BHNG: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు.