• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు జిల్లాకు గరికపాటి

NGKL: మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు ఈనెల 4న కొల్లాపూర్‌కు రానున్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణమండపంలో సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రవచన కార్యక్రమం ఉంటుందని ఆర్యవైశ్య సంఘం నేత సుదర్శన్ శెట్టి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

March 3, 2026 / 11:32 AM IST

టేక్మాల్ మండల వ్యాప్తంగా హోలీ పండగ సంబరాలు

MDK: టేక్మాల్ మండలం వ్యాప్తంగా ఆయా గ్రామాలలో మంగళవారం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు హోలీ పురస్కరించుకుని పెద్ద ఎత్తున యువత, చిన్నారులు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ అంటే ప్రేమానురాగాలను ప్రతీక అని అందరు సోదరభావంతో పండుగ జరుపుకోవాలని పలువురు అభిప్రాయ పడ్డారు.

March 3, 2026 / 11:32 AM IST

బ్రహ్మ పుష్కరిణి‌లో స్వామివారి డోలోత్సవం

JGL: బ్రహ్మోత్సవాలలో భాగంగా ధర్మపురి క్షేత్రం లోని బ్రహ్మ పుష్కరిణి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి డోలోత్సవం ఉదయం 7 గంటల లోపు పూజారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, వీఐపీలకు మాత్రమే స్వామి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించారు. అనంతరం స్వామి వారిని ఆలయానికి తీసుకువెళ్లారు.

March 3, 2026 / 11:32 AM IST

‘హిందూ ధర్మాన్ని, టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి’

NLR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ మంత్రి కాకాణి ‘X’లో స్పందించారు. హిందూ ధర్మ పరిరక్షణ అనేది టీటీడీ ప్రధానమైన బాధ్యత అని అన్నారు. ‘తిరుమలలో ప్రతిచోటా కనిపించే ధర్మో రక్షతి రక్షితః గురించి నీకు తెలియదా బీఆర్ నాయుడు?’ అంటూ ప్రశ్నించారు. భగవద్గీత గురించి బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మాన్ని, టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు.

March 3, 2026 / 11:31 AM IST

సీఎం చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్

AP: సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. హనుమాన్ కార్యక్రమం ముగియగానే నేరుగా పవన్.. చంద్రబాబు ఇంటికి వెళ్లారు. నామినేటెడ్ పదువులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

March 3, 2026 / 11:30 AM IST

పారిశుద్ధ్య లోపం.. పట్టించుకుని అధికారులు..!

PDPL: గోదావరిఖని 5 ఇంక్లైన్ కాలనీ వంతెన పక్కన పారిశుధ్య లోపంతో అపరిశుభ్ర వాతావరణంలో దర్శనమిస్తోంది. మంథని – గోదావరిఖని ప్రధాన రహదారి పక్కన కుప్పలు కుప్పలుగా చెత్తాచెదారం నిండి పోయి దుర్వాసనతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. శివారు పరిశుభ్ర వాతావరణానికై అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

March 3, 2026 / 11:29 AM IST

మందుగుండు తయారీ దుకాణదారులకు నోటీసులు

పార్వతీపురం జిల్లాలో ముందుగుండు తయారీ దుకాణదారులకు అగ్నిమాపక సిబ్బంది నోటీసులు అందజేశారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేనిచో కఠిన చర్యలు తప్పవని జిల్లా అగ్నిమాపక అధికారి సింహాచలం హెచ్చరించారు. సామర్లకోటలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నోటీసులు అందజేశామన్నారు.

March 3, 2026 / 11:29 AM IST

నేడు ప్రారంభం కానున్న కొమ్మల జాతర

WGL: గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జాతర ప్రధాన ఘట్టమైన ప్రభ బండ్ల ఊరేగింపు ఇవాళ ఉదయం జరగనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దీంతో హోలీ పండగ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకోనున్నారు.

March 3, 2026 / 11:28 AM IST

గుర్తింపు లేని ఆసుపత్రులకు దరఖాస్తు: DMHO

CTR: చిత్తూరు DMHO సుధారాణి, గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లకు, ఫిజియోథెరపీ యూనిట్లు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. APMCE చట్టం ప్రకారం వారం రోజుల్లోగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని, లేదంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 3, 2026 / 11:28 AM IST

మెరకముడిదాం సొసైటీ కేంద్రం ప్రారంభం ఎప్పుడు..?

VZM: మెరకముడిదాం సొసైటీ పరిధి యెక్క బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రం నిరుపయోగంగా ఉంది. ఈ కేంద్రమును 2023వ సంవత్సరంలో 40 లక్షల మంజూరు చేశారు. దీన్ని ఊరికి చివర స్మశానంలో ఏర్పాటు చేయడంతో రోడ్డు సౌకర్యం లేనందున రైతులు గగ్గోలు పడుతున్నారు. కట్టి 3సంవత్సరాలు అవుతున్న ప్రారంభించలేదని అంటున్నారు. ఈ స్టోరేజ్‌ను వాడుకలోనికి తెస్తే రైతులకు ఉపయోగపడుతుంది.

March 3, 2026 / 11:27 AM IST

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన సుద్దాల చందు(22) అనే యువకుడు మంగళవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో మృతుడి తండ్రి శ్రీహరి అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మృతితో మానసికంగా, ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందినట్లు తెలిపారు.

March 3, 2026 / 11:25 AM IST

మండలంలో పర్యటించిన బీఆర్ఎస్ శ్రేణులు

KMM: నేలకొండపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం విస్తృతంగా ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా భైరవునిపల్లి గ్రామానికి చెందిన BRS నాయకులు మాజీ సర్పంచ్ పెద్దపాక సత్యం, వారి సతీమణి సత్యవతి ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. అలాగే స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

March 3, 2026 / 11:24 AM IST

రామప్ప ఆలయం మూసివేత

MLG: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని నేడు చంద్రగ్రహణం సందర్భంగా ద్వారబంధనం చేశారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ప్రధాన ద్వారాన్ని అర్చకులు, నిర్వాహకులు శాస్త్రోక్తంగా ద్వారబంధనం చేశారు. గ్రహణం ముగిసిన తర్వాత బుధవారం ఉ. 6 గం పుణ్యాహవాచనం, సంప్రోక్షణ పూజలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.

March 3, 2026 / 11:24 AM IST

చిరు వ్యాపారస్తులకు నోటీసులు

WNP: వీపనగండ్ల మండల కేంద్రంలో సర్వే నెంబర్ 721లో ప్రభుత్వ భూమిలో చిరు వ్యాపారస్తులకు ఎమ్మార్వో ప్రభాకర్ రావు నోటీసులు జారీ చేశారు. బతుకు తెరువు కొరకు వేసుకున్న చిరు వ్యాపారస్తులు తమ సొంత స్థలంలా భావించడం సరైనది కాదని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మార్వో తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి అందరు సహకరించాలన్నారు.

March 3, 2026 / 11:24 AM IST

MBBS విద్యార్థులకు ఎమ్మెల్యే ఆర్థికసాయం

TG: MBBS విద్యార్థులకు ఉప్పల్ MLA లక్ష్మారెడ్డి ఆర్థికసాయం అందించారు. బీఎల్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున వైద్యవిద్య కోసం ఆర్థికసాయం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే‌ను హరీష్ రావు అభినందించారు. 122 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు బీఎల్ఆర్ ట్రస్ట్ తరుపున సాయం చేయనున్నారు.

March 3, 2026 / 11:23 AM IST