• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గద్వాల నుంచే కొత్త పార్టీ: కల్వకుంట్ల కవిత

NZB: జోగులాంబ గద్వాల జిల్లా నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో సోమవారం ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏది జరిగిన ఉత్తర తెలంగాణలోని కరీంనగర్​‌లో ప్రారంభం అయ్యేదని కవిత గుర్తు చేశారు.

February 23, 2026 / 04:46 PM IST

కమిషనర్‌ను అభినందించిన కలెక్టర్

NZB: బోధన్ మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడంలో కమిషనర్ చేసిన కృషిని కలెక్టర్ ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నఅధికారుల సమన్వయం, క్రమశిక్షణతో కూడిన చర్యలు, ప్రజల సహకారం వల్ల ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు.

February 23, 2026 / 04:46 PM IST

టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజుకు చేయూత

NLG: తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తన సేవాభావాన్ని చాటుకున్నారు. చిట్యాల జి.ప.ఉ. పాఠశాలలో టెన్త్ పరీక్ష ఫీజు కట్టలేని 39 మంది విద్యార్థుల ఫీజును ఆయనే స్వయంగా చెల్లించారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఈ సాయం చేసినట్లు ఆయన తెలిపారు. హెచ్‌ఎం సుశీల, ఉపాధ్యాయులు చిలక రాజు శ్రీనివాస్, నర్రా సరళ పాల్గొని సంజయ్ దాస్ సేవలను అభినందించారు.

February 23, 2026 / 04:44 PM IST

భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

JGL: భీమారం మండలం గోవిందారం గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ మహిళా సమైక్య భవనానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మహిళా సాధికారతకు భవన నిర్మాణాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

February 23, 2026 / 04:43 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 8 మందికి జైలు

కాకినాడ: వన్ టౌన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 21 మంది పట్టుబడినట్లు CI నాగదుర్గారావు తెలిపారు. వారిని సోమవారం కాకినాడ SJSC మేజిస్ట్రేట్ సీహెచ్ ఎస్ వీవీ ఎన్ శేషారావు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం 13 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా విధించారు. మిగిలిన 8 మందికి రెండు నుంచి మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు.

February 23, 2026 / 04:42 PM IST

ఇమ్మిడివరప్పాడు గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటు: ఎస్సై

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు గ్రామ పెద్దలతో కలిసి సోమవారం తాలూకా ఎస్సై శేఖర్ బాబు శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన సోమవారం గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. ​గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఇచ్చిన వ్యవది లోపే వాటిని తొలగించాలని ఎస్సై సూచించారు.

February 23, 2026 / 04:41 PM IST

ఉపాధి దిశగా నాణ్యమైన శిక్షణ అవసరం

TPT: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలను టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ సోమవారం పరిశీలించారు. విద్యార్థినులకు ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయిలో నాణ్యమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యాభివృద్ధి, కెరీర్ గైడెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధ్యాపకులకు సూచించారు. కళాశాలలోని ల్యాబ్‌లు, తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో కూడా మాట్లాడారు.

February 23, 2026 / 04:41 PM IST

‘ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి’

SKLM: మందస గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఎదురుగా ఉన్న గ్రామ పంచాయతీకి చెందిన మురుగు నీరు, వర్షం నీరు ప్రవహించే కాలువ ఆక్రమణకు గురైంది. ఆక్రమణదారులు కాలువను ఆక్రమించి, పూడ్చి వేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై సోమవారం స్థానిక మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

February 23, 2026 / 04:41 PM IST

ఇటుకల బట్టిలో కార్మికుడు మృతి..

SRPT: చివ్వెంల మండలంలోని వల్లబాపురం గ్రామ శివారులో ఇటుకల బట్టిలో పనిచేసే కార్మికుడు పల్లపు రాజు ( 35 ) ఇవాళ ఇటుకల బట్టిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతిని స్వగ్రామం సూర్యాపేట చెందినవాడిగా విశ్వసనీయ సమాచారం. సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

February 23, 2026 / 04:40 PM IST

‘కొమురంభీం గొప్ప పోరాటయోధుడు’

ASF: కొమురంభీం గొప్ప పోరాటయోధుడని, ఆయన ఆదివాసీల కోసం చేసిన పోరాటం, త్యాగం మరువలేనిదని ప్రముఖ కవి జయరాజ్ అన్నారు. ఈ క్రమంలో ప్రకృతి విజ్ఞాన యాత్రలో భాగంగా సోమవారం జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీ ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళుర్పించారు.

February 23, 2026 / 04:40 PM IST

హరితహారం మొక్కల నరికివేతపై ఫిర్యాదు

NGKL: తెలకపల్లి మండలం ఆలేరులో హరితహారం మొక్కలను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అదనపు కలెక్టర్ దేవసహాయంకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఆనంద్, కార్యదర్శి మహేశ్ సహకారంతో గట్టు బాలిశ్వరయ్య అనే వ్యక్తి మొక్కలను నరికినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 04:39 PM IST

సీనియర్ జర్నలిస్ట్ మృతి

KRNL: 20 ఏళ్లుగా మీడియా రంగంలో సేవలందించిన సీనియర్ జర్నలిస్ట్, ఓ పత్రిక ఎడిటర్ జేమ్స్ ఆనందరావు సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతిపట్ల జర్నలిస్టు సంఘాలు తీవ్ర సంతాపం ప్రకటించాయి. జేమ్స్ లేని లోటు మీడియా రంగంలో తీరనిదని పేర్కొన్నారు. ఆయన మృతితో జిల్లాలో జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

February 23, 2026 / 04:38 PM IST

‘అంబేద్కర్ కళాభవనం నిర్మించాలి’

వనపర్తి జిల్లాలో అంబేద్కర్ కళా భవనం నిర్మించాలని కోరుతూ సోమవారం జిల్లా ప్రజావాణిలో సామాజిక వేత గంధం నాగరాజు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దళితులకు అంబేద్కర్ పేరు మీద భవనం చేపట్టి దళితులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. మారమ్మ కుంట దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలంలో నిర్మించాలని కోరారు.

February 23, 2026 / 04:38 PM IST

వార్షికోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ

SKLM: ఎచ్చెర్ల మండలం లింగాలపేట గ్రామంలో వెలసిన శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ 10వ వార్షికోత్సవాన్ని ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త సరఫరా బాలకృష్ణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం కరపత్రాలను ఆవిష్కరించారు. అర్చకులు కాళిదాసు, చంద్రకుమార్ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

February 23, 2026 / 04:37 PM IST

తలుపులమ్మ తల్లి హుండీల ఆదాయం రూ.46.21లక్షలు

కాకినాడ: తుని మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 66 రోజులకు గాను రూ. 46,21,025 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాధరాజు తెలిపారు. పర్యవేక్షణాధికారులుగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సీహెచ్ సురేష్ నాయుడు వ్యవహరించారు.

February 23, 2026 / 04:37 PM IST