హైదరాబాద్ – విజయవాడ (Hyderabad to Vijayawada) మధ్య ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( Telangana State Road Transport Corporation-TSRTC) అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే వారికి పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది టీఎస్ఆర్టీసీ (10 per cent discount to bus users traveling between Hyderabad – Vijayawada). ఈ డిస్కౌంట్ సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ బస్సులకు వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అయితే ఈ పది శాతం డిస్కౌంట్ ఎప్పటికీ కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ నెల అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
ఈ డిస్కౌంట్ వల్ల ప్రతి ప్రయాణీకుడు రూ.40 నుండి 50 వరకు సేవ్ చేయవచ్చునని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణీకులు tsrtconline.in వెబ్ సైట్ లోకి వెళ్లి టిక్కెట్ ను రిజర్వేషన్ చేసుకోవచ్చును.
సాధారణంగా హైదరాబాద్ – విజయవాడ మధ్య ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ బస్సుల్లో పది శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఎవరైనా విజయవాడ మీదుగా ఇతర మరో నగరానికి వెళ్లాలనుకుంటే.. విజయవాడ వరకు కూడా పది శాతం రాయితీ వర్తిస్తుంది. ఈ రాయితీ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సూచించారు.