TG: కామారెడ్డి జిల్లా బిచ్కుందకి చెందిన సాయిలు(53) దారుణ హత్యకు గురయ్యాడు. బిచ్కుంద శివారులో పాలగుండం ప్రాంతంలో అతని మృతదేహం పడి ఉంది. రాళ్లతో కొట్టి చంపి పడేసినట్లు సాయిలు మృతదేహం ఉంది. వ్యక్తి హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
AP: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను నటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కాగా నిన్న బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్‌లోని సిటీన్యూరో సెంటర్‌కు తరలించిన విషయం తెలిసిందే.
RR: బాల్య వివాహాలను అరికట్టే విషయంలో బాధ్యతగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బాల్య వివాహ విముక్త ప్రచార రథయాత్రను షాద్‌నగర్ పట్టణంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో నేటికీ బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని, వాటి నిర్మూలన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంను శనివారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
PDL: కృష్ణనదిలో ప్రయాణం చేసే పడవలకు ఫిట్నెస్ లేదని MPDO శ్రీనివాసరావు CI శ్రీనివాస్‌లు గత 3మాసాల క్రితమే, పడవలను సీజ్ చేశారు. మాదిపాడు, గింజుపల్లి, తాడువాయి, చామర్తి, KVపాలెం నది ప్రాంతంలో యధా విధంగా మళ్లీ పడవ ప్రయాణం సాగుతుందని స్థానిక ప్రజలు తెలిపారు. ఫిట్నెస్ లేకుండా పడవ ప్రయాణం కొనసాగడం, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడటమేనని ప్రజలు మండిపడ్డారు.
WGL: నర్సంపేట పట్టణంలో టైలర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… టైలర్స్ యొక్క సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సమాజంలో టైలర్స్ పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.
SRD: నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఛైర్మన్ నగేష్ షెట్కార్ అన్నారు. పట్టణంలో శనివారం ఆయన పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, మురుగు కాలపులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.
GNTR: పిడుగురాళ్ల 7వ వార్డులో శనివారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఆదివారం సెలవు కావడంతో ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఎంతో పారదర్శకంగా, లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లు చేరుస్తున్నామని పేర్కొన్నారు.
E.G: కోరుకొండ మండలం గాడాల గ్రామంలో శనివారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రూడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పింఛన్ అందజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అండగా నిలబడటం తమ బాధ్యత అన్నారు.
ATP: తాడిపత్రిలోని చింతల వెంకటరమణస్వామి దేవస్థానాన్ని సందర్శించాలని అహోబిల మఠం పీఠాధిపతులు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికులను ఆలయ అర్చకులు శ్రీ చింతలరాయన్ ఆహ్వానించారు. అహోబిలంలో పీఠాధిపతిని కలిసి స్వామివారి మర్యాద మాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుప్పావై సేవ కార్యక్రమ నిర్వహణ తీరుపై పీఠాధిపతితో చర్చించారు.
సైన్యంలో పనిచేసిన సిబ్బందికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగాల్లో మాజీ సైనికులు, అగ్నివీర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనున్నారు. మాజీ సైనికులకు లెవెల్-1 పోస్టుల్లో 20%, లెవెల్-2 ఆ పైస్థాయి పోస్టుల్లో 10%, రిటైర్డ్ అగ్నివీర్లకు లెవెల్-1 పోస్టుల్లో 10%, లెవెల్-2 ఆ పైస్థాయి పోస్టుల్లో 5% చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది.
KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బాధితుల నుంచి దోచుకున్న డబ్బును నిందితుల నుంచి రికవరీ చేసి తిరిగి భాదితులకు అప్పగిస్తామని చెప్పారు. ఇప్పటికే పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 13 మందిపై నమోదు కేసుల నమోదు చేసి, నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. నిందితులను వదిలేదేలేదన్నారు.
MLG: మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్ ఫోరం డైరీ & క్యాలెండర్లను నేడు మంత్రి సీతక్క ఆవిష్కరించారు. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని అన్నారు.
ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి పల్లకి సేవాకార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులుకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కుందూరు తిరుపతిరెడ్డి భక్తులు పాల్గొన్నారు.
AP: సాలూరులో మంత్రి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. ప్రతి అర్హుడి తలుపు వద్దకే సంక్షేమం చేరేలా పనిచేస్తున్నామని తెలిపారు.