NLR: రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక సీపీఐ, రైతు సంఘం నాయకులు కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి 10% నిధులు కేటాయించాలని అలాగే రూ. 2 లక్షలు పంట రుణాలు రైతులకు ఇప్పించాలని తదితర డిమాండ్లు పొందుపరిచారు.
మార్కాపురంలో డీఎస్పీ నాగరాజు, కనిగిరి DSP సాయి ఈశ్వర యశ్వంత్ పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.
HYD: నేడు ఆర్టీసీ సంఘాలు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోవడం, ఉద్యోగులపై పని ఒత్తిడి, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో నిరసన వ్యక్తం చేయనున్నాయి.
కడప జిల్లాలో సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు 96 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. 62 సెంటర్లలో 17,726 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 748 మంది గైర్హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 16,392 మందికి గానూ, 15,789 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1,334 మందికిగాను, 1,189 మంది పరీక్షలకు హాజరైనట్లు పేర్కొన్నారు.
WNP: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో పాతపల్లికి చెందిన కిషోర్ కుమార్ (25) దుర్మరణం చెందాడు. సోమవారం సాయంత్రం అయ్యవారిపల్లె నుంచి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. తలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు సరోజినీ ఆసుపత్రికి, అనంతరం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కృష్ణా: పెనమలూరు మండలం తాడిగడపలో రూ.90 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తే, నాయకులను ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారని, కష్టపడి పనిచేస్తే కాస్త అలిసిపోతామేమో కానీ, ప్రజల ఆదర అభిమానం ముందు ఎంత కష్టమైనా ఇబ్బంది ఉండదని తెలిపారు.
HNK: KU పరిధిలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు KU పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. నాన్-ప్రొఫెషనల్ కోర్సులు (MA, MSC, M.COM)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులైన ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షలకు కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,803 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,766 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
SRCL: మహిళల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని బీజేపీ మండల అధ్యక్షులు విజేందర్ అన్నారు. చందుర్తి మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల యోజన పథకంలో అర్హులైన లబ్దిదారులు మండలం లోని గ్రామాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్తయ్య, తిరుపతి నాయక్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేటతో పాటు పలు మండలాల్లో అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాత్రి ఒక్కసారిగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వేసవి మొదలై ఎండలు ముదురుతున్న తరుణంలో ఈ అకాల వర్షాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
KRNL: ఆలూరు నియోజకవర్గం ఆస్పరి పట్టణంలో మసాలా చిన్న లక్ష్మన్న అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తనయుడు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బుసినే చంద్రశేఖర్ పార్థివ దేహానికి పూలమాల వేసి సోమవారం నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జయప్రద సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్పీ ఎంపీసీఎస్, బీఎస్పీ ఎంజెడ్ సి, బీఎస్పీ బీజెడ్ సి, బీకాం( సీఏ) కోర్సులు ఉన్నాయన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థునులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
PLD: మాచర్ల పరిసర ప్రాంతాల బస్సు ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ బత్తుల వీరాస్వామి తెలిపారు. ప్రయాణికులు తమ గ్రామాలకు బస్సుల రాకపోకలు, సమయపాలన లేదా ఇతర ఫిర్యాదుల కోసం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య 9959225432 ద్వారా నేరుగా డీఎంతో మాట్లాడవచ్చన్నారు.
ASF: పండుగలను మత సామరస్యంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో రంజాన్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసమును ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. ప్రార్థన సమయాలలో ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
NZB: అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పసుపు రైతులకు పలు సూచనలు చేశారు. మంగళవారం పసుపు వ్యాపార లావాదేవీలు మూసివేయనున్నట్లు తెలిపారు. యార్డులో సరైన స్థలం లేకపోవడంతో మంగళవారం పసుపు రైతులు ఎవరూ తీసుకురావద్దని సూచించారు. బుధవారం నుంచి కనుగోళ్లు యథావిధిగా ఉంటాయన్నారు.