HNK: హన్మకొండ జిల్లా కేంద్రంలోని కొర్రపాడు హాస్టల్లో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అక్కడ పనిచేసే కృష్ణవేణి తన కూతురు అక్షిత కోసం పాలు వేడి చేస్తుండగా, చిన్నారి పిల్లిని చూసి భయపడి పాలు వేడెక్కుతున్న గిన్నెలో పడి మృతి చెందింది. ఈ ఘటన పై స్థానికులు, సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు.