MNCL: బెల్లంపల్లి శాంతిఖని గనిలో అన్వేష్ అనే కార్మికుడు బుధవారం ఊపిరి అడక స్పృహ తప్పాడు. అతనితో పని చేస్తున్న తోటి కార్మికులు వెంటనే అతన్ని ఉపరితలానికి తీసుకొచ్చారు. పని స్థలాల్లో ముందస్తుగా స్ట్రెచర్ ఏర్పాటు చేస్తారు. కాని స్ట్రెచర్ లేకపోవడంతో అప్పటివరకూ అక్కడే కార్మికుడు ఉండిపోయారు. అనంతరం కార్మికుడిని ఆసుపత్రికి తరలించారు.
WGL: ఖానాపురం మండలం అశోక్ నగర్ సైనిక్ స్కూల్‌ను ఎంపీడీవో వనపర్తి అద్వైత బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఉపాధ్యాయుల హాజరు, బోధన తీరును పరిశీలించారు. ఆర్మీ ఇన్స్ట్రక్టర్, కెమిస్ట్రీ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
TG: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత టాప్ టెన్ ఇష్యూలో నేరెళ్ల బాధితుల ఇష్యూ ఒకటని తీన్మార్ మల్లన్న అన్నారు. నేరెళ్ల బాధితులను ఆయన పరామర్శించారు. నేరెళ్ల బాధితులను హింసించినటువంటి వాళ్ళు ప్రమోషన్లలో ఉన్నారని, వీళ్లను వాడుకున్న వారు పదవుల్లో ఉన్నారన్నారు. నేరెళ్ల బాధితుల వద్దకు లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందిందని అన్నారు.
MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రిన్సిపల్ శంకర్ పిలుపునిచ్చారు. 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు బుధవారం ఇంటర్ సెకండియర్ పరీక్షా కేంద్రాల వద్ద కరపత్రాలను పంపిణీ చేశారు. డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. నిష్టాతులైన అధ్యాపకులు విద్యా బోధన చేపడుతున్నట్లు వివరించారు.
SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఉమెన్ కాలేజీలో విద్యార్థినులకు కరాటే , డిఫెన్స్ టెక్నిక్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఏఎస్పీ కె.వి.రమణ హాజరయ్యారు. విద్యార్థినులకు విద్యతో పాటు స్వీయ రక్షణ శిక్షణ కూడా అవసరమని, మహిళల భద్రత కోసం పోలీసులు అండగా ఉంటామన్నారు.
KRNL: ఎమ్మిగనూరు వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలు అమలు చేయలేదని, అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. శాంతియుత ఆందోళనలపై బలప్రయోగం చేయడం అన్యాయమని పేర్కొంటూ, సమస్యలు పరిష్కరించకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా మహా ధర్నా నిర్వహిస్తామన్నారు.
KMM: ఈ నెల 7న సీపీఎం టూటౌన్ కమిటీ ఆధ్వర్యంలో మొదటి శనివారం ఖమ్మం మంచికంటి హాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల మధ్యలో బీపీ, షుగర్, పక్షవాతం, కంటి, చెవి, ముక్కు, గొంతు తదితర పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
TG: హైదరాబాద్ తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహావిందు ఘనంగా జరుగుతోంది. ఈ విందుకు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. కాగా, విజయ్, రష్మికల పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్‌లో జరిగిన విషయం తెలిసిందే.
MGL: మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఇవాళ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ మాట్లాడుతూ. రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంలో అందులో ఒకటి మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
ADB: బోథ్ మండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వేద పండితుడు మేఘనాథ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాల నిర్మాణాలతోనే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని మేఘనాథ్ శర్మ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: బాపులపాడు మండలం వేలేరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధనియాల సాయి గణపతి సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు,పెన్నులు తదితర పరీక్ష సామాగ్రిని బుధవారం పంపిణీ చేశారు. ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులు సెల్ ఫోన్, టీవీ, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు.
సంజూ శాంసన్ పట్టుదలను భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కొనియాడాడు. ‘సంజూ నెట్స్‌లో ఎప్పుడూ కష్టపడి ప్రాక్టీస్ చేస్తాడు. అవకాశం వచ్చినప్పుడు కీలక మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. కష్టకాలంలోనూ ఆశ కోల్పోకుండా, పట్టుదలగా శ్రమించినందుకే ఈ విజయం దక్కింది’ అని మోర్కెల్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌పై సంజూ ఆడిన ఇన్నింగ్స్ అతనిలోని అసలైన క్లాస్‌ను చూపించిందన్నాడు.
SRCL: తంగళ్ళపల్లి మండలం పెద్ద పాపాయ్య పల్లి చెరువులో పడి ఇద్దరు రైల్వే ట్రాక్ కూలీల మృతి చెందారు. రైల్వే ట్రాక్ పనులకు వివిధ రాష్ట్రాల కూలీలు వచ్చారు. ఇవాళ హోలీ వేడుకలు జరుపుకున్న అనంతరం జైనూరుకు చెందిన నాగార్జున, గుంటూరుకు చెందిన రత్తయ్య స్నానం చేసేందుకు సమీప చెరువులోకి వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయారు. ఒక మృతదేహం లభ్యం కాగా మరో మృతదేహం దొరకలేదు.
MHBD: ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలతో రైతులు తీవ్రంగా భయాందోళన చెందిన ఘటన కొత్తగూడ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గోపాలపురం రహదారి వెంబడి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పును వదిలారు. రహదారితో పాటు పరిసర ప్రాంతంలో తీవ్రంగా మంటలు వ్యాపించాయి. సమీపంలోని మొక్కజొన్న పంటల వైపు వెళ్లడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు.
WNP: పెద్దమందడి, వెల్టూర్‌లలో కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం పర్యటించారు. పలువురు లబ్ధిదారులు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాలకు అవుతున్న ఖర్చుపై ఆరాతీశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణాలకు ఎక్కడ అప్పు తీసుకోవద్దని, ఆర్థిక ఇబ్బంది ఉన్న లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని MPDOను ఆదేశించారు.