వనపర్తి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ ఆధ్వర్యంలో సొంత అంగన్‌వాడీ భవనాలు నిర్మించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో అవసరమైన నిత్యవసర వస్తువులను మంజూరు చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
VSP: పదవులు పొందిన ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. జిల్లాలో నూతనంగా నియమితులైన వివిధ విభాగాల నాయకులు కేకే రాజును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి టీం బృందాలు మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. పాఠశాల విద్యార్థినులు, రద్దీ ప్రాంతాల్లోని మహిళలు, పొలాల్లో పనిచేసే కూలీలకు రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈవ్ టీజింగ్, వేధింపులు వంటి ఘటనలు ఎదురైతే సహించకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
NDL: 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని స్వాధీనం చేసుకున్నట్లు నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. మంగళవారం మిడుతూరు(M ) కాజీపేట వద్ద దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ దాడులలో గడివేముల (M) లక్ష్మయ్య కుంట తండాకు చెందిన ఓ వ్యక్తి వద్ద 5 లీటర్లు, అల్లూరులో ఓ మహిళ వద్ద 4 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని సీజ్ చేసామన్నారు.
KMM: ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను జిల్లా ఉద్యానవన శాఖాధికారి పరిశీలించారు. మొక్కల కత్తిరింపు, ఇతర నిర్వహణ పనులను పర్యవేక్షించిన ఆయన, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నాణ్యమైన ప్రమాణాలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.
కర్ణాటక, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 284/2 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాటర్ ఇక్బాల్(6) త్వరగానే అవుటైనప్పటికీ.. మరో ఓపెనర్ హసన్(88) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్ డౌన్ బ్యాటర్ శుభం పుండిర్(117) సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం క్రీజులో డోగ్రా(9), అబ్దుల్ సమద్ (52) ఉన్నారు.
TG: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రోత్ ఎక్స్ సదస్సులో పాల్గొన్నారు. త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.O ప్రారంభిస్తమన్నారు. ప్రతి ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి నడిపించాలన్నదే అజెండా అని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికే క్యూర్-ప్యూర్-రేర్ తీసుకొచ్చామని తెలిపారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను మార్చాలనేదే లక్ష్యం అని వెల్లడించారు.
SRD: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం పోచారంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీనియర్ నాయకులు బిక్షపతి, శ్రీశైలం గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.
KRNL: ఆదోని శుక్రవారం పేటలో సర్వే నంబర్ 315లోని 4 ఎకరాలు 2 సెంట్ల దేవాలయ భూమిని వైసీపీ నాయకుడు రఘునాథ్ అక్రమంగా కబ్జా చేశారని ఇవాళ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ నార్త్ మండలం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దేవాలయ ఆస్తులను రక్షించి భూమిని తిరిగి ప్రజలకు అప్పగించాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.
BDK: కొత్తగూడెం క్లబ్ నందు విద్యార్థిని, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీసులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎవరైనా గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడితే కేసు నమోదు చేయడమే కాకుండా జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు.
JGL: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అధికారులు ఆయనకు అందజేశారు.
SDPT: గౌరవెల్లి ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రైతులను నమ్మించి మోసం చేసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు అభివృద్ధి కంటే దానిని రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
BPT: బాపట్ల వ్యవసాయ కళాశాలకు విశ్వవిద్యాలయ హోదా కల్పించాలని 1965-69 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కోరారు. మంగళవారం కళాశాలలో జరిగిన సమ్మేళనంలో వారు ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి చేశారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డా.ప్రసూన రాణితో పాటు పలువురు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.
జగిత్యాల జిల్లాలో జరగనున్న గోదావరి పుష్కరాలు-2027 నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పుష్కర ఘాట్లు, వీఐపీ ఘాట్లు, తాత్కాలిక స్నాన ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
WNP: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ప్రయాణికులు తమ సూచనలు సలహాలు తెలియజేయడానికి 9959226289కు ఫోన్ చేయవచ్చని సూచించారు. వనపర్తి డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలన్నారు.