• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డీఎస్సీలో షాబాద్ విద్యార్థి ప్రేమ్ కుమార్ అద్భుత విజయం

GDWL: ఇటిక్యాల మండలం షాబాద్ గ్రామానికి చెందిన పేద కూలీ దంపతుల కుమారుడు ప్రేమ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ 2025 మెగా డీఎస్సీలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. జోనల్ 4 జిల్లాలకు సంబంధించిన పరీక్షలో, 56 పోస్టులకు గాను ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంకుతో ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ఉద్యోగం పొందాడు.

September 26, 2025 / 06:00 PM IST

మంత్రిని సన్మానించిన రాప్తాడు నాయకులు

ATP: రాప్తాడు నియోజకవర్గంలోని భోగినేపల్లి గ్రామ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి రూ. 66 లక్షలు, పండమేరు వెంకటరమణ స్వామి ఆలయానికి రూ. కోటి నిధులు మంజూరయ్యాయి. దీంతో శుక్రవారం గ్రామ పెద్దలు ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బోయపాటి సుధాకర్ నాయుడు తదితరులు మంత్రిని శాలువాతో సన్మానించారు.

September 26, 2025 / 06:00 PM IST

పుచ్చకాయలపల్లిలో భారీ వర్షం

ప్రకాశం: పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి గ్రామంలో భారీ వర్షం కురిసింది. ఎస్సీ కాలనీలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని ఇళ్లను వరద నీరు చుట్టముట్టింది. ఈ మేరకు గ్రామంలోని డ్రైనేజీ కాలువలు, పంట పొలానికి సంబంధించిన కాలువలు పూడిపోవటం వల్లే ఈ సమస్య ఏర్పడింది గ్రామస్థులు చెబుతున్నారు.

September 26, 2025 / 05:59 PM IST

షటిల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలోని నారాయణపురం RMC ఇండోర్ షటిల్ కోర్టులో జరుగుతున్న పోటీలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, RUDA ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి కలిసి ఇవాళ వీక్షించారు. రెండో రోజు జరుగుతున్న ప్రీ క్వార్టర్ ఫైనాన్స్‌ను టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

September 26, 2025 / 05:58 PM IST

‘GST తగ్గుదలపై ప్రజల్లో అవగాహన కల్పించండి’

VZM: ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ పై ప్రజలకు విస్తృత‌ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఛీఫ్ సెక్ర‌ట‌రీ కె.విజ‌యానంద్ శుక్ర‌వారం స‌చివాల‌యం నుంచి జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ఇంటింటికి వెళ్ళి జీఎస్టీ తగ్గింపుపై అవగాహన...

September 26, 2025 / 05:57 PM IST

దసరాకు సొంత ఊర్లకు ప్రత్యేక బస్సులు

KKD: దసరా పండగకు అందరూ సొంత గ్రామానికి వెళ్తారు. బస్సు ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ శుభవార్త చెప్పారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి కాకినాడకు 12, విజయవాడ నుంచి 46 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క రూపాయి కూడా టికెట్ పెంచకుండా సాధారణ ఛార్జీలే ఉంటాయన్నారు.

September 26, 2025 / 05:57 PM IST

అధికారులకు శిక్షణ తరగతులు

WNP: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని, బ్యాలెట్ పత్రాలతో జరిగే ఈ ఎన్నికలకు పారదర్శకంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులే కీలకమని, నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియను సమయ పాలనతో నిర్వహించాలని సూచించారు.

September 26, 2025 / 05:56 PM IST

శ్రీశైలం డ్యాం మరొక గేటు ఎత్తివేత

NDL: శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో డ్యాం ఏడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులు శుక్రవారం మధ్యాహ్నం మరొక గేటును ఎత్తివేశారు. తాజాగా డ్యామ్ 8 గేట్ల ద్వారా 2,15,424 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం, హంద్రీ ప్రాజెక్టుల ద్వారా 2,90,370 క్యూసెక్కుల వరద నీరు వచ్చి శ్రీశైలానికి చేరుతోంది.

September 26, 2025 / 05:56 PM IST

మరుగుతున్న పాల గిన్నెలో పడి చిన్నారి మృతి

HNK: హన్మకొండ జిల్లా కేంద్రంలోని కొర్రపాడు హాస్టల్‌లో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అక్కడ పనిచేసే కృష్ణవేణి తన కూతురు అక్షిత కోసం పాలు వేడి చేస్తుండగా, చిన్నారి పిల్లిని చూసి భయపడి పాలు వేడెక్కుతున్న గిన్నెలో పడి మృతి చెందింది. ఈ ఘటన పై స్థానికులు, సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

September 26, 2025 / 05:55 PM IST

ఇక నుంచి TTDపై అసత్య ప్రచారాలకు చెక్.!

TPT: తిరుమల తిరుపతి దేవస్థానంపై జరిగే అసత్య ప్రచారాలకు చెక్ పెడుతూ ఆలయ అధికారులు ‘ఫ్యాక్ట్ చెక్ TTD’ వాట్సప్ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా టీటీడీపై వస్తున్న ఆరోపణలను ఖండించేందుకు, నిజానిజాలను బహిర్గతం చేసేందుకు అవకాశం ఉంటుంది. TTDపై అసత్య ప్రచారాల కట్టడికి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.

September 26, 2025 / 05:55 PM IST

‘వారానికి ఒకసారి పిల్లల ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలి’

CTR: వారానికి ఒకసారి CCIలలో ఉన్న పిల్లల ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని జిల్లా స్థాయి బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ సంబంధించిన వివిధ అంశాలపై కమిటీ మెంబర్లతో జేసి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా బాల సంరక్షణ కేంద్రాలలో సందర్శించి సమస్యలను గుర్తించి నివేదిక అందజేయాలని ఆదేశించారు.

September 26, 2025 / 05:55 PM IST

తిరుపతిలో రేపు జాబ్ మేళా

TPT: తిరుపతి రూరల్ పరిధిలోని RC రెడ్డి డిగ్రీ కళాశాలలో APSSDC ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య ప్రతి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. ఇందులో భాగంగా 11 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్పష్టం చేశారు. అనంతరం పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, బి. ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. కాగా, మొత్తం 550 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

September 26, 2025 / 05:55 PM IST

నేను ఏ తప్పూ చేయలేదు: KTR

TG: మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో నేను ఏ తప్పూ చేయలేదన్నారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమన్నారు. అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవాలని సవాల్ విసిరారు.. లగ్జరీ కార్ల కేసులోనూ విచారణకు సిద్ధం అన్నారు.

September 26, 2025 / 05:55 PM IST

పిల్లల భవిష్యత్తుపై మీదే బాధ్యత: విశ్వేశ్వర్

GDWL: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవాళ మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ఇంటర్ బోర్డ్ జాయింట్ డైరెక్టర్ విశ్వేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుకు అధ్యాపకులతోపాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఎంతో ఉందని ఆయన అన్నారు. తమ పిల్లలు కళాశాలకు ప్రతిరోజూ వస్తున్నారో లేదో తెలుసుకోవాలన్నారు.

September 26, 2025 / 05:54 PM IST

పొరపాట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

KMR: ఎన్నికల ప్రక్రియలో పూర్తి బాధ్యతాయుతంగా ఉండాలని, పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ అన్నారు.​ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి ఉన్నారు.

September 26, 2025 / 05:54 PM IST