పాస్‌పోర్ట్ సమస్యలపై సహాయం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఉచితంగా సంప్రదించేలా 24 గంటల పాటు అంతర్జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురానుంది. దీని ద్వారా ఒకే సార్వత్రిక నంబర్‌తో నేరుగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రతినిధులతో మాట్లాడి సమస్యలను ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది.