shaakuntalam:శాకుంతలం (shaakuntalam) మూవీ ఈ నెల 14వ తేదీన (రేపు) ప్రపంచవ్యాప్తంగా విడుదల అవనుంది. మూవీకి (movie) సంబంధించిన ప్రమోషన్స్‌లో దర్శకుడు గుణశేఖర్ (gunasekhar), నటి సమంత (samantha) బిజీగా ఉన్నారు. శాకుంతలం మూవీలో తాను తీసుకున్న కథాంశం గురించి గుణశేఖర్ (gunasekhar) వివరించారు. శృంగార కోణానికి రెండో ప్రాధాన్యం ఇచ్చానని వివరించారు.
ఆత్మాభిమానం మెండుగా ఉన్న సౌందర్యరాశిని హైలైట్ చేశానని గుణశేఖర్ (gunasekhar) పేర్కొన్నారు. మహాభారతంలో గల ఆదిపర్వంలో గల శకుంతల కథకి కొన్ని పాత్రలను జోడించి అభిజ్ఞాన శాకుంతలాన్ని కాళిదాసు రాశారు.. ఆయన కోణంలో గొప్పగా మూవీ ఉంటుందని చెప్పారు.
శాకుంతలం మూవీ యువతకు కనెక్ట్ అవుతుందని విశ్వసించానని గుణశేఖర్ (gunasekhar) అంటున్నారు. శృంగార కోణానికి రెండో ప్రాధాన్యం ఇచ్చి.. ఆత్మాభిహానం హైలైట్ చేశానని తెలిపారు. ఆ రోజుల్లో పెళ్లి కాకుండానే శకుంతల బిడ్డకు జన్మనిస్తోంది. వ్యక్తుల వల్లే కాదు.. సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకతను చూసింది. విలువల కోసం.. ఆత్మాభిమానం కోసం నిలబడి.. అనుకున్నది సాధించే పురాణ స్త్రీ శకుంతల.. నేటి తరానికి స్ఫూర్తి అని చెప్పారు.
ఇప్పుడు మహిళలు కూడా పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడుతున్నారు. ఈ కథ ఇప్పటి యువతకు కనెక్ట్ అవుతుందని విశ్వసించా.. ప్రస్తుత పరిస్థితులు ప్రతిబింబిస్తుందని నమ్మి సినిమా చేశానని వివరించారు. శకుంతల (shakuntala) ప్రపంచం ప్రత్యేకమైంది. అడవిలో పుట్టి అక్కడే పెరిగారు. జంతువులే స్నేహితులు.. సన్నివేశాల సహజత్వం కోసం కష్టపడాల్సి వచ్చింది. ఆ కాలం నాటి జంతువులు ఇప్పుడు లేవు.. వాటిని క్రియేట్ చేయడం కోసం సాంకేతికంగా చాలా కష్టపడ్డం.. ఆ విధంగా విజువల్ వండర్‌గా మూవీ ఉంటుందని గుణశేఖర్ (gunasekhar) వివరించారు.