• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లాభాల మాయలో లక్షల మోసం

BDK: బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు ఎస్సైలు, వారి తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. అధిక లాభాల పేరుతో బూర్గంపహాడ్ మండలం, సారపాకకు చెందిన మహిళ నుంచి రూ.1.82 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

February 24, 2026 / 10:19 AM IST

న్యాయవాది కళ్యాణిని పరామర్శించిన BJP అధ్యక్షుడు

NZB: రుద్రూర్‌లో న్యాయవాది కళ్యాణి నివాసానికి బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మంగళవారం స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కళ్యాణికి ధైర్యం చెప్పి, పూర్తి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా దినేశ్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 10:19 AM IST

కొడంగల్‌లో మెరిసిన ఒగ్గుడోలు కళకారుల విన్యాసం

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నిర్వహించిన బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శోభాయాత్రలో ఒగ్గుడోలు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి ప్రదర్శనలు భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేశాయి.

February 24, 2026 / 10:19 AM IST

బావను కిరాతంగా నరికిచంపిన మరదలు

HNK: హసన్ పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో మంగళవారం బాల్నే మొగిలి సొంత మరదల చేత దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొగిలిని గొడ్డలితో, కత్తులతో అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా,  హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 10:19 AM IST

మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం.. మునిమనవడు ట్వీట్

TG: ‘గాంధీ సరోవర్‌’ ప్రాజెక్టును ఉద్దేశించి గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజలను వారి నివాసాల నుంచి వెళ్లగొట్టొద్దని తెలిపారు. బాపు బతికి ఉంటే ‘నా పేరు మీద ఇలాంటివి చేయొద్దు, వెంటనే ఆపండి’ అని చెప్పేవారని పేర్కొన్నారు. విగ్రహాల కంటే ప్రజల కనీస అవసరాలే ముఖ్యమన్నారు.

February 24, 2026 / 10:19 AM IST

ప్రజల్లో జగన్ విశ్వాసం కోల్పోయారు: యనమల

AP: రాబోయే రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌ను విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడవచ్చని టీడీపీ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తన మనస్తత్వంతో ప్రజల్లో జగన్ విశ్వాసం కోల్పోయారన్నారు. అహంకార ధోరణి వల్ల అధికారం కష్టమనే భావన.. వైసీపీ నాయకుల్లో పెరుగుతుందన్నారు. 60 రోజుల అసెంబ్లీ గైర్హాజరుతో అర్హత కోల్పోయే భయం వైసీపీ ఎమ్మెల్సీల్లో ఉందని పేర్కొన్నారు.

February 24, 2026 / 10:17 AM IST

లింగంగుంట్లలో కార్డన్ సెర్చ్ నిర్వహణ

PLD: పెదకూరపాడులోని లింగంగుంట్ల గ్రామంలో మంగళవారం ఉదయం పోలిసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు పాల్గొని గ్రామంలో క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 22 వాహనాలను గుర్తించారు. కొడవళ్ళు గుడ్డలు మారణా యుద్ధాలను కొన్నిటిని గుర్తించారు. సీఐ సురేష్, శ్రీనివాసరావు, ఎస్సై గిరిబాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 10:16 AM IST

వేరుశనగ పంట వేశారా..? అధిక దిగుబడికి ఇలా చేయండి

RR: రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు టీసీజీఎస్-1694 ‘విశిష్ట’ వేరైటీ వేరుశనగ పై ఫీల్డ్ డే నిర్వహించారు. పూత దశలో తగిన నీరు, జిప్సం, జింక్ వినియోగంతో దిగుబడి పెరుగుతుందని డా. సంతోష్ కుమార్ సూచించారు. పంట విస్తీర్ణం, నాటే దూరం, సమతుల ఎరువుల వినియోగం, కలుపు నియంత్రణ, యాంత్రీకరణపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.

February 24, 2026 / 10:16 AM IST

నేడు ఆర్టీసీ కార్మికుల చలో సెక్రటేరియట్ కార్యక్రమం

NLG- తమ సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో, నేడు ఆర్టీసీ కార్మికులు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా కార్మిక జేఏసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

February 24, 2026 / 10:16 AM IST

రేపు ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు

WGL: ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారం (మార్చి 4), సెకండ్ ఇయర్ పరీక్షలు గురువారం (మార్చి 5) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాల వారీగా WGL-12,166, HNK-38,600, JN-8,605, MHBD-8,287, BHPL-3,778, MLG-3,841 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.

February 24, 2026 / 10:13 AM IST

రామేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు

KDP: పొద్దుటూరు రామేశ్వరంలోని ముక్తిరామలింగే శ్వరస్వామి ఆలయంలో సోమవారం ఆలయ ఈవో శ్రీధర్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. డిసెంబరు 29 నుంచి ఫిబ్రవరి 23 వరకు 55 రోజులకు భక్తులు స్వామివారికి రూ.80,035 కానుకల రూపంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ ఇన్‌స్పెక్టర్ కిరణకుమార్ రెడ్డి, పాలకమండలి సభ్యుడు, ఆర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

February 24, 2026 / 10:12 AM IST

బాల్యవివాహ విముక్తి రథాన్ని ప్రారంభించిన కలెక్టర్

HYD: బాల్య వివాహాల రహిత సమాజాన్ని నిర్మిద్దామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. బాల్యవివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వాహనం ద్వారా ప్రచారం చేస్తామని చెప్పారు. 18 ఏళ్లలోపు యువతులకు, 21 ఏళ్లలోపు యువకులకు పెళ్లి చేస్తే బాల్య వివాహం కిందికి వస్తుందన్నారు.

February 24, 2026 / 10:12 AM IST

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు

కాఫీకి బదులుగా ఉదయం గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెటబాలిజంను పెంచి, క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పును నివారిస్తుంది. ఇందులోని కాటెచిన్స్ పళ్లు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మెదడును చురుకుగా ఉంచి ఏకాగ్రతను పెంచుతాయి. అయితే, రోజుకు 2 కప్పులు తాగాలి.

February 24, 2026 / 10:11 AM IST

ఓవైపు పార్కింగ్.. మరోవైపు పాడుబడ్డ బండ్లు..?

MDCL: KPHB 4వ ఫేజ్ దేవాలయ సముదాయాల ప్రధాన రహదారిలో ఓవైపు వాహనాలు, మరోవైపు గోడల పక్కన పాడుబడ్డ బండ్లు ఉండటంతో రోడ్డు మరింత ఇరుకుగా మారి ఇబ్బంది పడుతున్నట్లుగా పలువురు వాహనదారులు వాపోయారు. దీంతో రోడ్డుపై ప్రయాణించడానికి చాలా కష్టంగా ఉంటుందని, ఇలాంటి వాటిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

February 24, 2026 / 10:11 AM IST

రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

అనకాపల్లి: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 734 గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సడక్ రోడ్లను మంజూరు చేయాలన్నారు.

February 24, 2026 / 10:09 AM IST