టాలీవుడ్(Tollywood) దర్శకుడు పూరీ జగన్నాథ్(Director Puri jagannadh) లైగర్ సినిమా(Liger Movie) తీసి పరాజయం పొందిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ(Vijaydevarakonda) హీరోగా ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా లైగర్ రిలీజ్ అయ్యింది. అయితే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఆ సినిమా ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు(Exhibitors) భారీగా నష్టపోయారు. తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటూ గత కొంతకాలంగా లైగర్ ఎగ్జిబిటర్లు పూరీ జగన్నాథ్ ను కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో పూరీ, ఎగ్జిబిటర్ల(Exhibitors) మధ్య వివాదం తలెత్తుతోంది. ఇటీవలె ఈ వివాదం మరింత ముదరడంతో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద లైగర్ బాధితుల సంఘం పేరుతో ఎగ్జిబిటర్లు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. 12వ తేదిన మొదలైన వారి దీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అనారోగ్యానికి కూడా ఎగ్జిబిటర్లు గురైన సంగతి తెలిసిందే.
తాజాగా నేడు సినీ పెద్దలు దీక్ష వద్దకు చేరుకుని ఎగ్జిబిటర్ల (Exhibitors) దీక్షను విరమింపజేశారు. నిర్మాత మండలి, తెలంగాణ ఛాంబర్ అఫ్ కామర్స్.. ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరిస్తామని మాట ఇవ్వడంతో దీక్షను విరమిస్తున్నట్లు ఎగ్జిబిటర్లు వెల్లడించారు. ఎక్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపమ రెడ్డి ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్లు దీక్షని విరమించారు.