• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

టీటీడీ బర్డ్ ఆసుపత్రిలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

CTR: తిరుపతిలోని BIRRD హాస్పిటల్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్ తదితర 9 విభాగాల్లో మొత్తం 30 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హతలు, ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చన్నారు. చివరి తేదీ: మార్చి 13.

March 3, 2026 / 07:05 PM IST

ఇరాన్‌ సంచలన నిర్ణయం..!

అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం జరుగుతున్న వేళ ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026 ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీ నుంచి ఇరాన్‌ పూర్తిగా వైదొలగనున్నట్లు సమాచారం. ఈ WC మ్యాచ్‌లు USAలో జరగాల్సి ఉన్న నేపథ్యంలో, ఆ టోర్నీని బహిష్కరించాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

March 3, 2026 / 07:05 PM IST

రేపు కావలి శివాలయంలో పుష్ప యాగం కార్యక్రమం

నెల్లూరు: కావలి పట్టణంలోని శ్రీ దుర్గా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం 16 రోజుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పుష్పయాగం, ఉంజల్ సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

March 3, 2026 / 07:04 PM IST

ముఖ్యమంత్రి సదస్సులో పాల్గొన్న కరీంనగర్ కలెక్టర్

KNR: హైదరాబాదులోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు చేపట్టనున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

March 3, 2026 / 07:02 PM IST

గ్రామపంచాయతీ భవనానికి నూతన శోభ

JGL: పెగడపల్లి మండలం నరసింహునిపేట గ్రామపంచాయతీ భవనానికి నూతన శోభ సంతరించుకుంది. నర్సింహునిపేట గ్రామ పంచాయతీని జాతీయస్థాయి అవార్డుకు నామినేట్ చేసినందున సర్పంచ్ రాజమణి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, అధికారుల సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పంచాయతీ భవనానికి కొత్తరంగు వేయడంతో పాటు భవనం ముందు వివిధరకాల చెట్లు, పచ్చని గడ్డి ఏర్పాటు చేశారు.

March 3, 2026 / 07:02 PM IST

‘కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి’

PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో గురువారం నిర్వహించనున్న శివపార్వతుల కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజేశం యాదవ్ తెలిపారు. చలువ పందిళ్లు, ఆలయం అలంకరణ చేయడం జరిగిందన్నారు. రేపు ఉదయం ఉత్సవానికి సంబంధించి పాలపొరక తేవడం, గురువారం స్వామి వారి కళ్యాణం ఉంటుందని పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

March 3, 2026 / 07:02 PM IST

ముగిసిన గ్రహణం.. ఏం చేయాలంటే..?

దేశంలో చంద్రగ్రహణం ముగిసింది. గ్రంథాల ప్రకారం గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయడం, కొన్ని దానాలు చేయడం పుణ్యప్రదంగా పరిగణిస్తారు. ఇది మానసిక అశాంతి, ప్రతికూలత, బాధలను తగ్గిస్తుంది. కుటుంబంలో ఆనందం, శాంతిని కొనసాగిస్తుంది. ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. 

March 3, 2026 / 07:01 PM IST

ఇంటింటికి నల్లా ఏర్పాటుకు పైప్‌లైన్

SDPT: తొగుట మండలం లింగంపేట గ్రామంలో ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీర్చేందుకు పైపులైన్ ఏర్పాటు చేశారు. సర్పంచ్ గొడుగు జయమ్మ నర్సింలు బోరు నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్ ఏర్పాటు చేసి ఇంటింటికి నల్ల కలెక్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాసరేణి మురళి, వార్డు సభ్యులు అంజయ్య, లావణ్య, ఏఎంసీ డైరెక్టర్ అన్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 3, 2026 / 07:01 PM IST

ఆపన్న హస్తం కోసం ఎదురు చూపు…!

NRML: కడెం మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన నాగిళ్ళ లక్ష్మీ కుటుంబం ఆపన్నాహస్తం కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల లక్ష్మికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు ఆపరేషన్ అవసరమని, అందుకు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. వారిది నిరుపేద కుటుంబమని, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరుతున్నారు.

March 3, 2026 / 07:00 PM IST

చికిత్స పొందుతూ యువతి మృతి

MDK: నార్సింగికి చెందిన దుర్గాభవాని (22) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మనస్తాపంతో గత నెల 27న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను మెదక్, అనంతరం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది.

March 3, 2026 / 07:00 PM IST

RCB ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

RCB తమ జట్టు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. IPL-2026లో RCB తన ఐదు హోం మ్యాచ్‌లను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ CEO రాజేశ్‌ మీనన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్‌ సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, RCB తమ మిగిలిన రెండు హోం మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.

March 3, 2026 / 06:57 PM IST

అవయవదానంలో ఆరోస్థానంలో ఏపీ: సత్యకుమార్

AP: అవయవదానంలో రాష్ట్రం ఆరవస్థానంలో ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో గడిచిన రెండు నెలల్లో జరిగిన అవయవదానాలతో 64 మందికి కొత్త జీవితం కల్పించామన్నారు. అవయవాలను దానం చేస్తున్నవారు అత్యధికంగా 50 ఏళ్ల లోపువారే ఉన్నారని పేర్కొన్నారు. 2025లో రాష్ట్రంలో అవయవదానాల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు.

March 3, 2026 / 06:54 PM IST

ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

SRPT: కోదాడ పట్టణ పరిధిలోని మూడో వార్డు తమ్మరబండపాలెం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త వేణుగోపాల చార్యులు అధ్యక్షతన కళ్యాణ మహోత్సవ వేలాది మంది భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు.

March 3, 2026 / 06:53 PM IST

మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించిన శ్రీకాంత్ రెడ్డి

అన్నమయ్య: ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల జరిగిన దాడి ఘటనపై కుటుంబ సభ్యులతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. జోగి రమేష్ సోదరుడు రాము, కుమారుడు రాజీవ్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశమై పరిస్థితులపై చర్చించారు.

March 3, 2026 / 06:53 PM IST

రాపూరు అటవీ ప్రాంతంలో ప్రేమ జంట ఆత్మహత్య

నెల్లూరు: రాపూరు అటవీ ప్రాంతంలో ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఈ విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న (25), తిరుపతి జిల్లా చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి(24) ఒకే చెట్టుకు చున్నీలతో ఉరివేసుకుని ప్రాణాలు వదిలారు. పంగిలి గ్రామస్తుల సమాచారంతో రాపూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

March 3, 2026 / 06:53 PM IST