Disney World brawl: డిస్నీ వరల్డ్ ముందు పిడిగుద్దులు.. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ
చిన్నపాటి విషయానికే రెండు కుటుంబాలు పిడిగుద్దులను కురిపించుకున్నాయి. ఢిస్నీ వరల్డ్ లో ఫొటో దిగేందుకు ప్రయత్నించిన ఓ ఫ్యామిలీపై మరో ఫ్యామిలీ దాడిచేసింది.
పర్యాటక ప్రదేశానికి వెళ్లినప్పుడు ఫొటోలు దిగడం మామూలే. అక్కడ ఉన్న శిల్పాల ముందు ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అందులో భాగంగానే ఒకరు ఫొటో దిగాక మరొకరు ఫొటో దిగడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఫొటో దిగాక మరోకరు దిగడానికి చాన్స్ ఇవ్వకుండా అలాగే నిల్చుకున్నారు కొందరు. దీంతో మరోకరు తాము కూడా ఫొటో దిగాలని.. పక్కకు జరగండని అడిగితే పిడిగుద్దులు కురిపించారు.
వివరాల్లోకి వెళ్తే… ఫ్లోరిడా ఓర్లాండోలోని వాల్ట్ డిస్నీ వరల్డ్ వద్ద పర్యాటకులు పలుచోట్ల ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. కాగా… డిస్నీ వరల్డ్ చిహ్నం ముందు ఓ ఫ్యామిలీ ఫోటోలు దిగేందుకు అధిక సమయం వెచ్చించారు. ఆ చిహ్నం ముందే ఫొటోలు దిగేందుకు మరో ఫ్యామిలీ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. అలా కొద్ది సేపు చూసాక.. కొంచెం పక్కకు జరగండి మేము కూడా ఫొటోలు దిగాలని అన్నందుకు రెండో ఫ్యామిలీనుంచి ఓ వ్యక్తి వచ్చి ఈ ఫ్యామిలీపై దాడి చేశాడు. పిడిగుద్దులు గుమ్మరించాడు. కిందపడేసి కొట్టాడు. ఈ ఘటనను అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్ లలో చిత్రీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
మామూలుగా మనదేశంలోనే చిన్నపాటి గొడవలుజరుగుతాయని, ఫారెన్ అయితే వాళ్లు ఎంతో ఉన్నతులు అని కొందరు అనుకుంటారు. కానీ అదంతా భ్రమ అని ఇప్పుడు గ్రహిస్తున్నారు. ఎక్కడైనా ఉన్నతమైన వ్యక్తిత్వంతో పాటు మామూలు జనాలు కూడా ఉంటారు.