• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శాసనమండలి నిరవధిక వాయిదా 

AP: శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై వాడీవేడిగా చర్చ జరిగింది. వైసీపీ నేతల మాటల దాడులకు కూటమి నేతలు ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.

March 6, 2026 / 05:26 PM IST

‘డ్వాక్రా మహిళలు సహకరించాలి’

AKP: శత శాతం ఇంటి పన్నుల వసూళ్లకు డ్వాక్రా మహిళలు సహకరించాలని ఎస్.రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వమ్మవరంలో డ్వాక్రా మహిళల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇంటి పన్నులు ఇంతవరకు చెల్లించని వారు వెంటనే చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

March 6, 2026 / 05:26 PM IST

పీఎం నరేంద్ర మోడీ లైవ్‌ను వీక్షించిన రైతన్నలు

NLR: విడవలూరు మండలంలోని దంపూరు రైతు సేవ కేంద్రం పరిధిలో పోస్ట్ బడ్జెట్ webinar కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లైవ్ టెలికాస్ట్‌ను రైతులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ శాఖల యొక్క అభివృద్ధి, పురోగతిపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఏవో లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

March 6, 2026 / 05:25 PM IST

నేటి OTT రిలీజ్‌లు ఇవే!

నెట్‌ఫ్లిక్స్‌: విత్ లవ్ – తెలుగు డబ్బింగ్, హలో బచ్చోన్ – తెలుగు డబ్బింగ్ సిరీస్, వార్ మెషీన్ – తెలుగు డబ్బింగ్ సినిమా, ది డైనోసార్స్ – తెలుగు డబ్బింగ్ సిరీస్; జియో హాట్‌స్టార్: విక్రమ్ ఆన్ డ్యూటీ – తెలుగు సిరీస్; జీ5 ఓటీటీ: గాంధీ టాక్స్ – తెలుగు సినిమా; ఆహా: అనగనగా ఆస్ట్రేలియాలో- తెలుగు సినిమా.

March 6, 2026 / 05:23 PM IST

అదుపు తప్పి బైక్ బోల్తా.. వ్యక్తి మృతి

SDPT: హుస్నాబాద్ కస్తూరిబా కాలనీ సమీపంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిగురుమామిడి మండలం కొండాపూర్‌కి చెందిన జంగాపల్లి సాంబరాజు(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

March 6, 2026 / 05:22 PM IST

ఇరాన్‌పై యుద్ధం ఆపాలని సీపీఎం నిరసన ర్యాలీ

ATP: అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై చేస్తున్న దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు ఖనిజ సంపద ఉన్న ఇరాన్ దేశం‌‌‌పై దాడి చేయడం చాలా దారుణం అన్నారు.

March 6, 2026 / 05:20 PM IST

ఆర్డీటీని కాపాడుకుందామని అఖిలపక్షం పిలుపు

సత్యసాయి: ధర్మవరంలో ‘ఆర్డీటీని రక్షించుకుందాం’ అనే నినాదంతో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దశాబ్దాలుగా అనంత ప్రజల జీవనాడిగా మారి పేదలకు సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థపై ప్రతికూల చర్యలు ఆపాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సంస్థ ప్రతి గడపకూ చేరువైందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.

March 6, 2026 / 05:20 PM IST

కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా

కర్నూలు: మధ్యాహ్న భోజన కార్మికులు స్కూల్ స్కావెంజర్లు, నైట్ వాచ్‌మెన్‌లకు వేతనాలు పెంచి, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేసి, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు వినతిపత్రం అందించారు.

March 6, 2026 / 05:20 PM IST

ఇంటి పన్ను వసూళ్లను పరిశీలించిన పంచాయతీ అధికారి

ప్రకాశం: కంభంలో ఇంటి పన్ను వసూళ్లను జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. మార్చి 15 నాటికి ఇంటి పన్నులు 100 శాతం వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందాలతో సమీక్ష నిర్వహించి వసూళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ విజయలక్ష్మి, బ్రహ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

March 6, 2026 / 05:20 PM IST

ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసీ రంగం కీలకం: అశోక్

W.G: ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసీ రంగం కీలకమని ప్రిన్సిపల్ టి.అశోక్ అన్నారు. ఫార్మసీ పితామహుడు మహాదేవ్ లాల్ ప్రాఫ్ జయంతి సందర్భంగా శుక్రవారం తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఫార్మసీ విద్యార్థులు నైతిక విలువలు, సేవ భావంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు.

March 6, 2026 / 05:19 PM IST

మా ఓటమికి కారణం అదే: మెకల్లమ్

సెమీఫైనల్‌లో తాము ఓడిపోవడానికి అక్షర్ పటేల్ అందుకున్న రెండు అద్భుతమైన క్యాచ్‌లే కారణమని ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్ అభిప్రాయపడ్డాడు. అక్షర్ పట్టుకున్న బ్రూక్, జాక్స్ క్యాచ్‌లే మ్యాచ్‌ను తమ నుంచి దూరం చేశాయని వ్యాఖ్యానించాడు. ఒత్తిడి సమయాల్లో అక్షర్ అసాధారణమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. తాము ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉండాల్సిందని పేర్కొన్నాడు.

March 6, 2026 / 05:19 PM IST

మాచర్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించిన సీఐ

PLD: మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాచర్ల అర్బన్ సీఐ వెంకటరమణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో విధులు ఏ విధంగా ఉంటాయని, ఎవరు ఎలా విధులు నిర్వహిస్తారని విద్యార్థులకు వివరించారు.

March 6, 2026 / 05:18 PM IST

‘ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి’

కడప: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి డా.హరి కొండయ్య తెలిపారు. సిద్దవటం ZP ఉన్నత పాఠశాలలో బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి మార్చి 12 వరకు జరుగు నిరసనలో భాగంగా ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్ ధరించి విధులకు హాజరయ్యారు.

March 6, 2026 / 05:17 PM IST

పాతపాడు-నివగాం రహదారికి శంకుస్థాపన

SKLM: కొత్తూరు మండలంలోని పాతపాడు-నివగాం గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి శంకుస్థాపన శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు డాక్టర్ సాయి గణేష్ హాజరై రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. Aరూ.1.50 కోట్ల నిధులతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకి సూచించారు.

March 6, 2026 / 05:16 PM IST

చిట్యాల ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం

NLG: చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉ. 9 గంటల నుండి ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన గైనకాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్, డెంటల్ మరియు ఆప్తమాలజీ నిపుణులు రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి వైద్యం అందిస్తారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

March 6, 2026 / 05:16 PM IST