»Director Ravi Babu Said Having An Affair With That Heroine Poorna
Ravi Babu: ఆ హీరోయిన్ తో నాకు ఎఫైర్ ఉంది
తనదైన శైలిలో వినూత్న సినిమాలు తీసే టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు(director Ravi Babu) నటి పూర్ణ(heroine poorna)తో లవ్ గురించి స్పందించారు. ఆమెతో ఐదు సినిమాలు చేయడం పట్ల గల కారణాన్ని కూడా వెల్లడించారు.
ప్రముఖ దర్శకుడు రవిబాబు(Ravi Babu) తానే స్టోరీ అందించి స్వయంగా నిర్మించిన వెబ్ మూవీ అసలు(asalu). దీనికి ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో సూర్య, రవిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈరోజు ఏప్రిల్ 13న ఈనాడు గ్రూప్ OTT ప్లాట్‌ఫారమ్ ETV విన్ లో విడుదల చేశారు. మరోవైపు రవిబాబు(Ravi Babu), పూర్ణ(purna) గతంలో ఆవిరి, అవును, అవును 2, అదుగో వంటి వరుస చిత్రాల్లో కలిసి నటించారు.
అసలు మూవీతో వీరిద్దరు కలిసి చేయడం ఐదవసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో రవిబాబు(Ravi Babu)ను ఓ ఇంటర్వ్యూలో భాగంగా పూర్ణ(poorna)తో అఫైర్ గురించి ప్రశ్నించారు. అందుకు రవిబాబు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. హీరోయిన్ పూర్ణ(poorna)తో తనకున్న లవ్ అఫైర్ అందరూ అనుకుంటున్నది కాదని అన్నారు. సినిమాలో భాగంగా అనుకున్న దాని కంటే 200 శాతం మంచి అవుట్ పుట్ అందించే నేపథ్యంలో ప్రత్యేక నటులను ఎలా ఇష్టపడతారో తాను కూడా అలాగే చూస్తానని తెలిపారు. పూర్ణ తన యాక్టింగ్ విషయంలో అద్భుతంగా నటిస్తుందని, ఆమె తనకు సీమశాస్త్రి మూవీ సమయంలో పరిచయమైనట్లు వెల్లడించారు.
మరోవైపు దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని ఇటీవలే పెళ్లి చేసుకున్న పూర్ణ(poorna) ఈ వారం ప్రారంభంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె నాని, కీర్తి సురేష్ నటించిన దసరా చిత్రంలో షైన్ టామ్ చాకో ఆన్-స్క్రీన్ భార్యగా కూడా కీలక పాత్ర పోషించింది.
ఈరోజు విడుదలైన అసలు డిజిటల్ చిత్రానికి రచయిత, నిర్మాత రవిబాబు కాగా, ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించారు. ఇక చిత్రానికి ఎస్.ఎస్.రాజేష్ సంగీతం సమకూర్చగా, చరణ్ మాధవనేని కెమెరాను అందించారు. ఆర్ట్ డైరెక్టర్‌గా నారాయణ రెడ్డి, ఎడిటర్‌గా సత్యనారాయణ బల్లా వ్యవహరిస్తున్నారు. రిద్ది తమ్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. సూరి, దూది శ్రీనివాస్ కాస్ట్యూమ్స్, మేకప్ చూసుకున్నారు.