• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యత తహసీల్దార్లదే’

PPM: జిల్లాలోని ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యత తహసీల్దార్లదేనని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం రెవిన్యూ అధికారులకు ఉండే సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ప్రతీ సమస్యను సావధానంగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురైతే చూస్తూ ఊరుకోకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

February 25, 2026 / 05:26 PM IST

వర్ధన్నపేటలో మున్సిపల్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ ఉద్యోగులతో సమీక్షా సమావేశం జరిగింది. వార్డుల్లో మురికి కాలువల శుభ్రత, దోమల నివారణ ఫాగింగ్, వీధి దీపాల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

February 25, 2026 / 05:26 PM IST

బాధిత కుటుంబాన్ని ప్రమర్శించిన.. BJP జిల్లా అధ్యక్షుడు

BHPL: రేగొండ మండల కేంద్రానికి చెందిన BRS యూత్ నాయకులు శ్రీకాంత్ మాతృమూర్తి తడక రాధమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న BJP జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఇవాళ మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

February 25, 2026 / 05:26 PM IST

తొర్రూరు PACS సెక్రటరీ మురళి సస్పెండ్

MHBD: తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) సెక్రటరీ వెలుగు మురళిని డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ ఇవాళ సస్పెండ్ చేశారు. సొసైటీ నిధుల దుర్వినియోగం చేశారనే ఫిర్యాదులపై ఇటీవల విచారణ ప్రారంభించారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తుది నివేదిక వచ్చే వరకు విధుల నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

February 25, 2026 / 05:25 PM IST

ఆర్డీవోను కలిసిన మాజీ కార్పొరేటర్

HYD: సికింద్రాబాద్ ఏంఆర్వో ఆఫీస్‌లో ఆర్డీవో సాయిరాంను బుధవారం మోండా మార్కెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం 4 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న మారేడ్‌పల్లి 2BHK లబ్ధిదారుల జాబితాపై చర్చించారు. దీనికి ఆర్డీవో సానుకూలంగా స్పందించినట్లు కార్పొరేటర్ తెలిపారు.

February 25, 2026 / 05:25 PM IST

జిల్లా వ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ ప్రారంభం: మధు

MHBD: జిల్లా వ్యాప్తంగా SFI ఆధ్వర్యంలో ఇవాళ మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ప్రారంభమైనట్లు SFI జిల్లా కార్యదర్శి పట్ల మధు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని MHBD జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓ పాఠశాలలో UTF రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి, SFI జిల్లా కార్యదర్శి మధు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2000 మంది విద్యార్థులకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు మధు వెల్లడించారు.

February 25, 2026 / 05:25 PM IST

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆదాయం వివరాలు

కోనసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం వివిధ సేవల ద్వారా రూ.2.68 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం చేసుకున్న భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు.

February 25, 2026 / 05:25 PM IST

పాక్ కెప్టెన్ ఫ్యామిలీపై నెటిజన్లు ఫైర్

T20 WCలో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో పాక్ జట్టుపై SMలో ఆ దేశ అభిమానులు విరుచుకుపడుతున్నారు. కెప్టెన్ సల్మాన్ అఘాతో పాటు అతడి భార్య, కుమారుడిని టార్గెట్ చేస్తూ అసభ్య కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అఘా భార్య స్పందిస్తూ.. “నన్ను, నా కొడుకును దుర్భాషలాడటం వల్ల మీరు WC గెలవలేరు’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

February 25, 2026 / 05:24 PM IST

గోపాలమిత్ర భవనం ప్రారంభం

MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన గోపాలమిత్ర భవనాన్ని మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య ప్రారంభించారు. పాడి రైతులు పశు సంపద పెంచాలని ఈ సందర్భంగా రైతులకు పూజించారు. మండల పశువైద్యాధికారి లక్ష్మీరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు

February 25, 2026 / 05:23 PM IST

ఈనెల 26న ప్రజా వేదిక

ASR: ఈనెల 26వ తేదీన అనంతగిరిలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ అరకు నియోజకవర్గ ఇంఛార్జ్ సియ్యారి దొన్నుదొర బుధవారం అన్నారు. ఉదయం 10:30కు ప్రారంభమయ్యే ప్రజా వేదికకు 24 పంచాయితీల ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చన్నారు. గ్రీవెన్స్‌కు వచ్చే వారంతా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలన్నారు.

February 25, 2026 / 05:22 PM IST

నూతన ఆటోలను ప్రారంభించిన నాయకులు

SRD : యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అన్నారు. గుమ్మడిదలకు చెందిన ఆంజనేయులు, ఆనంద్‌ల నూతన ఆటోలను ప్రారంభించారు. ఉద్యోగాలకే పరిమితమవకుండా స్వతంత్ర ఉపాధి మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

February 25, 2026 / 05:22 PM IST

ఈ నెల 28నే ఫించన్ల పంపిణీ

VZM: వంగర మండలంలో ఈ నెల 28నే NTR భరోసా పెన్షన్‌ పంపిణీ చేయనున్నట్లు MPDO రాజారావు బుధవారం తెలిపారు. ఈ మేరకు మండలానికి 290 పెన్షన్లు విడుదల చేయగా రూ.2,67,64500 మంజూరైనట్లు పేర్కొన్నారు. అదేరోజు శతశాతం పింఛన్‌ పంపిణీ పూర్తిచేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. టెంపరరీ మైగ్రేషన్‌ అయిన వారికి సమాచారం అందించి ఇంటీ దగ్గర ఉండేటట్లు చూసుకోవాలన్నారు.

February 25, 2026 / 05:22 PM IST

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన సీపీఎం నాయకులు

NGKL: జిల్లాలోని కుమ్మెర జాతరలో రజక కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సీపీఎం నాయకుల బృందం డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పార్టీ నాయకులు టీ సాగర్, నరసింహారావు, స్కైలాబ్ బాబు తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు.

February 25, 2026 / 05:22 PM IST

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ

అనకాపల్లి సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు చేసే రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రికలు విడుదల చేశారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ,బీసీ మహిళ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి ఒకే ఒక మహిళా వసతి గృహం ఉందన్నారు.

February 25, 2026 / 05:22 PM IST

త్వరలో విశాఖలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్: సత్యకుమార్

AP: రాష్ట్రవ్యాప్తంగా పాల కేంద్రాలపై తనిఖీలు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘త్వరలో విశాఖలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం శాంపిల్స్ హైదరాబాద్‌కు పంపిస్తున్నాం. శ్రీకాకుళంలో పరిస్థితి అదుపులో ఉంది. కలుషిత నీటి వల్లే డయేరియా కేసులు. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంపై అధ్యయనం చేస్తున్నాం’ అని వెల్లడించారు.

February 25, 2026 / 05:21 PM IST