Gold Seized: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలించిన నిందితుడిని కేరళకు చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా ఎక్కడోక చోట జరుగుతూనే ఉంది. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద ఈ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1,761 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.1.10 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలించిన నిందితుడిని కేరళకు చెందిన వ్యక్తిగా కస్టమ్స్ అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.