• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ప్రమాణస్వీకారం

AP: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బ్రహ్మంగారి మఠం వారసత్వ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గత నాలుగున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న పీఠానికి నేడు 12వ తరం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి పట్టాభిషేకం జరగనుంది. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం ఆయన తాత్కాలిక పీఠాధిపతిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.

February 26, 2026 / 07:14 AM IST

రోడ్డు భద్రతా పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

KMM: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలోని బైపాస్ రోడ్డు, కొత్త బస్టాండ్ వంటి ప్రాంతాలలో రోడ్డు భద్రతా పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో గుర్తించిన 30 బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు జీబ్రా క్రాసింగ్‌లు, సోలార్ బ్లింకర్స్, సైన్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 07:13 AM IST

కలెక్టర్ కార్యాలయం ముందు జెండాలతో నిరసన

HNK: కుమ్మెర GPలోని జరిగిన కుల వివక్షత దాడిపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని PDSU నాయకులు నిన్న సాయంత్రం కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. అనంతరం PDSU (C) మహేష్ మాట్లాడుతూ.. అభం శుభం తెలియని పశు గుడ్డును తొక్కి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

February 26, 2026 / 07:12 AM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ

NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం హెచ్‌బీ కాలనీలో నూరే ఇలాహీ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎంపీ కేశినేని చిన్ని బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని, అన్నారు. రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్షలు క్రమశిక్షణ, ఆత్మ పరిశీలన, సహనం వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు.

February 26, 2026 / 07:12 AM IST

రుణాల లక్ష్యాలను మించి పనిచేయాలి: అదనపు కలెక్టర్

VKB: జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన బ్యాంకర్ల జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. బ్యాంకులు ప్రభుత్వ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తూ నిర్దేశిత రుణ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. అర్హులైన నిరుపేదలు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

February 26, 2026 / 07:12 AM IST

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పరిశీలన

AKP: ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో నక్కపల్లిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్ నక్కపల్లిలో అధికారులతో సమీక్షించారు. కాగిత గ్రామం వద్ద హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. భద్రత ఏర్పాట్లు, రహదారి సౌకర్యం, తాత్కాలిక వసతులు కల్పనపై ఆమె అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. భద్రత చర్యలను కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

February 26, 2026 / 07:10 AM IST

మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష

అన్నమయ్య: రాయచోటిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలానికి చెందిన దేరంగుల శ్రీనివాసులు అనే వ్యక్తికి కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. బుధవారం ట్రాఫిక్ సీఐ కుళాయిప్ప విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడటంతో అతడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం జైలు శిక్ష ఖరారైనట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 07:10 AM IST

5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

CTR: కుప్పం ద్రవిడ వర్సిటీ ప్రాంగణంలోని మహాత్మ జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు) 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సరోజ తెలిపారు. విద్యార్థులు మార్చి 4లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

February 26, 2026 / 07:10 AM IST

తాళం పగలగొట్టి ఆభరణాలు చోరీ

KDP: తాళం పగలగొట్టి 3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన బద్వేలు పట్టణంలోని రిక్షా కాలనీలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు కాలనీకి చెందిన ప్రభావతి ఇంటికి తాళం వేసి పని నిమిత్తం టౌన్‌లోకి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉంది. బీరువా పరిశీలించగా బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు గుర్తించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

February 26, 2026 / 07:10 AM IST

నిరుద్యోగులకు అలర్ట్.. లాస్ట్ డేట్ ఇదే..!

PDPL: రామగుండం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శిక్షకులుగా పనిచేయడానికి అర్హత గలవారు మార్చి 3లోగా అప్లై చేసుకోవాలని ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. సీఎస్‌సి ఆపరేటర్, ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, త్రీడీ ప్రింటింగ్ ఆపరేటర్, జూనియర్ ప్లంబర్ కోర్సులలో 3 నెలలు నైపుణ్య శిక్షణ ఇచ్చుటకు అర్హులైన అభ్యర్థులు పూర్తి బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

February 26, 2026 / 07:08 AM IST

చేతివేళ్లు విరిగాయి.. అయిన పరీక్షకు..!

MDK: జిల్లాలో ‘స్టాలిన్’ మూవీ సీన్ రిపీట్ అయింది. చేతివేళ్లు విరిగినప్పటికీ ఓ విద్యార్థిని ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరైంది. రామాయంపేట జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న హర్షితకు ఇటీవల ప్రమాదంలో చేతి వేళ్లు విరగడంతో సర్జరీ జరిగింది. పరీక్ష రాసే వీలు లేకపోవడంతో, అధికారుల అనుమతి తీసుకొని మరో విద్యార్థి సహాయంతో బుధవారం పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.

February 26, 2026 / 07:07 AM IST

9 నెలల గర్భిణిని హత్య చేసిన భర్త

NZB: ఇందల్వాయి మండలం గన్నారంలో 9 నెలల నిండు గర్భిణిని కట్టుకున్న భర్తే గొంతు నులిమి హత్య చేశాడు. డిచ్‌పల్లి సీఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన నాగేశ్ పది సంవత్సరాల క్రితం సుమలత(31)ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనుమానంతో తరచూ నాగేశ్ భార్యతో గొడవ పడేవాడు. ఈ నెల 22న అర్ధరాత్రి భార్యను హత్య చేశాడు.

February 26, 2026 / 07:05 AM IST

మనూలో దరఖాస్తుల ఆహ్వానం

HYD: గచ్చిబౌలిలోని మనూలో బీఏ, బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకామ్ బీఈడీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( NCET)లో వచ్చిన స్కోర్ల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తామని మనూ అడ్మిషన్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వనజ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.

February 26, 2026 / 07:05 AM IST

కాలం చెల్లిన పదార్థాలు వాడొద్దు: కలెక్టర్

SDPT: విద్యార్థులకు అందించే భోజనం నాణ్యంగా ఉండాలని, రాజి పడొద్దని, కాలం చెల్లిన వస్తువులు వాడద్దని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట రూరల్ మండలం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని మధ్యాహ్నం భోజన సమయంలో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేసి పొంతన లేకుండా ఉండటంతో ఎసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలన్నారు.

February 26, 2026 / 07:04 AM IST

రాయలసీమ ప్రయోజనాలపై తలారి రంగయ్య గర్జన

ATP: రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ‘చీకటి ఒప్పందం’ కుదిరిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. బుధవారం నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీమ ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నా చంద్రబాబు మౌనంగా ఉండటం దారుణమని మండిపడ్డారు.

February 26, 2026 / 07:04 AM IST