• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

“జంపన్న వాగుపై ఐదు చెక్ డ్యాముల నిర్మాణం”

MLG: మేడారం జంపన్నవాగులో నిత్యం నీరు ప్రవహించేలా గోదావరి జలాలను తరలిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మూడు ఫీట్ల ఎత్తులో నీటిమట్టం ఉండేలా 5 చెక్ డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. త్వరలోనే పనులు మొదలు పెడతామన్నారు. మేడారాన్ని ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

March 1, 2026 / 08:17 AM IST

మేడ్చల్ వైపు విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్

MDCL: మేడ్చల్, కిష్టాపూర్ ప్రాంతాల వైపు రియల్ ఎస్టేట్ విపరీతంగా విస్తరిస్తున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. మేడ్చల్, షామీర్‌పేట మార్గాల వైపు మెట్రో నిర్మాణంపై DPR సిద్ధం కావడం, మరోవైపు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉత్తర భాగం వైపు సైతం ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

March 1, 2026 / 08:16 AM IST

కన్నుల పండువగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం!

VKB: మోమిన్‌పేట్ మండలం వెల్చల్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారిని అలంకరించిన రథంపై పురవీధుల్లో ఊరేగించగా, భక్తులు భక్తిపారవశ్యంతో పూజలు నిర్వహించారు. సర్పంచ్ శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.

March 1, 2026 / 08:16 AM IST

అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: అప్పుల బాధను తట్టుకోలేక రామసముద్రం మండలం పేడరాసుపల్లికి చెందిన రైతు నారాయణ (59) పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వ్యవసాయం కోసం తీసుకున్న సుమారు రూ. 7 లక్షల అప్పులు, టమోటా సాగులో ఆశించిన ధర రాక నష్టపోవడంతో ఆయన ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు గమనించి,చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

March 1, 2026 / 08:15 AM IST

నరసాపురం, పాలకొల్లు వాసులకు అలర్ట్

WG: మార్చి 1న నరసాపురం 132/33కేవి సబ్-స్టేషన్ వద్ద ఏపీ ట్రాన్స్ కో ‘లైన్ ఇన్ లైన్ అవుట్’ పనులు చేపడుతున్నట్లు ఈ ఈ కె. మధు కుమార్ తెలిపారు. ఈ పనుల కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నరసాపురం, పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగనుంది. లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా అవసరాన్ని బట్టి కోతలు విధిస్తామని తెలిపారు

March 1, 2026 / 08:15 AM IST

రామగుండం-3 టెండర్లపై మంత్రికి కార్మికుల వినతి

పెద్దపల్లి: రామగుండం-3 జీఎం కార్యాలయంలో బాయ్స్ టెండర్లను 19 మందికి బదులుగా 12మందికి పరిమితం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) ప్రతినిధులు శనివారం మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. 19 మందికి టెండర్ అమలు చేయాలని సింగరేణి జీఎంను ఆదేశించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్మికులు ఉన్నారు.

March 1, 2026 / 08:14 AM IST

విజ్ఞాన శాస్త్రమే దేశ అభివృద్ధికి పునాది: MP

HNK: విజ్ఞాన శాస్త్రమే దేశ అభివృద్ధికి పునాది అని, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే నేషనల్ సైన్స్ డే ప్రధాన ఉద్దేశమని WGL MP డా. కడియం కావ్య అన్నారు. శనివారం సాయంత్రం HNK జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ డే వేడుకల్లో MP పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం WGLను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు.

March 1, 2026 / 08:13 AM IST

రేపు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

KRNL: కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి ఇవాళ తెలిపారు. అర్జీల స్థితిగతుల కోసం 1100 కాల్ సెంటర్ నుంచి సమాచారం పొందవచ్చన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని సూచించారు.

March 1, 2026 / 08:13 AM IST

‘శిక్షణ తరగతులతో అనేక విషయాలు తెలుసుకున్నాం’

JGL: ప్రభుత్వం 4 రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతులతో అనేక విషయాలు తెలుసుకున్నట్లు పెగడపల్లి మండల సర్పంచులు పేర్కొన్నారు. మల్యాల మండలం నూకపల్లి న్యాక్ సెంటర్‌లో మండలానికి చెందిన సర్పంచులకు గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శనివారం సాయంత్రంతో ముగిశాయి. సర్పంచులు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ పాలన అధికారాలు, విధులు, తెలుసుకున్నామన్నారు.

March 1, 2026 / 08:12 AM IST

‘లోక్ అదాలత్ విజయవంతం చేయండి’

KDP: మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. యామిని, సీనియర్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని బీమా కంపెనీ మేనేజర్లు,న్యాయవాదులతో సమావేశమయ్యారు. మోటారు వాహన ప్రమాదాల పరిహారం కేసులపై చర్చించారు.

March 1, 2026 / 08:11 AM IST

మున్సిపాలిటీలో ఐమాక్స్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డులలో ఏర్పాటు చేసిన ఐమాక్స్ (హై మాస్ట్) లైట్లను నిన్న రాత్రి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో ఈ లైట్లను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పత్య నాయక్, తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 08:10 AM IST

అనుకున్న లక్ష్యాలను చేధించాలి: తహసీల్దార్

GDWL: ఏప్రిల్ 14 నాటికి సంపూర్ణత అభియాన్‌లోని 6 ముఖ్య ఇండికేటర్ల లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని గట్టు తహసీల్దార్ విజయ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు గట్టు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చెన్నయ్య అధ్యక్షతన ఓ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ద్వారానే వంద శాతం ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

March 1, 2026 / 08:07 AM IST

మంత్రి కోమటిరెడ్డి నేటి పర్యటన షెడ్యూల్

NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు (ఆదివారం) నల్లగొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 నుంచి 10:00 వరకు నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం 10 గంటలకు రాములబండ గ్రామానికి చేరుకుని బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి, వివిధ కార్యక్రమాల అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.

March 1, 2026 / 08:05 AM IST

త్రిశూలం ఆకారంలో ముల్లంగి దుంప

ASR: అరకులోయ మండలం పరిధిలో అరుదైన ఆకారంలో పెరిగిన ముల్లంగి దుంప అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మండలంలోని చినలబుడు పంచాయతీ మాలివలస గ్రామానికి చెందిన గిరిజన రైతు జొయో సాగు చేసిన ముల్లంగి తోటలో త్రిశూలం ఆకారంలో దుంప కనిపించింది. ఒకే మొక్కకు మూడు దుంపలు కలసి పెరగడంతో అవి త్రిశూలాన్ని తలపించే విధంగా ఉండటం విశేషంగా మారింది.

March 1, 2026 / 08:05 AM IST

‘ప్రమాదాలకు ముందే చర్యలు తీసుకోండి’

ADB: నార్నూర్ మండలం ఎంపల్లి గ్రామం ఘాట్ రోడ్ ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. ఎక్కువ మలుపులు ఉన్న ఈ రోడ్డుపై ఎక్కడా దిశా సూచిక బోర్డులు లేవు. రాత్రి వేళల్లో వాహనదారులు చీకటిలో దారి తెలియక భయంతో ప్రయాణిస్తున్నారు. పక్క గోడలు లేకపోవడంతో చిన్న తప్పిదమే పెద్ద ప్రమాదానికి దారి తీసే పరిస్థితి ఉంది.

March 1, 2026 / 08:05 AM IST