• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధం

SRD: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్, మార్చి 14 నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. 54 ఇంటర్, 123 టెన్త్ కేంద్రాలు ఏర్పాటు చేసి, పోలీసు బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.

February 24, 2026 / 05:57 PM IST

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన యశస్విని, ఝాన్సి

JN: సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై సీఎం అభినందనలు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించి, ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 05:55 PM IST

వాణిజ్య పన్నుల వసూలుపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్ ఛాంబర్‌లో వాణిజ్య పన్నుల వసూలుపై కలెక్టర్ బాలాజీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ పరిధిలో, ఆస్తులు భూములు, క్రయవిక్రయాలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలని తెలిపారు. పన్ను వసూలు సక్రమంగా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 05:54 PM IST

లడ్డూ కల్తీపై అసత్యాలు మాట్లాడించారు: పేర్నినాని

AP: అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలతో లడ్డూ కల్తీపై అసత్యాలు మాట్లాడించారని మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘చంద్రబాబు డైరెక్షన్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లడ్డూ నెయ్యిలో జగన్ యానిమల్ ఫ్యాట్ కలిపాడని చంద్రబాబు మాట్లాడారు. జగన్ నెయ్యి కల్తీ చేయించాడని నేను మాట్లాడలేదని పవన్ మాట మార్చారు’ అని పేర్నినాని విమర్శించారు.

February 24, 2026 / 05:52 PM IST

‘359 మంది విద్యార్థులు గైర్హాజరు’

ATP: జిల్లాలోని 64 కేంద్రాలలో మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. జనరల్ విభాగంలో 20,588 మంది, ఒకేషనల్ విభాగంలో 1,872 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 359 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

February 24, 2026 / 05:50 PM IST

కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి సారించాలి: ఎస్పీ

కోనసీమ జిల్లాలో కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో DSPలు, CIలు, SIలతో క్రైమ్ రివ్యూ నిర్వహించారు. నేరాల అదుపు, పెండింగ్ కేసుల పరిష్కారం, విచారణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలన్నారు.

February 24, 2026 / 05:50 PM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

SRCL: ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. సిరిసిల్లలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయిశ్రీ జూనియర్ కళాశాల అలాగే తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలోని టీజీఎస్ డబ్ల్యూఆర్జేసీ కళాశాలలో పరిశీలించారు.

February 24, 2026 / 05:48 PM IST

టీడీపీ పార్టీ ఇంఛార్జ్ కలిసిన మంత్రి

KRNL: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మర్యాద పూర్వకంగా ఆలూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంఛార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతిని ఇవాళ కలిశారు. కలిసిన సందర్భంలో పార్టీ కార్యాలయంలో అవగాహన చర్చలు నిర్వహించారు. రాజకీయ, సామాజిక విషయాలపై పరస్పర అభిప్రాయాలు మార్చుకున్నారు.

February 24, 2026 / 05:47 PM IST

ఉండి నూతన వీ‌ఆర్‌ఓ‌ల సంఘం ఎన్నిక

W.G: ఉండి మండలం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఉండి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఎన్నిక జరిగిట్టు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు S.చిన్నారావు తెలిపారు.ఆయన కార్యవర్గ వివరాలుఅందజేశారు.ఉపాధక్షులుగాD.వెంకటేశ్వర్ల,కా ర్యదర్శిగా CH. విజయలక్ష్మి , సంయుక్త కార్యదర్శిగా V. D. కృపాంజలి , కోశాధికారీగా B. శ్రీనివాసరావు ఎన్నికైనట్టు తెలిపారు.

February 24, 2026 / 05:47 PM IST

రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలి: శ్రీరామ్

సత్యసాయి: రైతులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రెసిడెంట్, డైరెక్టర్లకు ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ సూచించారు. తాడిమర్రి పీఏసీఎస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు బసికొండ రవీంద్ర, నాగార్జున రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం పరిటాల శ్రీరామ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 05:46 PM IST

లెజిస్టేటివ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

AP: విజయవాడలో లెజిస్టేటివ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, డీఆర్ఆర్ ఇండోర్ స్టేడియంలో పోటీలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. మొత్తం మూడురోజుల పాటు 14 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. 

February 24, 2026 / 05:46 PM IST

సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలన

NRML: మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజుర సత్యం అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని జేకే నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని సూచించారు.

February 24, 2026 / 05:45 PM IST

టెన్త్ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమీక్ష

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం త్వరలో జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి భాగస్వామ్యం పంచుకున్నారు.

February 24, 2026 / 05:45 PM IST

ఫ్రూట్ జామ్ వాడుతున్నారా?

బ్రెడ్ మీద ఫ్రూట్ జామ్ రాసుకుని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మార్కెట్‌లో దొరికే చాలా జామ్‌లలో పండ్ల శాతం కంటే పంచదార, కృత్రిమ రంగులే ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. వీటికి బదులుగా ప్రొటీన్ ఉండే పీనట్ బటర్ లేదా ఇంట్లో తాజాగా చేసుకున్న చట్నీలను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

February 24, 2026 / 05:45 PM IST

జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన అరకు విద్యార్ధిని

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 2nd B.Com విద్యార్థిని తామల జ్యోతిక జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చలపతిరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జ్యోతికను సత్కరించారు. ఈనెల 17, 18 తేదీలలో రాంచిలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్‌లో జ్యోతిక జావెలిన్‌త్రో విభాగంలో ద్వితీయ స్థానం సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించింది.

February 24, 2026 / 05:43 PM IST