»Garmin Instinct 2x Solar Smartwatch Released Unlimited Battery Life
Garmin Instinct 2X Solar Smartwatch: లాంచ్..అపరిమిత బ్యాటరీ లైఫ్ సహా అద్భుత ఫీచర్లు
మీరు సోలార్ ఛార్జింగ్ గడియారాన్ని చూశారా? లేదా అయితే ఇక్కడ చూడండి. అదిరిపోయే ఫీచర్లతో గార్మిన్(Garmin) సంస్థ నుంచి ఇన్స్టింక్ట్ 2X సోలార్ స్మార్ట్‌వాచ్(Instinct 2X Solar Smartwatch) దేశీయ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇది అన్ లిమిటెడ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీంతోపాటు అనేక ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. అవెంటో ఇక్కడ చుద్దాం.
గార్మిన్(Garmin) సంస్థ గొప్ప బ్యాటరీ లైఫ్‌తో స్మార్ట్‌వాచ్(Instinct 2X Solar Smartwatch)లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా బ్రాండ్ స్మార్ట్‌వాచ్ ఫీచర్లతో చాలా అందంగా కనిపించే ఫిట్నెస్ ట్రాకర్లను అందిస్తోంది. అయితే వాటిలో చాలా వరకు ఛార్జర్ అవసరం లేకుండానే అనేక వారాల పాటు కొనసాగాయి. ఈ క్రమంలో గార్మిన్ నుంచి వచ్చిన ఇన్స్టింక్ట్ 2X సోలార్ వాచ్ నెక్ట్స్ లెవల్ అని చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లోకి వచ్చిన ఇది మంచి క్వాలిటీతోపాటు ముఖ్యంగా అపరిమిత బ్యాటరీ లైఫ్(Unlimited Battery Life)ను కూడా అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే మునుపటి గడియారాలు రోజంతా కొంచెం అదనపు శక్తిని మాత్రమే అందించగలవు.
ఈ స్మార్ట్ వాచ్ మోనోక్రోమ్ MIP డిస్ప్లేతో కూడా వస్తుంది. ప్యానెల్ 176 x 176 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది ప్రకాశవంతమైన పరిస్థితుల్లో కూడా స్క్రీన్‌పై ఉన్న వాటిని వీక్షించవచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. గడియారం రోజుల తరబడి సౌరశక్తిని తీసుకోవడంలో విఫలమైనప్పటికీ, మీరు చింతించాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇన్స్టింక్ట్ 2ఎక్స్ సోలార్(Solar) వాచ్(watch) సాధారణ రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆరోగ్యం, సంరక్షణ ఫీచర్లు చాలా సులభంగా ఉంటాయని వెల్లడించారు. ఈ వాచ్ మీ శరీరానికి సంబంధించిన డేటా అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని ప్రకటించారు. ఉదాహరణకు మణికట్టు ఆధారిత హృదయ స్పందన పర్యవేక్షణ, పల్స్ ఆక్స్, నిద్ర ట్రాకింగ్ సహా అనేక విషయాలను తెలుపుతుందని వెల్లడించారు. దీంతోపాటు రన్నింగ్, స్విమ్మింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, నడక, బైకింగ్ వంటివి కూడా ఉన్నట్లు తెలిపారు. గర్మిన్ ఇన్స్టింక్ట్ 2X సోలార్ వాచ్ ఫారెస్ట్ సహా ఇతర వాతావరణాలలో కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అంతే కాకుండా ఈ వాచ్‌లో భద్రత, ట్రాకింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మీరు సురక్షితంగా లేరని భావిస్తే లేదా ఏదైనా ఘటన జరిగినట్లు భావిస్తే ఇన్స్టింక్ట్ 2X సోలార్ వాచ్ అత్యవసర సందేశాన్ని పంపగలదు. ఈ ఫీచర్ ద్వారా మీ కంటాక్టులలో ఉన్న అత్యవసర నంబర్లకు మీ ప్రాంతంతోపాటు ప్రమాద సందేశాన్ని వాచ్ పంపిస్తుంది. అయితే అద్భుతమైన అనేక ఫీచర్లు ఉన్న ఈ వాచ్ ధర ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లో ప్రస్తుతం రూ.61,990గా ఉంది.