చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి రోజా విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ నాయకులకే లోకేష్ పాదయాత్ర అంటే భయంగా ఉన్నట్లు ఉందన్న రోజా లోకేష్ అడుగు పెడితే పార్టీ పరిస్థితి 23 స్థానాల నుంచి దిగజారుతుందని టీడీపీ నాయకులకు భయంగా ఉందని అన్నారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ లో చంద్రబాబు ఫోటో కూడా లేదని, లోకేష్ పాదయాత్ర ప్రజల కోసం కాదు… లోకేష్ ఫిట్ నెస్ కోసమేనని అన్నారు. లోకేష్ పాదయాత్ర ఆపాల్సిన పని తమకు ల...
భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో అతనికి ఇద్దరు యువకులు రజత్ కుమార్, నిషు కుమార్ సాయపడ్డారు. రిషబ్ కారు కాలిపోతున్న సమయంలో అతనికి చెందిన వస్తువులు, నగదును వీరిద్దరు బయటకు తీశారు. అలా ఆ కారు నుండి తీసిన రూ.4వేలను కూడా వారు తిరిగి పోలీసులకు అందించారు. వీరి నిజాయితీకి ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌ను వీరిద్దరు పరామర్శించారు. అన్న...
రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో లేదా ఎన్నిల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే అవకాశాలు ఉన్నాయా? మొదట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ రాకుంటే హంగ్ ఏర్పాటయ్యే పక్షంలో హస్తం-కారు దోస్తీ తప్పదా? జాతీయ రాజకీయాల్లోను ఎన్డీయే వ్యతిరేక కూటమి యూపీఏకు వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు నేపథ్యంలో కేసీఆర్ కూడా అదే మార్గంలో నడవక తప్పదా? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో సమయంలో.. తొక్కిసలాట జరిగి దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే… గుంటూరులోనూ చంద్రబాబు సభలోనే తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరస రెండు సంఘటలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో బహిరంగంగా రోడ్లపై...
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని పార్టీల ముఖ్య నేతలు… తమ పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. చంద్రబాబు సైతం.. పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో సరిగా పని చేయని నేతలకు వార్నింగ్ లు కూడా ఇస్తున్నాయి. ఇలా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని బాధతో… రాజానగరం టీడీపీ ఇన్ ఛార్జ్ పదవికి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకట...
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. 20ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన సంఘటన అందరినీ కలచి వేసింది. కాగా.. ఈ ఘటనపై తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గు...
అన్ని విషయాలపై స్పందించే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కారణంగా అంత మంది ప్రాణాలు కోల్పోతే ఎందుకు స్పందించడం లేదని మంత్రి రోజా ప్నశ్నించారరు. సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన ఆమె… చంద్రబాబు, పవన్ లపై విమర్శలు కురిపించారు. జగన్ ముఖ్యమంత్రి అవటం రాష్ట్రం అదృష్టమని ప్రజలు అనుకుంటున్నారని రోజా తెలిపారు. గత ఏడాదిలో చంద్రబాబు పనికి మాలిన పాత్ర పోషించాడని విమర్శించారు. జగన్‌ను తిట్టడానికే, చంద్రబాబు...
కాపు సామాజిక వర్గానికి చెందిన నేత తోట చంద్రశేఖర సోమవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే పలు పార్టీలు మారిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావం చూపే అవకాశం తక్కువేనని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో నిలకడగా ఉండగలుగుతారా? కాపు సామాజిక వర్గంలో ఎంత పట్టు ఉంది? అధికారిగా తప్ప, రాజకీయాల...
ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్ష తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఒక్కటయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ఓటీటీ ఆహాలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావడం పొత్తుకు మరింత సానుకూలత ఏర్పడిందని చెప్పేందుకు నిదర్శనమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహంతో పొత్తు ప్రయత్నాలపై మొదటికే మో...
ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది. పార్టీలో చేరే నేతలు కూడా పెరుగుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా… ఈ పార్టీ ప్రభావం ఏపీలో ఎంత ఉంటుంది అనే విషయంపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ మాత్రం ఉండదని కొడాలి నాని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో గానీ, రాష్ట్రానికి నష్టం కలిగించడంలో గానీ కేసీఆర్ పాత్ర ఉందని రాష్ట్ర ప్రజలు నమ్ముత...
తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగానే, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ తదితరులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆం...
బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి) ఏపీలోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ఏపీలోని నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. వారిలో.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఉన్నారు. నేటి సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర...
తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ దూకుడు కనిపిస్తోంది. నిన్నటి వరకు నిర్లిప్తంగా, సీనియర్లు-జూనియర్లు అంటూ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు కనిపించిన హస్తం పార్టీ సోమవారం జోరుమీద కనిపించింది. సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టేందుకు రావాలని ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ...
మనమంతా న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టాం. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో నగర యువత ఆనందంగా జరుపుకుంటోంది. చాలా మంది మద్యం మత్తులో ఊగితూగారు. న్యూఇయర్ వేడుకల్లో ఈసారి ఒక్క మద్యానికే కాకుండా ఇంకా చాలా వస్తువులు రికార్డుస్థాయిలో అమ్ముడుపోయాయి. అందులో కండోమ్స్ ఒకటి. నిన్న ఒక్కరోజే స్విగ్గీ 2757 డ్యూరెక్స్ కండోమ్ ప్యాకెట్లు డెలివరీ చేసిందంట. ఈ మేరకు ఒక సరదా ట్వీట్ చేసింది డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ. ఇప్పటి వరకు 275...
పెద్ద నోట్ల రద్దుపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఈ నోట్ల రద్దును సవాల్ చేస్తూ 58 పిటిషన్లు దాఖలయ్యాయి. 2023 కొత్త సంవత్సరంలో ఫస్ట్ వర్కింగ్ రోజున కీలకమైన తీర్పు వెలువరించింది సుప్రీం ధర్మాసనం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఐదుగురు సభ్యులతో...