• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆ గ్రామంలో పెళ్లి కట్నకానుకలు నిషేధం

ADB: నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లి కట్నకానుకను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ. 26,551 నగదు పొదుపు చేసి అందజేయడంతో వారు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు ఉన్నారు.

February 22, 2026 / 08:40 PM IST

గోవా గవర్నర్‌తో మంత్రి భేటీ

VZM: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయనగరం పట్టణంలోని అశోక్ బంగ్లాలో ఆదివారం సాయంత్రం గవర్నర్‌తో మంత్రి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు అంశాలపై ఇద్దరు చర్చించారు.

February 22, 2026 / 08:39 PM IST

’22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం’

GDWL: పురపాలక ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 22 నుంచి ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపిన కార్యక్రమం పునఃప్రారంభమవడంతో ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించుకోవచ్చన్నారు. అధికారులు ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

February 22, 2026 / 08:39 PM IST

ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్లాటినం జూబ్లీ సన్నాహాలు

WGL: వరంగల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు EV శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మార్చి 29న ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల పూర్వ విద్యార్థులు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 08:38 PM IST

హిందూపూర్‌లో బాలిక ఆత్మహత్య

NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె పెద్దనాన్న ఆంజనేయులు వద్ద నివసిస్తోంది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు SI నవీద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

February 22, 2026 / 08:38 PM IST

పరిశోధన పత్రాన్ని ఢిల్లీలో సమర్పించిన అధ్యాపకుడు

RR: విద్యలో సాంకేతిక ప్రభావాన్ని, దాని ప్రయోజనాలను సూచిస్తూ ఢిల్లీలోని అంతర్జాతీయ సెమినార్‌లో పరిశోధన పత్రాన్ని SDNR పట్టణానికి చెందిన అర్థశాస్త్ర అసిస్టెంట్ ప్రొ. డాక్టర్ సామ రవీందర్ రెడ్డి సమర్పించారు. వారు మాట్లాడుతూ.. రాబోయే కాలంలో విద్యావ్యవస్థ మొత్తం సాంకేతికతపై ఆధారపడుతుందని, కాబట్టి విద్యార్థులు ఈ దిశగా తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

February 22, 2026 / 08:37 PM IST

రేపు యధావిధిగా ఏలూరులో పీజీఆర్ఎస్

ఏలూరు: కలెక్టరేట్ కార్యాలయంలో మరియు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నమన్నారు.

February 22, 2026 / 08:36 PM IST

రేపు రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

KMR: బీర్కూర్ మండలం బైరాపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మ-జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం అమ్మవారి కళ్యాణం, మంగళవారం భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు, బుధవారం భక్తులకు సామూహిక భోజన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

February 22, 2026 / 08:36 PM IST

మల్లారంలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

HNK: భీమదేవరపల్లి (M) మల్లారంలో ఇవాళ 11 కేవీ విద్యుత్ వైరు అకస్మాత్తుగా తెగి ఇతర వైర్ల పై పడటంతో షాక్‌కు గురై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంటి వద్ద పిండి మిషన్ నడుపుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

February 22, 2026 / 08:36 PM IST

గ్రామ అభివృద్ధికి సర్పంచ్ దేవేందర్ చొరవ

GDWL: బురద గుంతలతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం సొంత చొరవతో ఈ మరమ్మతులు చేపడుతున్నామని చిన్నోనిపల్లి సర్పంచ్ దేవేందర్ పేర్కొన్నారు. గట్టు మండలం చిన్నోనిపల్లి ఆర్ అండ్ ఆర్ (R&R) సెంటర్ పరిధిలో పాడైపోయిన రహదారులను ఆదివారం సర్పంచ్ ఆధ్వర్యంలో బాగు చేశారు.  వర్షాల వల్ల, ఇతర కారణాల వల్ల గుంతలమయంగా మారిన రోడ్లను బాగుచేసారు.

February 22, 2026 / 08:35 PM IST

దేవుడితోనే వైసీపీ నీచ రాజకీయాలు: మండిపల్లి

AP: చిత్తూరు పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవుడితోనే వైసీపీ నీచ రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. దేవుడిపై భక్తి, హిందువుల మనోభావాలపై జగన్‌కు గౌరవం లేదన్నారు. చెప్పులు వేసుకుని వేంకటేశ్వరస్వామి ఫొటోలతో నిరసన తెలిపారని ఫైర్ అయ్యారు. టీటీడీ సంప్రదాయాలు, హిందూ విశ్వాసాలపై జగన్‌కు చిన్నచూపు అని విమర్శించారు.

February 22, 2026 / 08:35 PM IST

‘గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5వేల కోట్లు కేటాయించాలి’

KMM: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5వేల కోట్లు కేటాయించాలని KGKS రాష్ట్ర అధ్యక్షులు ఎం. వి రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా సంఘం కార్యాలయంలో బొడపట్ల సుదర్శన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికులకు ప్రతిసారి అన్యాయమే జరుగుతుందన్నారు.

February 22, 2026 / 08:33 PM IST

ఎంపీకి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం

TPT: సత్యవేడు(మం), ఇరుగుళంలో యువత, గ్రామస్తులు ఎంపీ మద్దెల గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్చి 3న నిర్వహించనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి సానుకూలంగా స్పందించిన ఎంపీకి గ్రామస్తులు, స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

February 22, 2026 / 08:33 PM IST

‘ప్రజలకు మెరుగైన వైద్య సేవలు’

MDK: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు వాటిని సధ్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాహుల్ రాజ్ సూచించారు. వెల్దుర్తి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రిజిస్టర్లు పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేయించుకునేలా గర్భీణులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.

February 22, 2026 / 08:33 PM IST

రేపు అన్ని చోట్ల పీజీఆర్ఎస్: కలెక్టర్

NDL: జిల్లా కలెక్టరేట్ తో పాటు మండల డివిజన్ కేంద్రాలు మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజలు ఉత్తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా ఆన్ లైన్‌ ద్వారా కూడా సమర్పించవచ్చున్నారు.

February 22, 2026 / 08:30 PM IST