HNK: నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రామకృష్ణ బుధవారం పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆయన, పని ప్రదేశాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఈజీఎస్ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.
AP: చిత్తూరు జిల్లా గంగవరం మండలం YSR జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందున్న కంటైనర్‌ను వేగంగా వెళ్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
WGL: చంద్రగ్రహణం అనంతరం ఓరుగల్లు అధిదేవత భద్రకాళి అమ్మవారి దర్శనాలు బుధవారం పునఃప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలు తెరిచిన అర్చకులు.. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు జరిపారు. గ్రహణం వీడటంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ఈ-నామ్ 2.0 వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. పంట నాణ్యత తనిఖీకి ఏఐ (AI) సాంకేతికతను వాడుతున్నారు. బిడ్డింగ్ ధర తూకం కమీషన్ వివరాలు నేరుగా రైతు ఫోన్‌కు మెసేజ్ వస్తాయి. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలుంటుందని మార్కెట్ అధికారులు వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ వసతిగృహంలో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.హోలీ సంబరాల అనంతరం సీనియర్, జూనియర్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
W.G: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అమర్నాథ్ నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NZB: ధర్పల్లిలో మున్నూరు కాపు చెలిమెల సట్టం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మూడవ వార్షికోత్సవం నేడు ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, కల్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
NLG: చిట్యాల మండలంలో వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు గ్రామీణ త్రాగునీరు పారిశుద్ధ్య విభాగం ఏఈ సతీష్ తెలిపారు. 18 పంచాయతీల పరిధిలోని 27 ఆవాసాలకు 508 ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా 11,444 కుటుంబాలకు నీరు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పైప్‌లైన్ లీకేజీలను అరికట్టామని తెలిపారు.
MBNR: జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో బబ్లు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. కేసును విచారించిన జడ్చర్ల కోర్టు న్యాయ మేజిస్ట్రేట్ కే. నరసింహులు నిందితుడికి మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ విషయాన్ని ఎస్సై జయప్రసాద్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
SRPT: కోదాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పదవి రెండు నెలలుగా ఖాళీగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో పనిచేసిన ప్రతాప్ లింగం సస్పెండ్ కావడంతో ప్రస్తుతం ఇంఛార్జ్ అధికారే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి సీఐ లేకపోవడంతో కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పర్యవేక్షణపై ప్రభావం పడుతోంది. తక్షణమే శాశ్వత సీఐని నియమించాలి స్థానికులు కోరుతున్నారు.
MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఉత్సాహ వాతావరణంలో హోలీ సంబరాలు జరుగుతున్నాయి. చంద్రగ్రహణం కావడంతో మండలంలోని పోన్కల్, ధర్మారం, మందపల్లి, కిష్టాపూర్, దేవునిగూడెం, కామన్ పల్లి, కవ్వాల్, కొత్తపేట, తదితర గ్రామాలలో బుధవారం హొలి పండుగను నిర్వహిస్తున్నారు. పెద్దలు, చిన్నారులు రంగులు పోసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు.
AKP: ప్రభుత్వ భూములపై కోర్టుల్లో కేసులు వేస్తుండడంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం శాసనసభలో మాట్లాడుతూ.. భూముల కేసుల కోసం నియమించిన లైజనింగ్ అధికారులు కుమ్మక్కవుతున్నారని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా రెవిన్యూ అధికారులు పనిచేయకపోతే భూములు అన్యాక్రాంతం అవుతాయన్నారు.
వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ మంగళవారం హోలీ అనంతరం బుధవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.21,500 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.35వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,100, దీపిక రూ.30వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
కామారెడ్డి పట్టణ కేంద్రంలో కొందరు దుండగులు మంగళవారం రాత్రి నలుగురు దొంగలు కాపర్ వైర్ దొంగిలించుకుని వెళుచుండగా గొల్లవాడ సమీపంలో అనుమానస్పదంగా కనిపించగా రాజేష్, వినోద్, అశోక్ అను వారు వారిని అనుమానాస్పదంగా ఆపడం జరిగింది. ఏమి తీసుకెళ్తున్నారు అని అడగగా ముందుగా పథకం ప్రకారం తీసుకుని వచ్చినా ఇనుపరాడు కర్రలతో వారిపై దాడి చేశారు.
NLG: చంద్రగ్రహణం ముగియడంతో జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ బుధవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. నిన్న మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6:49 గంటల వరకు కొనసాగింది. దీంతో ఆగమ శాస్త్రం ప్రకారం నిన్న మధ్యాహ్నం నుంచే ఆలయ ద్వారాలను మూసివేసిన అర్చకులు, ఈరోజు ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు.