ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో ఐటీడీఏ ప్రాంగణ ప్రాంతంలోని గిరిజన ఉద్యాన కేంద్రంలో అనేక రకాల మామిడి మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలను విక్రయిస్తున్నారు. ఇది ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ అలంకరణ మొక్కలు, గిఫ్ట్ మొక్కలు బయటి కేంద్రంలో కంటే తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఉట్నూర్ మండల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.