VZM: మెరకముడిదాం మండలం సిరియాలపేటలో ఈనెల 6 నుంచి మూడు రోజుల పాటు శ్రీ సీతారామ సహిత శ్రీలక్ష్మి గణపతి, కోదండ రామాలయ ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నాయి. 06న ఉత్సవ ఊరేగింపు, 07న సూర్యనమష్కారాలు, 08న ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
KDP: గండికోటలో జూలై 14, 2025న జరిగిన వైష్ణవి హత్య కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ విషయాన్ని జమ్మలమడుగు అర్బన్ సీఐ నరేశ్ వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానిత ముద్దాయిలపై కోర్టు ఉత్తర్వులతో గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
AKP: నర్సీపట్నం సివిల్ జడ్జి కోర్టు భవనానికి రెండో అంతస్తు నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.09కోట్ల నిధులు మంజూరు చేసినట్లు స్పీకర్ చింతకాయలు అయ్యన్నపాత్రుడు తెలిపారు. కోర్టు భవన విస్తరణ ద్వారా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. నిధులు మంజూరు చేయించిన స్పీకర్‌కు న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
MDK: తూప్రాన్ పట్టణ పరిధి బ్రాహ్మణపల్లికి చెందిన మలేరియా డాక్టర్‌గా గుర్తింపు పొందిన చేపూరి యాదగిరి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం చేసిన యాదగిరి గ్రామంలో మలేరియా డాక్టర్‌గా పేద ప్రజలకు మంచి సేవలు చేశారు. ఆయన మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
సోషల్ మీడియాపై నటుడు తనికెళ్ల భరణి అసహనం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై అవాస్తవాలు రాస్తున్నారని మండిపడ్డారు. తాను అన్ని మతాలను, వర్గాలను గౌరవిస్తాని పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ కించపరచలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ కొటేషన్లు సృష్టించడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
VZM: మహిళా సాధికారత వారోత్సవాలలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో కొత్తవలస పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగలపాలెంలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. మహిళలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.
GDWL: రైతు భరోసా పథకం నగదు జమ కావడం కోసం రైతులు రిజిస్ట్రీ చేయించుకోవాలని ధరూర్ AEO స్వరూప తెలిపారు. పాస్‌బుక్ ఉన్న ప్రతి రైతు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. వివరాల నమోదు కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లాలని ఆమె సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని AEO పేర్కొన్నారు.
KNR: హుజూరాబాద్–జమ్మికుంట ప్రధాన రహదారిలోని బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్, డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో డీసీఎం వ్యాన్ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. బైపాస్ రోడ్డు కూడలి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, సూచికలు లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణమని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
BHPL: చిట్యాల మండలంలోని పలు గ్రామాలలో సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. ఆకాశంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారిన అరుదైన ‘బ్లడ్ మూన్’ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. గ్రహణం కారణంగా చిట్యాలలోని ప్రధాన ఆలయాలను ఉదయమే మూసివేసి, శుద్ధి అనంతరం పునఃప్రారంభించనున్నారు. ఖగోళ ప్రేమికులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పులకించిపోయారు.
KRNL: ఆదోని పట్టణంలోని తిరుమల నగర్లో మంగళవారం ఓ బ్యాంకు ఉద్యోగి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగులగొట్టి బీరువాలోని రూ. 1,50,000 నగదు, ఆరు గ్రాముల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీనియర్ జర్నలిస్ట్ మూర్తిని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయంపై నటి మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘ఆయనకు తగిన శాస్తి జరిగింది’ అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రవర్తనకు ఇలాంటి చర్యలు అవసరమని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.
కృష్ణా: గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పోలీసులతో ఎమ్మెల్యే రాము మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం దృష్ట్యా నెలకొన్న ట్రాఫిక్ రద్దీ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా సందర్భాన్ని బట్టి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
WGL: HYDలోని సచివాలయంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో మంగళవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాల అమలు, జిల్లాల్లో పురోగతి, సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. రామకృష్ణారావు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు తదితరులు హాజరయ్యారు.
GNTR: పొన్నూరు నియోజకవర్గంలోని మూడు ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ. 8.20 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం తెలిపారు. ఇందులో భాగంగా చింతలపూడి రోడ్డుకు రూ. 4.20 కోట్లు, గోవాడ రోడ్డుకు రూ. 3.50 కోట్లు, పాండ్రపాడు రోడ్డుకు రూ. 50 లక్షలు కేటాయించామని పేర్కొన్నారు. ఈ రహదారుల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.