• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉద్యోగాలు.. ఏడాదికి రూ.8 లక్షల జీతం

TG: హైదరాబాద్‌లోని Wolves4You Private Limited సంస్థ బిజినెస్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.8,40,000 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది. మార్చి 22 లోపు దరఖాస్తు చేసుకోండి.

February 22, 2026 / 08:10 PM IST

కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం

ELR: ఆదివారం పెదవేగి మండలం విజయరాయి గాంధీ నగర్ లోని సీతారామ కళ్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం ఆదివారం జరిగింది. వారం రోజుల్లోగా కోకో గింజల ధరల పాలసీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర నిర్ణయించకపోతే కోకో రైతుల పోరాటం తప్పదని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

February 22, 2026 / 08:10 PM IST

ఫైబర్ నెట్ సేవలను విస్తరిస్తాం: చంద్రబాబు

AP: 4G, 5Gతో కోట్ల మందికి డిజిటల్ సేవలు అందుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. భారత్‌లో డేటా ఖర్చు ప్రపంచంలోనే అతి తక్కువ అని తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలను విస్తరిస్తామని చెప్పారు. 970 ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు.

February 22, 2026 / 08:10 PM IST

రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ

MDK: టేక్మాల్‌లోని రైతు వేదిక వద్ద ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు పనిముట్లను పంపిణీ చేశారు. పేట డివిజన్ పరిధిలోని టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గ్ మండలాలకు చెందిన రైతులు ఈ సదుపాయాన్ని పొందారు. అధికారులు మాట్లాడుతూ.. ఆధునిక సాగుకు యంత్రాలు ఎంతో అవసరమని, ఆసక్తి గల రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 08:05 PM IST

“అకాల వర్షం.. రైతులకు నష్టం”

MHBD: జిల్లా కేంద్రంలోని పలు మండలాలలో ఇవాళ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో బయ్యారం మండలం బీరోనిమాడువల గ్రామంలో గాలివానతో రైతుల మొక్కజొన్న పంట నేలవాలింది. చేతికొచ్చే దశలో ఉన్న పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు తమను నష్టపరిచాయని, నష్టపోయిన పంటకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

February 22, 2026 / 08:03 PM IST

కల్తీ నెయ్యిపై శాసనసభలో చర్చించే యోచనలో సర్కార్!

AP: కల్తీ నెయ్యి అంశంపై శాసనసభలో వచ్చే వారంలో ఒకరోజు చర్చించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు సర్కార్ చెప్పాలనుకుంటుంది. ముందు శాసనసభలో చర్చించి తర్వాత మండలిలోనూ చర్చించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

February 22, 2026 / 08:02 PM IST

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన

VSP: ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై కూటమి నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. సమ్మిట్ జరుగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇందులో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు పివిఎన్.మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.

February 22, 2026 / 08:00 PM IST

శిక్షణ కేంద్రంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NRML: వికారాబాద్ అనంతగిరిలో తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షులకు 10 రోజుల శిక్షణ కేంద్రం లో రెండవ రోజు శిక్షణ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. పది రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో నాయకత్వ, నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహాలు, తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.

February 22, 2026 / 07:59 PM IST

ఆజాద్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 69వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. చిత్రాలయ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలందించారని కొనియాడారు.

February 22, 2026 / 07:59 PM IST

దోర్నాలలో తప్పిన ప్రమాదం

ప్రకాశం: దోర్నాలలోని టోల్గేట్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక కంటైనర్ అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పిందని, స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో వాహనం కొంతమేరకు ధ్వంసమైంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

February 22, 2026 / 07:57 PM IST

పోయిన నక్లెస్ కుటుంబ సభ్యులకు అందజేత

AKP: నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన మహిళ కట్ట భాను పాయకరావుపేటకు ఆటోలో ఈనెల 20న వస్తు మూడు తులాల బంగారు నెక్లెస్ పోగొట్టుకుంది. దీనిపై పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా రాజయ్య పేటకు చెందిన మహిళకు నక్లెస్ దొరికినట్లు గుర్తించారు. దొరికిన మహిళను విచారించగా నక్లెస్ ఇచ్చింది. దానిని కుటుంబ సభ్యులకు అందజేశారు.

February 22, 2026 / 07:57 PM IST

బీసీల ఐక్యతకు కమ్యూనిటీ భవనాలు కీలకం : మంత్రి

TG: బీసీల ఐక్యతకు కమ్యూనిటీ భవనాలు ఎంతో కీలకమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బీసీ సమాజంలో మార్పు ప్రారంభమైందని.. విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు సముచిత న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్లు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం సమాజం మొత్తం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

February 22, 2026 / 07:54 PM IST

వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన

విజయనగరం రింగ్ రోడ్లో నిర్మిస్తున్న YCP జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఉప శాసనసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం పరిశీలించారు. నిర్మాణ పురోగతిని సమీక్షించి, నాణ్యతతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు సూచించారు.

February 22, 2026 / 07:54 PM IST

పేకాట శిబిరంపై దాడి.. 10 మంది అరెస్ట్

PLD: ముప్పాళ్ల మండలం చాగంటివారి పాలెం గ్రామ శివారులో రహస్యంగా పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఎస్సై పి. అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ మెరుపు దాడిలో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 18,070 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

February 22, 2026 / 07:51 PM IST

శాసనకోటలో ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం

సత్యసాయి: పరిగి మండలం శాసనకోటలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆదివారం ‘కాఫీ విత్ క్యాడర్’ నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి ప్రజలను పలకరిస్తూ గత జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అన్యాయం చేస్తోందని విమర్శించారు.

February 22, 2026 / 07:50 PM IST