ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం హోలీ పండుగ సందర్భంగా యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరారు. సిగ్నల్ వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో వాహనాలు అడ్డదిడ్డంగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని బాటసారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. గత కొన్ని మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవడం విశేషం. ఇషాన్ కిషన్ 4వ స్థానంలో, తిలక్ 6వ స్థానంలో, సూర్య 7వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు, సంజూ శాంసన్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంకుకు చేరుకోవడం గమనార్హం.
KRNL: పెద్దకడబూరు మండలంలోని 20 పంచాయతీల గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలను డిజిటలైజ్ చేసి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఇవాళ MLA బాలనాగిరెడ్డికు అందజేశారు. సుమారు 2,200 మందిని కమిటీల్లో నియమించినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు.
AP: శాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. సభలో వైసీపీ సభ్యుల నిరసనలు, ఆందోళనల మధ్య మండలి ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
NRML: నిర్మల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను సకాలంలో అందజేయాలని సీనియర్ ఆడిటర్ చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను రసీదులతో సహా సమర్పించాలని తెలిపారు. ఖర్చుల వివరాలను సమర్పించని వారికి నోటీసులను అందజేస్తామని తెలిపారు.
PPM: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నేడు అరకు విచ్చేసిన సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందచేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని అధినేత పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గణితశాస్త్రం పేపర్–IIA, వృక్షశాస్త్రం పేపర్–II, రాజకీయ శాస్త్రం పేపర్–II పరీక్షలు జిల్లాలోని 37 కేంద్రాల్లో నిర్వహించగా, మొత్తం 8,805 మంది విద్యార్థులకు గాను 8,584 మంది హాజరయ్యారని చెప్పారు.
BHPL: కేజీబీవీల్లో పనిచేస్తున్న సీఆర్టీలను వెంటనే పర్మినెంట్ చేయాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన ధర్నాకు టీఎన్జీవోస్ నేతలు రవిగౌడ్, సురేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కోనసీమ: కొత్తపేట మండలంలోని బిళ్లకుర్రు 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో RDSS పథకం పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ రాంబాబు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో బిళ్లకుర్రుతో పాటు మోడేకుర్రు, గొల్లకోటివారిపాలెం గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.
WNP: ఆర్టీసీ సంస్థలో సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, విధి నిర్వహణలో ఉన్న మెకానిక్లకు నూతన యూనిఫాంలో వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ మెకానిక్లకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నిజాయితీగా పనిచేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. రద్దీ దృష్ట్యా కొత్త బస్సులను ప్రవేశ పెడుతూ, సిబ్బందికి మెరుగైన పని వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు.
JGL: రోడ్డు ప్రమాద బాధితులకు, తక్షణ సహాయం చేసి ప్రాణాలు కాపాడిన వారికి “రహ్ వీర్ పథకం” ద్వారా రూ.25 వేల నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటను గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, ఈ సమయంలో గాయపడిన వారికి సమయానికి వైద్య సహాయం అందితే ప్రాణాలు రక్షించవచ్చన్నారు.
ASF: కాగజ్ నగర్ మార్కెట్ యార్డులో సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు AO రామకృష్ణ తెలిపారు. కార్యక్రమానికి ADA మనోహర్ హాజరై మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయం చేయాలన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వాలు సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
SRD: మండల కేంద్రమైన కంది రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. పంచాయతీ రాజ్ చట్టం 2018 , ఆదర్శ గ్రామం , ప్రభుత్వ పథకాలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించేందుకు పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని మాస్టర్ ట్రైనర్ సూచించారు.
SRCL: అబుదాబి ఎయిర్ పోర్టుపై జరిగిన మిస్సైల్ దాడిలో ఎల్లారెడ్డిపేట (M) పోతిరెడ్డిపల్లికి చెందిన రాజేశ్వరరావుకి తీవ్ర గాయాలయ్యాయి. కొంతకాలంగా ఆయన దుబాయ్ ఎయిర్ పోర్టులో క్లీనింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. ఇటీవల యూఏఈ ఎయిర్ పోర్టుపై ఇరాన్ మిస్సైల్ దాడి చేయగా అద్దాలు పగిలిపోయాయి. దీంతో గాజు పెంకులు రాజేశ్వర్ రావు చాతి, కుడి చేతికి తగిలి గాయాలైనట్లు ఆయన తెలిపారు.
MDCL: ముడుచింతలపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ సమాజ ఐక్యత కోసం కృషి చేయాలన్నారు.