• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈనెల 24 నుండి ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు

TPT: విజయవాడలోని ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శాప్ (SAP) ఛైర్మన్ రవి నాయుడు గారితో క్రీడా వేదికలు, మైదానాల సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే శ్రీకాళహస్తిలో ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని అభివృద్ధి చేయాలని శాప్ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. యువ క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందించాలని కోరారు.

February 23, 2026 / 11:39 AM IST

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NRML: భైంసా పట్టణంలో 141 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను సోమవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులందరికీ పథకాల లాభాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

February 23, 2026 / 11:38 AM IST

విదేశీ భారతీయులకు 24 గంటలు.. ఉచిత సేవలు

పాస్‌పోర్ట్ సమస్యలపై సహాయం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఉచితంగా సంప్రదించేలా 24 గంటల పాటు అంతర్జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానుంది. దీని ద్వారా ఒకే సార్వత్రిక నంబర్‌తో నేరుగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రతినిధులతో మాట్లాడి సమస్యలను ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.

February 23, 2026 / 11:37 AM IST

ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంత

KNR: సైదాపూర్ మండలంలోని సైదాపూర్-మొలంగూర్ ప్రధాన రహదారిపై సోమారం శివారులో ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. రోడ్డు మధ్యలో ఉన్న ఈ గుంత వాహనం సమీపానికి వెళ్లే వరకు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం మరింత నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతను పూడ్చాలని కోరుతున్నారు.

February 23, 2026 / 11:35 AM IST

ప్రాథమిక పాఠశాలల్లో నియామకాలు

SRD: పటాన్ చెరువు, రామచంద్రపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను చేపట్టే ఈ నియామకాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు సంబంధిత మండల వనరుల కేంద్రాల్లో (MRC) దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

February 23, 2026 / 11:31 AM IST

గురుకులంలో ‘మాక్ పార్లమెంట్’ ఆకట్టుకుంది

BDK: అశ్వారావుపేట ప్రభుత్వ మైనారిటీ బాలికల గురుకులంలో నిర్వహించిన ‘మాక్ పార్లమెంట్’ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ప్రిన్సిపల్ సంగీత రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థినులకు పార్లమెంటరీ విధానాలపై శిక్షణ ఇచ్చారు. స్పీకర్‌గా తాజాని, ప్రధానిగా ఎం.డి. ఆయేషా నిమ్రా పాత్రలను సమర్థంగా పోషిస్తూ సభా నిర్వహణను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు.

February 23, 2026 / 11:31 AM IST

అక్రిడిటేషన్ కార్డుల వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా

HYD: బాధ్యతగల జర్నలిస్టులకు అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ ప్రభుత్వ కార్డులు అందుతాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు అక్రిడిటేషన్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

February 23, 2026 / 11:31 AM IST

‘ఎర్రం నాయుడు ఆశయ సాధనలకు కృషి చేయాలి’

SKLM: కొత్తూరు మండల కేంద్రంలో దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రం నాయుడు 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైస్ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకులు లోతుగడ్డ తులసి వరప్రసాద్ నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాసేవ, నిబద్ధత, రాజకీయ విలువలను స్మరించుకుంటూ, నేటి యువత మాజీ కేంద్రమంత్రి ఆశయ సాధనాలకు కృషి చేయాలన్నారు.

February 23, 2026 / 11:30 AM IST

విజ్జిస్టేడియంను పరిశీలించిన గోవా గవర్నర్

విజయనగరం విజ్జిస్టేడియంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ముఖ్యఅతిథిగా విజయనగరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా విజ్జి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గల అన్నీ డిపార్ట్‌మెంట్లను గవర్నర్ పరిశీలించారు. వాటి పనితీరును, అభివృద్ధి, తదితర అంశాలపై స్పోర్ట్స్ అభివృద్ధి అధికారితో వివరాలు అడిగారు.

February 23, 2026 / 11:30 AM IST

ట్రాఫిక్ జామ్‌ నివారణకు ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్

కృష్ణా: పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై-2 సోమవారం బస్టాండ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లతో కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్లపై ఆటోలను అడ్డంగా నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రయాణికులను ఎక్కించడం, దింపడం కోసం నిర్ణయించిన ప్రదేశాలనే ఉపయోగించాలని డ్రైవర్లకు సూచించారు.

February 23, 2026 / 11:30 AM IST

స్మార్ట్ ఆటోమేటెడ్ పార్కింగ్ ప్రారంభం

TG: దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌ నాంపల్లిలో సిబ్బంది లేకుండా ఆటోమేటెడ్ పార్కింగ్ సిస్టమ్ ప్రారంభమైంది. సుమారు రూ.200 కోట్లతో నిర్మించిన ఈ రోబోటిక్ పార్కింగ్ వ్యవస్థలో 250 కార్లు, 200 బైక్‌లను సులభంగా పార్క్ చేయవచ్చు. దీనివల్ల వాహనదారులకు సమయం ఆదా కావడంతోపాటు నగరంలోని పార్కింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రోబోల సాయంతో వాహనాలను పార్క్ చేయొచ్చు.

February 23, 2026 / 11:30 AM IST

మహిళా సంఘాలకు సొంత భవనాలు

BHNG: జిల్లాలో మహిళా సంఘాల కోసం ప్రభుత్వం సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్న సంఘాల కోసం ఒక్కో భవనానికి రూ. 10 లక్షల నిధులు కేటాయించింది. ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే 186 భవనాలకు అనుమతులు లభించాయి. 200 గజాల స్థలంలో నిర్మించే ఈ భవనాలు పూర్తయితే మహిళలు సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది.

February 23, 2026 / 11:26 AM IST

కిలాడీ మహిళల చోరీ.. బొట్టు పెట్టి బురిడీ

KNR: కొత్తపల్లి మండలం రేకుర్తిలో విస్తుపోయే దొంగతనం వెలుగుచూసింది. అమ్మవారికి మట్టెలు చేయిస్తామని, ఆర్థిక సాయం కావాలంటూ ఇద్దరు మహిళలు రాగా.. అనూష అనే యువతి కొంత నగదు సహాయం చేశారు. అయితే అనుషను మాటల్లో దించి, ఆమె నుదుట మత్తుమందు కలిపిన బొట్టు పెట్టారు. ఈ క్రమంలో అనూష స్పృహ కోల్పోగా, అనంతరం ఇంట్లోని నగదు, నగలతో పరారయ్యారని బాధితురాలు ఫిర్యాదు చేశారు.

February 23, 2026 / 11:25 AM IST

అక్రమంగా మట్టి తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు

WGL: గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మల గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతి లేకుండా JCB సాయంతో మట్టి తవ్వి తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు గీసుగొండ CI విశ్వేశ్వర్ ఇవాళ తెలిపారు. అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి JCBని సీజ్ చేసినట్లు CI వెల్లడించారు.

February 23, 2026 / 11:24 AM IST

అనంతపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఓ.ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ తదితర అధికారులతో కలిసి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

February 23, 2026 / 11:23 AM IST