చిత్తూరు జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన మాదక ద్రవ్యాలను సురక్షితంగా భద్రపర్చేందుకు పాత కలెక్టర్ కార్యాలయం నందు ఉన్న భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. గిరింపేటలో ఉన్న పాత కలెక్టరేట్లో టౌన్ ప్లానింగ్ విభాగంలోని హాలును పరిశీలించారు. భవనంలో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
RR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోస్టర్‌ను ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు, డీఆర్‌వో సంగీత ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని RR జిల్లాలోని మహిళా ఉద్యోగులకు మార్చి 4న హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని RR జిల్లా టీజీవో అధ్యక్షులు డాక్టర్ రామారావు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి మహిళలకు ప్రత్యేక అనుమతి ఇప్పించాలన్నారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 27 డివిజన్లో కౌన్సిలర్ తేజస్విని మంగళవారం కాలనీలలో పర్యటించారు. కౌన్సిలర్ వెంట మున్సిపాలిటీ అధికారులు, కాలనీ పెద్దలు ఇంటింటికి వెళ్లి సమస్యల తీవ్రతపై దరఖాస్తులను స్వీకరించారు. గత ఎన్నికల ముందు కాలనీవాసులకు ఇచ్చిన హామీ మేరకు హనుమాన్ దేవాలయ నిర్మాణంకు అవసరమైన మెటీరియల్‌ను పాలకమండలి సభ్యులకు అందజేశారు.
RR: రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారుల ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరం నుంచి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్ష విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయలన్నారు.
SKLM: సంతబొమ్మాలి మండలం మర్రిపాడులో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం ప్రారంభమైంది. ఈ యాత్ర మంగళవారం నుండి గురువారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గురువారం అమ్మవారు ఎల్లమ్మ తల్లి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. నౌపడ ఎస్సై నారాయణస్వామి జాతరకి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కృష్ణా: జిల్లా ఆదిమాంద్ర సంఘం అధ్యక్షులు, దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు పొంగులేటి జయరాజు సతీమణి విజయలక్ష్మి మంగళవారం మృతి చెందారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విజయలక్ష్మి, నేడు విజయవాడలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయలక్ష్మి మరణంతో, జయరాజుకు పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు, దళిత సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
ASF: ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. సమావేశంలో DIEO, DEO తదితర అధికారులు పాల్గొన్నారు.
పాకిస్తాన్ మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని అతడు ఆరోపించాడు. ఆ కారణంతోనే కుల్దీప్‌ను సూర్య జట్టు నుంచి తొలగించినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వారి మధ్య ఉన్న విభేదాలు మైదానంలో బహిరంగంగానే బయటపడ్డాయని షెహజాద్ వ్యాఖ్యానించాడు.
KNR: ఇంటర్ పరీక్షలను రాష్ట్రంలో కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎస్‌కే రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎస్ కే. రామ కృష్ణ రావు ఇంటర్ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అదనపు కలెక్టర్ అశ్విని పాల్గొన్నారు.
KKD: కరప మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జె. శ్రీనివాస్ తెలిపారు. ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి సత్తిబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఎజెండాతో పాటు ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో రావాలన్నారు.
ATP: పెద్దవడుగూరు మండల కేంద్రంలోని గేట్స్ కళాశాలలో ‘నెలనెలా విలువల వెన్నెల’ అనే అంశంపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ గాయకుడు ఎస్ కే లెనిన్ బాబు హాజరయ్యారు. సంకల్పం అంకితభావం, కృషి అనే అంశాలపై విద్యార్థులకు తన అనుభవాలను జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను, విజయ రహస్యాలను వివరించారు.
AP: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బాధితుల సంఖ్య 54కు చేరింది. ఆసుపత్రి నుంచి ఐదుగురు డిశ్చార్జ్ అయ్యారు. టెస్టింగ్ కోసం వాటర్ శాంపిల్స్ పంపించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ప్రజలంతా వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. ప్రజలు భయపడొద్దు, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
NTR: ఇటీవల ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులతో దాడి చేసిన జోగి రమేష్ నివాసాన్ని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మంగళవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ఈ ఘటనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
MBNR: మిడ్జిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ విజయంతి తెలిపారు. మొత్తం 216 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యం 5 నిమిషాలకు మించితే లోపలకి రానివ్వమన్నారు.
KMR: జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. రేపటి నుంచి మార్చి 17 వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 17,953 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, మంచినీటి వసతి కల్పించామన్నారు.