• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయి: మంత్రి

AP: వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఏడాది మిర్చి అత్యధిక ధర పలుకుతోందని చెప్పారు. గుంటూరు మిర్చి యార్డును తరలించాలని ప్రతిపాదనలు ఉన్నాయని.. ఆధునిక యార్డు నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. అలాగే, గత పాలకులు మిర్చి యార్డును అవినీతికి నిలయంగా మార్చారని ఆరోపించారు. రైతు పరామర్శ పేరుతో యార్డుకు వచ్చి నానాయాగి చేశారని విమర్శించారు.

February 21, 2026 / 12:59 AM IST

ఫిబ్రవరి 21: చరిత్రలో ఈరోజు

➢1804: మొదటిసారి ప్రయాణించిన స్టీమ్ ఇంజిన్ రైలు➢2013: HYDలోని దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస పేలుళ్లు➢1894: శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ జననం➢1945: భారత మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ జననం➢1951: శాస్త్రవేత్త దేవరాజు మహారాజు జననం➢2022: వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం➢అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

February 21, 2026 / 12:46 AM IST

రాళ్లతో దాడి చేసుకున్న రెండు వర్గాలు

TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఓ మార్ట్‌లో సౌండ్ సిస్టమ్ విషయంలో వివాదం తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

February 21, 2026 / 12:30 AM IST

ఫిబ్రవరి 21: శనివారం

➢ ఫజర్: తెల్లవారుజామున 5:27 గంటలకు➢ సూర్యోదయం: ఉ.6:40 గంటలకు➢ దుహర్: మ.12:30 గంటలకు➢ అసర్: సా.3:51 గంటలకు➢ మఘ్రిబ్: సా.6:21 గంటలకు➢ ఇష: రా.7:33 గంటలకుగమనిక: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

February 21, 2026 / 12:16 AM IST

భారీగా పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్

TG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 27 మంది డిప్యూటీ సీఈవోలు.. సీఈవోలుగా పదోన్నతి పొందగా, 55 మంది MPDOలు డిప్యూటీ CEOలుగా పదోన్నతి పొందారు. ఖాళీగా ఉన్న 28 MPDO పోస్టుల నుంచి డిప్యూటీ సీఈవోలుగా, 15 మంది డిప్యూటీ సీఈవోల నుంచి సీఈవోలుగా పదోన్నతులు కల్పిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

February 20, 2026 / 11:34 PM IST

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి కోర్టు నోటీసులు!

AP: భార్యాభర్తల వివాదంలో జోక్యం చేసుకుని బెదిరించిన కేసులో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మరో 11 మందికి నోటీసులు ఇస్తూ భీమడోలు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, గతంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు వారందరిపై హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినప్పటికీ తదుపరి చర్యలు ముందుకు సాగలేదు.

February 20, 2026 / 11:16 PM IST

గంజాయితో పట్టుబడిన 11 మంది అరెస్టు

AP: విజయనగరం జిల్లా కోమటిపల్లిలో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ భవ్యరెడ్డి వెల్లడించారు. గంజాయి విక్రయిస్తున్న నలుగురిని, తాగుతున్న ఏడుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గణేష్, అఖిల్, లంకచంద్రులు అనే వ్యక్తులు ఒడిశా రాయగడ నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తుండగా అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో పట్టుబడిన బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు.

February 20, 2026 / 10:59 PM IST

బండి సంజయ్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు

TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు చేశారు. ‘బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. ఆడియోలు, వీడియోలు ఉన్నాయని బెదిరించడం కాదు. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలి. కల్వకుంట్ల కుటుంబంపై విచారణకు ఆదేశిస్తే.. బీజేపీ ఎందుకు స్పందించడం లేదు’ అని ప్రశ్నించారు.

February 20, 2026 / 11:25 PM IST

ఈనెల 28 వరకు ఆంక్షలు

AP: విశాఖలో ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తతలతో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. అనుమతి లేకుండా ఊరేగింపులు, సభలు నిషేధించారు. ఈనెల 28 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ముందస్తుగా అనుమతులు తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

February 20, 2026 / 10:31 PM IST

భూభారతి ఫైళ్లు మూలన.. కలెక్టర్ ఆగ్రహం

GDWL: గడువులోగా పని పూర్తి చేయకుంటే మిమ్మల్ని ఇంటికి పంపడానికైనా వెనుకాడం అని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా తహసీల్దార్ అధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్డీవో స్థాయిలోనే 1370 భూభారతి ఫైళ్లు మూలన పడటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సామాన్యుడి కన్నీరు తుడవని రెవెన్యూ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు.

February 20, 2026 / 10:06 PM IST

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ AP: కల్తీ నెయ్యిపై విచారణకు వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు✦ శాసనమండలిలో శ్రీవారి ఫొటోలతో వైసీపీ నిరసన✦ TG: HYDలో ఏఐ పవర్ రూం ఏర్పాటు చేయాలి: రేవంత్✦ గోదావరి, కృష్ణా నీళ్లను ఆంధ్ర తరలించుకుపోతుంది: హరీష్‌రావు✦ ట్రంప్ సుంకాలను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు✦ టీ20WCలో ఒమన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

February 20, 2026 / 10:00 PM IST

T20 WC: రేపటి నుంచే ‘సూపర్-8’ పోరు

T20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ ముగిసింది. రేపటి నుంచి అసలైన సమరం ‘సూపర్-8’ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్-2లో భాగంగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. గ్రూప్ దశలో ఈ రెండు జట్లు.. చెరో మ్యాచ్‌లో ఓటమిపాలైనప్పటికీ సూపర్-8లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాయి.

February 20, 2026 / 11:25 PM IST

‘రాజకీయం కోసం శ్రీవారిని వివాదాల్లోకి లాగొద్దు’

AP: రాజకీయ పంతాల కోసం శ్రీవారిని వివాదాల్లోకి లాగవద్దని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తెలిపారు. హైందవ ధర్మాన్ని బజారుకీడ్చడం తగదని, లడ్డూ కల్తీ అంశంపై పదేపదే మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని ఆయన పేర్కొన్నారు.

February 20, 2026 / 09:49 PM IST

ఎచ్చెర్లలో మెగా జాబ్ మేళా

SKLM: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 23న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి సాయికుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మొత్తం 13 ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని సుమారు 400 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 18–30 ఏళ్లు వయస్సు గల యువతీ యువకులు అర్హులు అని తెలిపారు.

February 20, 2026 / 09:44 PM IST

ఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల

TG: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి, రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు నిర్వహించే అర్హ‌త ప‌రీక్ష ‘టీజీ ఎడ్-సెట్-2026’ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష నిర్వహిస్తారు.

February 20, 2026 / 09:42 PM IST