సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో హోళీ వేడుకలు అంబరాన్నంటాయి. వార్డు కౌన్సిలర్ లక్ష్మీ కాంతమ్మ స్థానిక ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. స్వయంగా వార్డు ప్రజల మధ్యకు వచ్చి, అందరికీ రంగులు పూసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. హోళీ రంగుల పండుగ అని, ఈ రంగుల వలె ప్రజలందరి జీవితాలు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.
MDK: మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద గల అటవీ శాఖ తూప్రాన్ రేంజ్ కార్యాలయం వద్ద ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ తూప్రాన్ రేంజర్ అంబర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం చేపట్టారు. రేంజ్ కార్యాలయం వద్ద ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం బ్యానర్ ప్రదర్శిస్తూ, వన్య ప్రాణుల రక్షణకు పాటు పడతామని పేర్కొన్నారు.
CTR: వేద పండితుల సూచనల మేరకు శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం మంగళవారం ఉదయం 9:00 గంటలకు మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 6:00 గంటలకు ఆలయ శుద్ధి నిర్వహించి, అమ్మవారికి అభిషేకం చేస్తారని తెలిపారు. అనంతరం భక్తులకు దర్శనాలు యథావిధిగా కల్పించబడతాయి.
HYD: నగరంలో ప్రజారోగ్యమే లక్ష్యంగా ఆహార భద్రతా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోని అంబర్‌పేట, చాంద్రాయణగుట్ట, ఖైరతాబాద్, గోషామహల్, అత్తాపూర్ ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్లు, ఆహార కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ బృందాలు తనిఖీ చేశాయి.
సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు చాఫ్ కట్టర్ మిషన్లను ఎమ్మెల్యే ఎంఎస్.రాజు పంపిణీ చేశారు. మెలవాయి, కళ్ళుమరి, రేకులకుంట, ఏఆర్ రూపం గ్రామాల నుంచి వచ్చిన రైతులకు ఈ యంత్రాలను అందజేశారు. పశుగ్రాసం వృథా కాకుండా చూసేందుకు ఈ మిషన్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
NZB: బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం అధికారులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. పండుగ పూట ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని నిరంతరం పహారా కాసే పోలీసులు, ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సత్యసాయి: వినియోగదారుల హక్కుల రక్షణకు జిల్లా యంత్రాంగం కొత్త ఫిర్యాదుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. రేషన్ సరుకుల పంపిణీ, గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ బంకుల్లో అక్రమాలపై 08555-288566 నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. నిత్యావసర వస్తువుల సరఫరాలో పారదర్శకత కోసం ఈ సదుపాయాన్ని కల్పించామన్నారు.
W.G. తణుకు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్సకు సైతం ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిది అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. సోమవారం టిడిపి కార్యాలయంలో సుమారు 40 మందికి సీఎం సహాయ నిధులు రూ. 24,29,807 మంజూరు కాగా, ఆ చెక్కులను లబ్ధిదారులకు అందించడమైనది. వారు చికిత్స తీసుకుని, త్వరగా కోలుకుని ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు.
NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాష్ట్ర నేత స్కైలాబ్ నాయక్‌లు ప్రజలు, పార్టీ కార్యకర్తలతో రంగులు పూసుకుని వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరిలో ఉత్సాహం నింపారు. ఈ వేడుక స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది.
సత్యసాయి: నీలకంఠాపురం దేవస్థానంలో కదిరి పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం పంచామృతాభిషేకం, అలంకార తిరుమంజనం, సత్యనారాయణ స్వామి వ్రతాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మేళతాళాలతో స్వామివారి ఉత్సవ మూర్తి ఊరేగింపు, ప్రాకారోత్సవం కన్నుల పండువగా సాగాయి.
AP: లోక్‌సభ తొలి దళిత స్పీకర్, టీడీపీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ‘ఒక సామాన్య దళిత కుటుంబంలో పుట్టి లోకసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన అసాధారణ ప్రతిభాశాలి. కోనసీమ ముద్దుబిడ్డ, తెలుగువెలుగు జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం. ఆ అభ్యుదయనేత స్మృతికి నివాళులు అర్పిద్దాం’ అని ట్వీట్ చేశారు.
MBNR: నవాబుపేట మండలం ఎస్సై విక్రం మానవత్వం చాటారు. బంగరంపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ (70) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమారుడు మానసిక వికలాంగుడు కావడంతో కుటుంబం కష్టాల్లో ఉంది. విషయం తెలుసుకున్న ఎస్సై విక్రం వారి ఇంటికి చేరుకుని ఆర్థిక సహాయం అందించారు. స్థానికులు ఎస్సైను అభినందించారు.
TG: భయ్య ట్రావెల్స్, అభి బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. వారి నిర్లక్ష్యంతో 15 మంది HYD వాసులు నాగ్‌పూర్‌లో చిక్కుకుపోయారు. వారణాసి నుంచి HYDకి ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. నాగ్‌పూర్ రాగానే బస్సును డ్రైవర్ నిలిపివేశాడు. మరో బస్సు వస్తుందని రోడ్డుపై దించి వెళ్లిపోయాడు. దీంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాతావరణంతో సంబంధం లేకుండా కాళ్లు, చేతులు పొడిబారుతున్నాయా? రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్‌తో మర్దన చేయండి. గోరువెచ్చని నీటిలో వంటసోడా, ఎప్సమ్ సాల్ట్, రోజ్ వాటర్ కలిపి పది నిమిషాలు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగి, మీ చర్మం తిరిగి మృదువుగా, ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
అన్నమయ్య: కొత్తపల్లి గ్రామంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే మల్లూరమ్మ తల్లి జాతరకు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని టీడీపీ నాయకులు, ఆలయ ధర్మకర్తలు ఆహ్వానించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో అమ్మవారి జాతరల్లో ఈ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉందని నాయకులు తెలిపారు.