• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విశాఖలో నేటి కూరగాయల ధరలు

విశాఖపట్నంలోని 15 రైతు బజార్లలో మంగళవారం కాయగూరల ధరలు (కేజీ/రూ) ఇలా ఉన్నాయి. టమాటా 15, బెండకాయలు 30, పచ్చిమిర్చి 55, బీరకాయలు 32, కాలీఫ్లవర్ 12, క్యాబేజీ 14, క్యారెట్ 26, దొండకాయ 46, ఉల్లిపాయలు 18, గోరుచిక్కుడు 34, దోసకాయలు 24, మునక్కాడ 86, అల్లం 66, చిక్కుడుకాయలు 26, కీర 32, వంకాయలు 22గా ఉన్నాయి. మార్కెటింగ్ శాఖ ఆదేశాల మేరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి.

February 24, 2026 / 09:33 AM IST

భార్యను కొడవలితో నరికిన భర్త

AP: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త కొడవలితో నరికాడు. తీవ్రగాయంతో ప్రభుత్వ ఆస్పత్రిలో భార్య గౌరమ్మ చికిత్స పొందుతోంది. అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతూరు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యపై దాడి చేసిన భర్త నాగభూషణం పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 24, 2026 / 09:32 AM IST

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఉమ్మడి KNR జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. KNRలో 36,426, PDPLలో 10,367, JGTLలో 15,125, SRCLలో 8,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఉదయం 9 గం.ల నుంచి మధ్యాహ్నం 12 గం.ల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యార్ధులు 45 ని.లు ముందే సెంటర్‌కు వెళ్లాలన్నారు.

February 24, 2026 / 09:32 AM IST

నీటి సరఫరాలో అంతరాయం

JN: దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో నేడు అంతరాయం కలుగుతుంది అని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన 700mm WBSC లీకేజీ కారణంగా సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదు అని తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలు గమనించి మంచి నీటికోసం ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని కోరారు.

February 24, 2026 / 09:32 AM IST

హన్వాడ పోస్ట్ ఆఫీసులో సమావేశం

MBNR: హన్వాడ పోస్ట్ ఆఫీసులో జిల్లా పోస్టుమాస్టర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో సమావేశమయ్యారు. సేవింగ్స్, ఆర్డీ, సుకన్య సమృద్ధి, బీమా వంటి పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరువ చేసి అందరూ వినియోగించుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. పోస్టుమాస్టర్ చంద్రశేఖర్, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

February 24, 2026 / 09:31 AM IST

‘ప్రధాన రహదారిని వెంటనే విస్తరించాలి’

MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యంలో ఉండటంతో రహదారి వేయడానికి వీలుకావడం లేదు. దీంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే జన్నారం శివారులోని జింకల పార్కు నుండి రెండు కిలోమీటర్ల వరకు నాలుగు వరసల రహదారిగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

February 24, 2026 / 09:31 AM IST

‘ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి’

RR: చేవెళ్ల మండలంలో భూమి ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన ప్రతీ రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి శంకర్‌లాల్ అన్నారు. మండలంలో మొత్తం రైతులు 32,650ల మంది ఫార్మర్ రిజిస్టేషన్‌కు అర్హులుగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నెల 28వ తేదీ చివరి గడువు అని గుర్తించాలని సూచించారు.

February 24, 2026 / 09:31 AM IST

అభ్యుదయ కవి కొండ లింగారావుకు సాహితీ పురస్కారం

SRPT: హుజూర్ నగర్ పట్టణానికి చెందిన అభ్యుదయ కవి కొండ లింగారావుకు ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం లభించింది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలో. నిర్వాహకులు ఆయనను సార్ తో సత్కరించి అవార్డును ప్రధానం చేశారు. విశ్వసాహితీ కళావేదిక నిర్వహించిన కవితల పోటీలో ఆయన టాప్ 20 విజేతగా నిలిచారు.

February 24, 2026 / 09:30 AM IST

చిరు ‘విశ్వంభర’పై సాలిడ్ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన సినిమా ‘విశ్వంభర’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక గ్లింప్స్ ద్వారా విడుదల తేదీని వెల్లడించాలని సన్నాహాలు చేస్తున్నారట. అయితే 2026 జూన్‌లో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్.

February 24, 2026 / 09:30 AM IST

బాలికకు గర్భం.. బాలుడిపై కేసు

NLR: ఉదయగిరి పోలీసులు ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఉదయగిరికి చెందిన ఓ బాలుడు, బాలికకు గతేడాది పరిచయమైంది. ఈ నేపథ్యంలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలుడు శారీరకంగా లొంగదీసుకుని గర్భిణిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిరాకరించాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై కేసు నమోదు చేశారు.

February 24, 2026 / 09:29 AM IST

రేపు రామచంద్రపురంలో జాబ్ మేళా

కోనసీమ: రామచంద్రపురంలో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం సోమవారం వెల్లడించింది. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉండి, 18-35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం అన్నారు.

February 24, 2026 / 09:29 AM IST

రైతులను నిండా ముంచిన అకాల వర్షం

ఖమ్మం జిల్లాలో సోమవారం రాత్రి వచ్చిన గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మామిడి, మొక్కజొన్న రైతులను కోలుకోకుండా చేసింది. పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది. గ్రామాల్లో ఈసారి అధిక మొత్తంలో సాగు చేసిన మొక్కజొన్న మరో నెలలో చేతికి రానున్న తరుణంలో అకాల వర్షం రైతులను పూర్తిగా నష్టపరిచింది.

February 24, 2026 / 09:28 AM IST

లోకేష్‌తో నెల్లిమర్ల ఎమ్మెల్యే భేటీ

VZM: మంత్రి నారా లోకేష్‌తో నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి సోమవారం భేటీ అయ్యారు. ఆత్మీయ కుటుంబ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో భేటీ అయినట్లు ఆమె తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి లోకేష్ ఇచ్చిన డిన్నర్‌లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో కుటుంబ సమ్మేళనం జరిగిందని ఆమె తెలిపారు.

February 24, 2026 / 09:28 AM IST

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

బ్రిస్బేన్ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్లు మొదటి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. వరల్డ్ కప్ విజయం తర్వాత హర్మన్ సేన తొలి వన్డే సిరీస్ ఆడుతోంది. 1983/84 మొదలు ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 11 వన్డే సిరీస్‌లు జరగ్గా.. భారత్ ఒక్కటి కూడా గెలవలేదు.

February 24, 2026 / 09:27 AM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

SRCL: మండలంలోని నామాపూర్ గ్రామానికి చెందిన బొమ్మెన చందు(21) అనే యువకుడు గూడెం గ్రామం నుండి ఆవునూర్ వైపు పయణిస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ చందును సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు ఎస్ఎచ్‌వో తెలిపారు. 

February 24, 2026 / 09:26 AM IST