»No Statue Of Ntr In The Form Of Lord Krishna High Court
High Court : శ్రీ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్దు : హైకోర్టు
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ (High Court) స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్(NTR)కు ఖమ్మంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ హైకోర్టు తెలిపింది. ఖమ్మం(Khammam)లోని లకారం చెరువు మధ్యలో తీగల వంతెనకు ప్రత్యేక ఆకర్షణగా.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్తో ప్రారంభింపజేయాలని భావించిన మంత్రి పువ్వాడ (Minister Puvvada) ఆయనకు ఆహ్వానం సైతం అందించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలోనే అసలు వివాదం మొదలైంది.
మరోవైపు.. ఈలోపు ముగ్గురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వ్యతిరేకంగా సినీ నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) పోరాటం చేస్తున్నారు. ఆమె యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలిగా ఉండటంతో..విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శ్రీకృష్ణుడు (Srikrsnudu) అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమంటే శ్రీకృష్ణుడిని కించ పరచడమే అని చెప్తున్నారు. ఇది యాదవుల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశార. కరాటే కళ్యాణి పోరాటంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సీరియస్ (MAA) అయ్యింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు.