»Chief Minister Kcr Announced Rs 2 Crores To Nikhat Zareen
Nikhat Zareen : నిఖత్ జరీన్ కు రూ.2 కోట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).ను ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ పోటీల శిక్షణ, ఖర్చుల కోసం నిఖత్‌కు రూ. 2 కోట్ల సాయం ప్రకటించారు కేసీఆర్.
తెలంగాణ (Telangana) సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat Zareen) కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ పోటీల శిక్షణ, ఖర్చుల కోసం నిఖత్‌కు రూ. 2 కోట్ల సాయం ప్రకటించారు సీఎం కేసీఆర్(CM KCR). ఒలింపిక్ పోటీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం తెలిపారు. జరీన్ శిక్షణ, రవాణా తదితర ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో(Olympics games) నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ప్రపంచ వేదికలపై విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన నిఖత్ జరీన్ కు రాబోయే ఒలంపిక్ పోటీల్లో పాల్లొనేందుకు ప్రభుత్వం సహకారం అందజేస్తుందని అన్నారు.ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Shanti Kumari) చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.