KDP: లింగాల మండలంలోని బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోత పథకం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఆదివారం రైతులు ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ట్రాన్స్‌ఫార్మర్ తెప్పించినా, కనెక్షన్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రైతుల విషయంలో రాజకీయాలకు తావులేకుండా అధికారులు వ్యవహరించాలన్నారు. విద్యుత్ అధికారులు కనెక్షన్ ఇవ్వకపోతే ధర్నా చేస్తామన్నారు.
VKB: రాబోయే హోలీ పండుగ, చంద్రగ్రహణ సమయాలపై వికారాబాద్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జ్యోషి సుభాశ్ చంద్రకాంత్ శర్మ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ విద్వత్ సభ నిర్ణయించిన ప్రమాణాల మేరకు మార్చి 2న కామదహనం, మార్చి 3న హోలీ జరుపుకోవాలని సూచించారు. అదేరోజు మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉంటుందని తెలిపారు.
ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ సెడ్మకి ఆనంద్ రావు ఆదివారం సచివాలయంలో కలిశారు. ఐటీడీఏల ద్వారా ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని కోరారు. ఈ విన్నపాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఆనంద్ రావు తెలిపారు.
NRML: నిర్మల్ మున్సిపల్ నూతన వైస్ ఛైర్మన్ అప్పల గణేష్‌ను 1993–1996 B.Sc, BZC బ్యాచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మిత్రబృందం ఆదివారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో TRSMA నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కంకేట మాజీ సర్పంచ్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
NDL: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన CMRF చెక్కులు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పంపిణీ చేశారు. జూపాడు బంగ్లా మండలం, మండ్లెం గ్రామానికి చెందిన షేక్ ఫరీదాబికి రూ.79,670 విలువైన చెక్కు ఎమ్మెల్యే ఆదివారం అందజేశారు. ఈ మేరకు CM మంద్రబాబు, MLAకు ఫరీదా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ELR: ప్రమాదాల నివారణే లక్ష్యంగా గుండు గొలనులో బాణాసంచా నిల్వ కేంద్రాలపై పోలీసులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గుండు గొలను గ్రామంలోని హోల్‌సేల్ టపాకాయల దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. భీమడోలు సీఐ విల్సన్ నేతృత్వంలో రెవిన్యూ, అగ్నిమాపక సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు. అనుమతించబడిన పరిమితికి మించి బాణాసంచాను నిల్వ చేయకూడదన్నారు.
SRPT: ఎస్సీ వర్గీకరణ అమలు కోసం అసువులు బాసిన అమరుల త్యాగం మరువలేనిదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కందుకూరి సోమన్న మాదిగ అన్నారు. ఆదివారం తిరుమలగిరిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ సాధించడమే మాదిగ అమరవీరులకు నిజమైన నివాళి అన్నారు.
NZB: నవీపేట్ మండలం కోహ్లి సర్పంచ్ బాబు సింగ్ ఆదివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధి పనులకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీపేట్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రకాశం: బెస్తవారిపేటలోని పలు కిరాణా దుకాణాలను సీఐ మల్లికార్జున ఆదివారం పరిశీలించారు. గతంలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయాలు నిర్వహించిన దుకాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా సంబంధిత దుకాణాల యజమానులకు చట్టపరమైన నిబంధనలు వివరించి, అనుమతులు లేకుండా విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంలోని పలకలూరు చైతన్య స్కూల్స్‌లో ఆదివారం K.SAT లెవెల్-2 ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయన మాట్లాడుతూ.. శాస్త్రీయ దృక్పథం, పోటీ భావనకు ఇలాంటి పరీక్షలు అవసరమన్నారు.
తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో దర్శకుడు విఘ్నేష్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘కారా’. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాత ప్రకటించారు. 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు. ఇక ఈ సినిమ మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కడుపు నిండా తినకుండా కొంచెం ఖాళీ ఉంచితే బద్ధకం, నిద్ర రావు. అన్నంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. టీవీ, మొబైల్ చూస్తూ తినడం మానేయాలి. చివరగా మజ్జిగ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనానికి అరగంట ముందు లేదా తర్వాతే నీళ్లు తాగడం ఉత్తమం.
NDL: బేతంచర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో రౌడీషీటర్లు ఘర్షణలు, అల్లర్లకుకు పాల్పడితే శాఖపరమైన కఠిన చర్యలు తప్పవని CI వెంకటేశ్వరావు హెచ్చరించారు. బేతంచర్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సమాజంలో ప్రజాశాంతికి భంగం కలిగినా, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా గ్రామ బహిష్కరణ తప్పదని హెచ్చరించారు.
తమిళ స్టార్ విజయ్‌కు వ్యక్తిగత సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయగా, తాజాగా కుమారుడు జేసన్ సంజయ్ తీసుకున్న నిర్ణయం షాక్‌కు గురిచేస్తోంది. జేసన్ సోషల్ మీడియాలో తన తండ్రిని అన్‌ఫాలో చేసినట్లు సమాచారం. తండ్రి మద్దతుతో దర్శకుడిగా మారుతున్న జేసన్ ఇలా చేయడం విజయ్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయనే చర్చకు దారితీస్తోంది.
ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు హనుమంతరాయ చౌదరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అనంతపురంలోని సవేరా ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. హనుమంతరాయ చౌదరి ఆరోగ్య స్థితిగతులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.