కర్నూలులో పట్టణ ప్రణాళిక అధికారులు, సెక్రటరీలతో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో అనుమతులు లేకుండా నిర్మించిన అనధికార కట్టడాలపై భౌగోళిక సమాచార వ్యవస్థ (GIS) ఆధారంగా ఉక్కుపాదం మోపాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రతి సచివాలయ పరిధిలో GIS డేటా ఆధారంగా అక్రమ నిర్మాణాలను గుర్తించి అకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు.
శ్రీకాకుళం పట్టణం సంతోషిమాత ఆలయ సమీపంలో మార్చి 1న ఉదయం 8 గంటల నుంచి ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు లిటిల్ మాస్టర్స్ తల్లీ పిల్లల ఆస్పత్రి ప్రతినిధులు డాక్టర్ అన్వేష్, డాక్టర్ వాసంతి తెలిపారు. షుగర్, బీపీ పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ATP: మహిళల భద్రతకు భరోసా అయిన “శక్తి” యాప్ పై విస్తృతంగా శక్తి బృందాలు అవగాహన కల్పించాయి. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళలు, బాలికల భద్రతే లక్ష్యంగా “శక్తి” యాప్ పై సోమవారం సాయంత్రం, వివిధ విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్టాండ్లు, తదితర ప్రజా ప్రదేశాల్లో మహిళలకు, మరియు విద్యార్థినిలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.
WGL: నగరంలోని గిర్మాజీపేటలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా “న్యూలెమన్ సోడా” తయారు చేస్తున్న సమాచారం మేరకు నేడు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వ్యాపారి వెంకటేశ్వర్లు ఇంట్లో రూ. 24 వేల విలువైన సోడా సీసాలు, సామగ్రిని స్వాధీనంచేసుకున్నారు. వాటిని ఆహార భద్రత అధికారులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
TG: నారాయణపేట జిల్లాలో పెళ్లి జరిగిన మూడు రోజులకే వరుడు చాకలి రవి ఆత్మహత్య చేసుకున్నాడు. నర్వ మండల కేంద్రానికి చెందిన చాకలి రవితో కర్నూలుకి చెందిన యువతితో ఈ నెల 20న పెళ్లైంది. తర్వాత రోజు భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆగ్రహించిన రవి భార్యను కొట్టాడు. ఈ విషయం వధువు కుటుంబసభ్యులకు తెలిసి.. వారు గొడవ పెట్టుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రవి ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు BPS-LRS స్కీంలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ సోమవారం పిలుపునిచ్చారు. పర్మిషన్ లేకుండా నిర్మించిన భవనాలు, అక్రమ లే-అవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. BPSకు మార్చి 11 వరకు, LRSకు ఏప్రిల్ 23 వరకు గడువు ఉందన్నారు.
MNCL: బెల్లంపల్లి ఏరియా GM కార్యాలయంలో సింగరేణి ‘ప్రయాస్’ సమావేశం నిర్వహించారు. CMPF రీజినల్ కమిషనర్ హరి పచౌరి పాల్గొని కార్మికులకు పలు సూచనలు చేశారు. గుర్తింపు సంఘం నాయకులు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. CMPF లావాదేవీలన్నీ ఇకపై C-CARES పోర్టల్ ద్వారానే జరుగుతాయని, మధ్యవర్తులు లేకుండా నేరుగా సేవలు పొందవచ్చని అయన పేర్కొన్నారు.
SRPT: సూర్యాపేట మున్సిపల్ పరిధిలో పశువుల సంచారం మితిమీరుతోంది. పగలు వార్డుల్లో, రాత్రి వేళల్లో మెయిన్ రోడ్లపై ఆవులు తిష్టవేయడంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి రోడ్లపై పశువుల సంచారం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
SS: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి నిర్వహించిన సాంప్రదాయ ఊరేగింపు, బియ్యం ఆశీర్వచన కార్యక్రమం భక్తులను ఆకట్టుకున్నాయి. సింగపూర్ భక్తులు ప్రదర్శించిన సంగీత విభావరి ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది. గ్లోబల్ కౌన్సిల్ ఛైర్మన్ చక్రవర్తి, సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ పాల్గొన్నారు.
KMM: జిల్లాలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగే ఈ పరీక్షలకు 16,975 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖను ఆదేశించారు.
ELR: బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 152 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 113 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అలాగే 39 మంది పరీక్షకు హాజరు కాలేదని అధికారులు పేర్కొన్నారు.
అన్నమయ్య: మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నిశాంత్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్ ద్వారా అందించే సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, భూసేకరణ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి అల్వాల్, జూబ్లీహిల్స్, బషీర్ బాగ్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో నగరమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని మ్యాప్ విడుదల చేసింది.
PDPL: ధర్మారం మండలం పత్తిపాకలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ప్లాస్టిక్ కవర్లు వినియోగించిన, బహిరంగ ప్రదేశాలలో పడవేసిన వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం నిరోధించి భావితరాలకు ప్రాణాధారం కల్పించాలని గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
NZB: 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల్లో గోదావరిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, ఏర్పాట్లు చూడాలన్నారు.