• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నూతన పాలకవర్గంతో అమ్మవార్లను దర్శించుకున్న MLA

BDK: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం మేడారం సమ్మక్క సారలమ్మల ను దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన ఇల్లందు మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపొందిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, లతోపాటు కౌన్సిలర్లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మల దయతో రాష్ట్రం సభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.

February 25, 2026 / 03:05 PM IST

తడి-పొడి చెత్త గురించి విద్యార్థులకు అవగాహన

కృష్ణా: మచిలీపట్నం 45వ డివిజన్ నారాయణ స్కూల్ విద్యార్థులకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గోపాల్ రావు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుండి విద్యార్థులు తడి-పొడి చెత్తపై, ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కలిగి ఉండాలని ఉన్నారు. వ్యర్ధాలను వేరే వేరే రంగుల డబ్బాలలో వేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

February 25, 2026 / 03:05 PM IST

డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తగదు: వినయ్

BPT: వేమూరు స్పెషల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు వినయ్ రాజు బుధవారం డిమాండ్ చేశారు. రూ.70 వేల పశువులను రూ.1.25 లక్షలకు కొనాలని డ్వాక్రా మహిళలపై ఆయన ఒత్తిడి తెస్తున్నారన్నారు. నిర్దిష్ట వ్యక్తుల వద్దే కొనాలని షరతులు పెట్టడం దారుణమన్నారు. దీనివల్ల పేదలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

February 25, 2026 / 03:05 PM IST

తెలుగు భాషను మరువొద్దు: మంత్రి లోకేష్

PLD: సత్తెనపల్లి సుగాలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో అసెంబ్లీ లాబీలో మంత్రి లోకేశ్ ముచ్చటించారు. పిల్లలే రాష్ట్ర భవిత అని, చరిత సృష్టించేది మీరేనని ఆయన అన్నారు. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటూనే మాతృభాష తెలుగును మరవొద్దని సూచించారు. విదేశాల్లో చదవడం వల్ల మొదట్లో తాను ఇబ్బంది పడ్డానని చెప్పారు. స్కూల్లో భోజనం, బోధన గురించి అడిగి తెలుసుకున్నారు.

February 25, 2026 / 03:05 PM IST

విజయ్, రష్మిక ప్రీ-వెడ్డింగ్‌లో క్రికెట్ మ్యాచ్‌

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరగనుంది. ఇప్పటికే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘Virosh Premier League’ (VPL) పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్, పూల్ వాలీబాల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ పాప్‌కార్న్ బకెట్ ఫొటో, రష్మిక గ్రౌండ్ ఫొటోలతో ఈ జంట తమ పెళ్లి సందడిని అభిమానులతో పంచుకున్నారు.

February 25, 2026 / 03:03 PM IST

హైకోర్టుకు హాజరైన సీఎస్ విజయానంద్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హైకోర్టుకు హాజరయ్యారు. గ్రూప్-1 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను నాన్ ఫోకల్ పోస్టులలోకి మార్చాలని గతంలో కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, ఆ ఆదేశాలు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

February 25, 2026 / 03:03 PM IST

‘ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం’

KRNL: స్వర్ణాంధ్ర–స్వచ్ఛఆంధ్ర(SASA) కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు.  సీఎం చంద్రబాబు దిశానిర్దేశంలో పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా “స్వర్ణాంధ్ర – స్వచ్ఛఆంధ్ర (SASA) కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందన్నారు.

February 25, 2026 / 03:02 PM IST

ప్రాజెక్ట్ నమూనాను పరిశీలించిన సీఎం

ప్రకాశం: సీఎం చంద్రబాబు బుధవారం దోర్నాల మండలంలో వెలిగొండ ప్రాజెక్టు నమూనాను పరిశీలించారు. గిద్దలూరు నియోజకవర్గానికి వెళ్లే నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కంభం, గిద్దలూరు, కొమరోలు మీదుగా కడప జిల్లాలోకి కృష్ణా జలాలు వెళ్తాయని అధికారులు తెలిపారు. నల్లమల అడవిలోని గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాల గురించి సీఎం అధికారులతో చర్చించారు.

February 25, 2026 / 03:02 PM IST

ముగ్గురు విద్యార్థులు గైర్హాజరు

KMR: ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, ఉర్దూ సబ్జెక్టులకు సంబంధించి అధికారులు ‘సెట్-బీ’ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మొత్తం 246 మంది విద్యార్థులకు గాను 243 మంది హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.

February 25, 2026 / 03:01 PM IST

సమస్యలు పరిష్కారానికి అంగన్వాడీలు ధర్నా

AKP: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు నక్కపల్లి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నాకి దిగారు. వేతనాలు రూ.26,000కు పెంచాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింప చేయాలన్నారు. వచ్చేనెల రెండవ తేదీన నిర్వహించే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

February 25, 2026 / 03:01 PM IST

‘లైసెన్సుల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దు’

కోనసీమ: లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సుల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు సూచించారు. అమలాపురం రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు నేరుగా కార్యాలయానికి రావాలని కోరారు. పరివాహన్ వెబ్‌సైట్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఎంవీఐ సమక్షంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

February 25, 2026 / 03:01 PM IST

గుంటూరు జెడ్పీలో కేంద్ర అధికారి పర్యటన

GNTR: గుంటూరు జిల్లాలో కేంద్ర పంచాయతీరాజ్ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్ లోహాని బుధవారం పర్యటించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఆయనకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం పీఆర్ కమిషనర్ కృష్ణతేజతో కలిసి జెడ్పీ ఆవరణలో నిర్మిస్తున్న డీపీఆర్సీ భవనాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ ఛైర్‌పర్సన్ క్రిస్టినాతో కలిసి ఆయన మొక్కను నాటారు.

February 25, 2026 / 03:01 PM IST

‘మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి’

SRCL: జిల్లాలో డ్రగ్స్, మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో మాదకద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.

February 25, 2026 / 03:00 PM IST

‘జయంతికి రావాలని ఎంపీకి ఆహ్వానం’

ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్‌ను ప్రధాన్ పురోహిత్ జిల్లా సంఘం నాయకులు పట్టణంలోని ఎంపీ నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్చి 15న రామ్ లీలా మైదానంలో నిర్వహించనున్న హీరా సుఖ జయంతి కార్యక్రమం గోడ ప్రతులను ఎంపీ నగేశ్‌తో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.

February 25, 2026 / 03:00 PM IST

పదేళ్ల నా కష్టానికి దక్కిన ప్రతిఫలం ‘డంకీ’: తాప్సీ

 తన పదేళ్ల కష్టానికి దక్కిన అరుదైన బహుమతిగా ‘డంకీ’ సినిమా అని నటి తాప్సీ తెలిపింది. పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నా, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్‌గా అంగీకరించేందుకు మేకర్స్ సమయం తీసుకుంటున్నారని పేర్కొంది. ‘పింక్’, ‘తప్పడ్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో తన నటనను చూసే దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ తనకు ‘డంకీ’ అవకాశం ఇచ్చాడని వెల్లడి...

February 25, 2026 / 03:00 PM IST