సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దసరా టార్గెట్‌గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం సీనియర్ బ్యూటీ తమన్నాను ఐటెం సాంగ్ కోసం అనుకుంటున్నారట. అందుకు మిల్కీ బ్యూటీ భారీగా డిమాండ్ చేస్తోందట.
ఇప్పటికే ఎన్బీకె 108 నుంచి బాలయ్య ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. నెక్స్ట్ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న.. ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తోంది. దాంతో ఈప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో తమన్నాతో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. గతంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది.
ఓ సినిమాలో చేసిన హీరోయిన్‌తో మరో సినిమాలో ఐటెం సాంగ్ చేయిచండం అనిల్ రావిపూడి సెంటిమెంట్. అందుకే ఎఫ్3లో నటించిన తమన్నాను ఎన్బీకే 108లో ఐటెం బ్యూటీగా అనుకుంటున్నారట. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేశాడట. కానీ ఈ పాటలో చిందేయడానికి తమన్నా గట్టిగా డిమాండ్ చేస్తోందట. ఒక్క పాట కోసం కోటిన్నర పారితోషికం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే హీరోయిన్లకే అంత లేనప్పుడు తమన్నాకు అంత ఎలా ఇస్తామని అంటున్నారట మేకర్స్. పైగా ఇప్పుడు తమన్నా చేతిలో సినిమాలు లేవు. దాదాపుగా ఈ తెల్ల తోలు పిల్ల ఫేడ్ అవుట్ అయిపోయినట్టే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోంది. అయినా ఐటమ్ సాంగ్ తమన్నాతో చేయిస్తున్నాడట అనిల్ రావిపూడి. మరి ఈసారి తమన్నా, బాలయ్య మాస్ స్టెప్పులు ఎలా ఉంటాయో చూడాలి.