VZM: పని ప్రదేశంలో నీరు, మెడికల్ కిట్ తప్పనిసరిగా ఉండాలని APO సాయిరాం సూచించారు. బుధవారం బాడంగి మండలం ఉపాధిహామీ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామ పంచాయతీలో పనులు కల్పించాలని,100 రోజుల ప్రగతిపైన FAలపైన దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లు వేతన శ్రామికులతో దగ్గరుండి పని చేయించి దినసరి కూలీ 300 వచ్చే విధంగా చూడాలన్నారు.
ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు సూర్యుడిలా ప్రకాశిస్తారని విదురుడు ధృతరాష్ట్రుడికి వివరించాడు. ‘ఎదుటివారిని శిక్షించే సామర్థ్యం ఉండి కూడా, కోపాన్ని అణచుకుని క్షమించే వ్యక్తి. అలాగే తన దగ్గర చాలా తక్కువ వనరులు ఉన్నా, ఇతరుల కష్టాన్ని చూసి చలించి తనకున్న దానిలోనే దానం చేసే పేదవాడు. ఈ ఇద్దరికీ దైవత్వం సిద్ధిస్తుంది, సమాజం వీరిని ఎప్పటికీ స్మరించుకుంటుంది’ అని విదురుడు చెప్పాడు.
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి తడవకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కే. సురేఖ సూచించారు. మార్కెట్‌లో మొత్తం 46 షెడ్లు ఉండగా, వాటిలో సుమారు 50 వేల నుంచి 80 వేల బస్తాల వరకు నిల్వ చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. వర్షం సంభవించిన ధాన్యంపై కప్పుకునేందుకు పర్దాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
KMM: ఖమ్మం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సులో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై కీలక సూచనలు చేశారు. ప్రమాదాల నివారణకు ప్రతి డ్రైవర్ క్రమశిక్షణతో వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు 40 గ్రామాల్లోని 1,998 మంది రైతులు నష్టపోయారు. మొత్తం 3,887 ఎకరాల్లో మొక్కజొన్న (2,356 ఎకరాలు), సన్ఫ్లవర్ (1,531 ఎకరాలు)పంటలు దెబ్బతిన్నాయి.తొగుట మండలంలో డీఏవో స్వరూప రాణి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. ఈ నివేదికను కలెక్టర్కు సమర్పించి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాధితులను ఆదుకుంటామని తెలిపారు.
NLR: కలిగిరి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు బుధవారం చెత్త సేకరణ బండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, సమర్థవంతమైన పారిశుధ్య నిర్వహణ కోసం ఈ బండ్లు, డస్ట్ బిన్లు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణానికి పంచాయతీల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
RR: కొత్తగూడ ఇజ్జత్ నగర్ హైటెక్స్ గేట్ నుంచి మెహదీపట్నం, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీస్ పునరుద్ధరించాలని అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ బస్సు సర్వీసు ఉండేదని ఇటీవల నిలిపివేయడంతో జీహెచ్ఎంసీ ఉద్యోగులు, తదితరులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
MHBD: బయ్యారం మండల కేంద్రంలో పోలీసులు ఓ 17 ఏళ్ల బాలికను నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావం చేసిన కేసులో ఇద్దరు వైద్యులు, నలుగురు ఆసుపత్రి సిబ్బందిని బుధవారం అరెస్ట్ చేశారు. బాలికపై గతంలో లైంగిక దాడి జరిగి ఆమెకు గర్భం వచ్చింది. ప్రైవేటు ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా గర్భస్రావం చేయించారని కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి వెల్లడించారు.
KKD: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 26 మంది ఆర్డీవోలను అమరావతి జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. కాగా బదిలీ అయిన వారిలో కొత్తపేట ఆర్డీవో శ్రీకర్, రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిల, అమలాపురం ఆర్డీవో కే.మాధవి ఉన్నారు. వీరి స్థానాల్లో కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
AP: ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ తెప్పోత్సవాలు మార్చి 2 వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్ల దర్శనం జరగనుంది. ఈ కారణంగా ఈనెల 28, మార్చి 1, 2న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను అధికారులు రద్దు చేశారు.
ప్రకాశం: మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి రూప శ్రీ న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని అన్నారు. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకునేందుకు చూడాలని సూచించారు. వాది, ప్రతివాదులకు లోక్ అదాలత్పై అవగాహన కల్పించాలని ఆమె కోరారు.
ATP: గుత్తి మండలం రజాపురం గ్రామంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు మార్చి 1న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగజ్యోతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్ ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావాలన్నారు.
కోనసీమ: కొత్తపేట మండలం మోడేకుర్రు పరిధిలోని 11 కేవీ లైను మరమ్మతుల నిమిత్తం గురు, శుక్ర, శని వారాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రాంబాబు తెలిపారు. ఆయా రోజుల్లో కడలివారిపాలెం, యలమంచిలి వారిపేటలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
PLD: చిలకలూరిపేట పట్టణంలో చోరీకి గురైన 10 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటిని అర్బన్ సీఐ పి.రమేష్ బుధవారం బాధితులకు అప్పగించారు. పట్టణంలో పోయిన సెల్‌ఫోన్‌లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేసి వీటిని పట్టుకున్నారు. చోరీలను అరికట్టి, ప్రజల ఆస్తులను రక్షించేందుకు తమ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని సీఐ తెలిపారు.