BDK: పినపాకలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు తక్షణం కేటాయించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌కు ఆమె వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో అనేక ఇళ్లు మంజూరై పూర్తి అయినప్పటికీ, చాలా ఇళ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
SDPT: బనేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా అన్నారు. సోమవారం చిన్నకోడూరు మండలంలోని గోనెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు.
JGL: బాధితులకు సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే లక్ష్యమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుండి 15 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
SKLM: పొందూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక పరికరాలు, సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
AP: ప్రేమించిన యువతి దక్కదేమోనని యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రదీప్.. అదే ఊరిలో ఉన్న యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. తన ప్రియురాలిని వేరే ఊరికి తీసుకెళ్లగా.. తనను పంపించాలని అడిగాడు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. స్థానికులు గమనించి ప్రదీప్‌ను ఆస్పత్రికి తరలించారు.
AP: ప్రేమించిన యువతి దక్కదేమోనని యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రదీప్.. అదే ఊరిలో ఉన్న యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. తన ప్రియురాలిని వేరే ఊరికి తీసుకెళ్లగా.. తనను పంపించాలని అడిగాడు. దీంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. స్థానికులు గమనించి ప్రదీప్‌ను ఆస్పత్రికి తరలించారు.
BHNG: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.5,01,280, VIP దర్శనాలతో రూ.3 లక్షలు, కార్ పార్కింగ్‌తో రూ.2,71,500, బ్రేక్ దర్శనాలతో రూ.1,57,500, ప్రధాన బుకింగ్‌తో రూ.1,00,200, లీజులతో రూ.7 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.27,09,930 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.
TG: అనంతగిరి హిల్స్‌లో నిర్వహించిన DCC అధ్యక్షుల శిక్షణ ముగింపు సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తొలుత CM రేవంత్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశం కోసమైనా ప్రధాని కావాల్సిందేనని, తాను CMగా అడగడం లేదని, ఓ కాంగ్రెస్ కార్యకర్తగా కోరుకుంటున్నానని అన్నారు.
NLG: హోళీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ వేడుక సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందించాలని కోరారు. పర్యావరణానికి హాని కలిగించని ప్రకృతి సిద్ధమైన రంగులతో సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.
NZB: హోలీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలు పోలీసు నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై లేదా వాహనాలపై బలవంతంగా రంగులు, నీటిని చల్లడం నిషేధమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీస్ చట్టం సెక్షన్-76 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
కోనసీమ: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రాజోలు సీఐ నరేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం రాజోలులో ఆయన తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి నుంచి జరిమానాలు వసూలు చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధం అని, దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సీఐ అన్నారు.
WGL: నర్సంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఆకర్షితులై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో ఈ రోజు కుమ్మరి సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సంపేట అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.
NRML: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో యువ నాయకుడు యాసీన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు BRS పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం త్యాగం, నియమం, దానం, దైవ భక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ADB: కష్టపడిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని దేగామ గ్రామంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుషను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ మేరకు గజేందర్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
T20 ప్రపంచకప్‌లో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య హెడ్-టు-హెడ్ రికార్డు భారత్‌కు స్వల్పంగా అనుకూలంగా ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు T20 WCలో మొత్తం 5 సార్లు తలపడగా.. భారత్ 3 సార్లు, ఇంగ్లండ్ 2 సార్లు విజయం సాధించాయి. వాంఖడే స్టేడియంలో ఈ జట్లు టీ20ల్లో రెండుసార్లు తలపడగా, చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి.