High temperature record at andhra pradesh nandyala
High temperature record at nandyala:ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలో భానుడి ఠారెత్తిస్తున్నాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో హై టెంపరేచర్ నమోదయ్యింది. నంద్యాలలో (nandyala) అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. దీంతో జనాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9 గంటలు దాటితేనే టెంపరేచర్ పెరుగుతుంది. సాయంత్రం 5, 6 గంటల వరకు ప్రభావం ఉంటుంది. దీంతో జనం బయటకు కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రకాశం (prakasam) జిల్లాలో కూడా హై టెంపరేచర్ (High temperature) వచ్చింది. ఇక్కడ 44 డిగ్రీలు, విజయనగరంలో 43.8, కడపలో 43.8, తిరుపతి 43.5, శ్రీకాకుళం 43, అనకాపల్లి 43, ఎన్టీఆర్ జిల్లా 43, నెల్లూరు, సత్యసాయి, అల్లూరి, అనంతపురం, పార్వతీపురం మన్యంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
తూర్పు గోదావరి, పల్నాడు, ఏలూరు జిల్లాలో 42.5 డిగ్రీలు, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, కోనసీమ, కాకినాడలో 42 డిగ్రీలు, కృష్ణా జిల్లాలో 41.5 డిగ్రీలు, బాపట్ల, పశ్చిమ గోదావరిలో 41, విశాఖపట్టణంలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ (hyderabad) మహానగరంలో కూడా హై టెంపరేచర్ రికార్డ్ అవుతుంది.