• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: మణుగూరు పీవీ కాలనీలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 11వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.

February 25, 2026 / 05:46 PM IST

‘వృషకర్మ’ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

నాగ చైతన్య, మీనాక్షి చౌదరి కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఫిల్మ్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ చిత్రంతో హిట్‌ అందుకున్న కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ గ్లింప్స్ మార్చి 5న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ.. మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. చైతన్య ఇందులో నిధి అన్వేషకుడిగా కనిపిస్తుండగా, మీనాక్షి చౌదరి ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తోంది.

February 25, 2026 / 05:46 PM IST

భద్రత ఏర్పాట్లును పర్యవేక్షించిన రేంజ్ డీఐజీ

AKP: నక్కపల్లి మండలం తమ్మయ్యపేట గ్రామం వద్ద త్వరలో ప్రతిష్టాత్మక అర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం జరగనుంది. బుధవారం విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంయుక్తంగా క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కాబోతున్నారు.

February 25, 2026 / 05:46 PM IST

విజేతలకు బ‌హుమ‌తులు అంద‌జేత‌

విశాఖ‌లోని తవ్వావానిపాలెంలో నిర్వహించిన ‘శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మతల్లి’ పండుగ మహోత్సవంలో మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు, అన్నంరెడ్డి అదీప్ రాజ్‌, వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు కేకే రాజు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంత‌రం నిర్వ‌హించిన ఎడ్లబండి పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

February 25, 2026 / 05:45 PM IST

‘సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

MDK: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ సీఐ రంగా కృష్ణ సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు పంపిన మెసేజ్, లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

February 25, 2026 / 05:43 PM IST

వీర సైనికుడు నరేష్‌కు ఘన నివాళి

ATP: భారత సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ వీరమరణం పొందిన హవిల్దార్ నరేష్ సాకే అంత్యక్రియలు బుధవారం గార్లదిన్నెలో అధికారిక లాంఛనాలతో జరిగాయి. అమర జవాను పార్థివ దేహానికి సైనిక అధికారులు, జిల్లా యంత్రాంగం గౌరవ వందనం సమర్పించి నివాళులర్పించారు. దేశ రక్షణలో ఆయన చేసిన త్యాగం మరువలేనిదని కొనియాడారు.

February 25, 2026 / 05:43 PM IST

‘రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి’

ASR: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించామని ఎంపీడీవో రమేష్ తెలిపారు. పలు శాఖల అధికారులు పాల్గొన్నారన్నారు. జిల్లాలో అనేక మంది గర్భిణులు, రోగులు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు.

February 25, 2026 / 05:43 PM IST

మార్చ్ 28న జాతీయ లోక్ అదాలత్

ADB: ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పెండింగ్ కేసులను అధికంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. రానున్న లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన సమన్వయ సమావేశంలో పలు సూచనలు చేశారు.

February 25, 2026 / 05:40 PM IST

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

WGL: నెక్కొండ మండలం పెద్దకోర్పోల్ గ్రామానికి చెందిన మట్టే ఏలియా అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన ఏలీయా.. విద్యుత్ ప్రమాదానికి గురై మృతిచెందాడు. దీంతో పెద్దకోర్పోల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏలీయా కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

February 25, 2026 / 05:40 PM IST

సమాజసేవలో ఎన్జీవోలు ముందుండాలి: కలెక్టర్

SRPT: సమాజసేవలో ఎన్జీవోలు ముందుండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. HCL Foundation విరాళంగా అందించిన ఆధునిక వైద్య పరికరాలను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అందజేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ఈ పరికరాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.

February 25, 2026 / 05:40 PM IST

‘నష్టపరిహారం చెల్లించి రోడ్డు పనులు చేపట్టాలి’

JN: జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్ల ప్లాట్లు కోల్పోతున్న ప్లాట్ల యజమానులకు నష్టపరిహారం చెల్లించి రోడ్డు పనులను చేపట్టాలని CPM జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. జనగామలో బాధిత ఫ్లాట్ల యజమానులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కనకారెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

February 25, 2026 / 05:39 PM IST

గన్ పార్క్ నుంచి మీడియా అకాడమీకి జర్నలిస్టుల ర్యాలీ

HYD: డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కార్డులను పెంచాలని డెస్క్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో HYDలోని గన్ పార్క్ నుంచి నాంపల్లి చాపల్ రోడ్డులోని మీడియా అకాడమీ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అకాడమీ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. TWJF వ్యవస్థాపక అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ.. అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 05:39 PM IST

జగన్‌ను కలిసిన యువ నాయకుడు శివ

TPT: సత్యవేడు నియోజకవర్గంలోని బి.ఎన్. కండ్రిగ మండలానికి చెందిన యువ నాయకుడు కత్తి శివ, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను పులివెందులలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. పులివెందులలో జరిగిన ఈ భేటీకి పార్టీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు.

February 25, 2026 / 05:38 PM IST

కళాశాల భవనాలకు నిధులు కోరిన ఎమ్మెల్యే

TPT: సత్యవేడు నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల భవనాలు శిధిలావస్థలో ఉన్నాయని, కొత్త భవనాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట భవనాల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

February 25, 2026 / 05:36 PM IST

80 శాతం పన్నీరు కల్తీనే.!

TPT: మార్కెట్‌లో 80% పైగా కల్తీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి జంతువులు తినడానికి కూడా సురక్షితం కాదట. మైదా హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు, పామ్ ఆయిల్ నిల్వలతో వీటిని తయారు చేస్తున్నారట. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తికి నిత్యం వేల మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడి హోటళ్లలో అన్ బ్రాండెడ్ పనీర్ వినియోగిస్తున్నట్లు సమాచారం.

February 25, 2026 / 05:35 PM IST