తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).ను ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ పోటీల శిక్షణ, ఖర్చుల కోసం నిఖత్‌కు రూ. 2 కోట్ల సాయం ప్రకటించారు కేసీఆర్.
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలించిన నిందితుడిని కేరళకు చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
ఒరిస్సా(Orissa)లో మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఒరిస్సాలోని పూరి నుంచి బెంగాల్ లోని హౌరా వరకు ఈ ట్రైన్ నడవనుంది.
తమిళ హీరో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న చిత్రం బిచ్చగాడు2. ఈ మూవీ మే 19న విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో అడివి శేష్, మరో హీరో ఆకాష్ పూరి విచ్చేశారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకోగా, ఎఢిటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో మూవీ ఫస్ట్ కాపీని ఆమె ఓ స్పెషల్ పర్సన్ కి చూపించింది. ఆ స్పెషల్ పర్సన్ మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా మామ, అల్లుళ్లు కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అనౌన్స్ చేశారు. దీంతో పాటు.. ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. పోస్టర్ లో పవన్ లుక్ అదిరిపోయింది.
తిరుపతి(Tirupati)లోని గోవిందరాజ స్వామి ఆలయంలో మే 21 నుంచి 25వ తేదీ వరకు బంగారు తాపడం విమాన గోపురం మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మే 26వ తేది నుంచి జూన్ 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Annual Brahmotsavams) నిర్వహించనున్నట్లు తెలిపింది.
111 జీవో ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ (High Court) స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పీఏ అంటూ మోసం చేశాడు. మహారాష్ట్ర మంత్రిమండలిలో చోటు ఇప్పిస్తానని నమ్మబలికాడు.
నేడు సినీ పెద్ద సమక్షంలో లైగర్ సినిమా ఎగ్జిబిటర్లు తమ నిరవధిక దీక్షను విరమించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది.
యూరియా రేట్లను ఈ ఏడాది పెంచడంలేదని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. దీంతో రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పినట్లైంది.
చిన్నపాటి విషయానికే రెండు కుటుంబాలు పిడిగుద్దులను కురిపించుకున్నాయి. ఢిస్నీ వరల్డ్ లో ఫొటో దిగేందుకు ప్రయత్నించిన ఓ ఫ్యామిలీపై మరో ఫ్యామిలీ దాడిచేసింది.
మృగశిర కార్తీక మాసం ప్రారంభం రోజున ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నట్లుగా మంత్రి తలసాని (Minister Talasani) తెలిపారు. కాగా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొర్రమీను చేపను తెలంగాణ రాష్ట్ర చేపగా ప్రభుత్వం గుర్తించింది.