HNK: అశ్వరావుపేట, దమ్మపేట, కల్లూరి గూడెం ప్రాంతాలలో ఆయిల్ ఫామ్ నర్సరీలను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి బుధవారం పరిశీలించారు. నాణ్యమైన మొక్కలను రైతులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని, ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువతకు భారత వాయుసేన గుడ్‌న్యూస్ చెప్పింది. అగ్నివీర్ వాయు నియామకాలకు గుంటూరులోని నాగార్జున వర్సిటీలో మార్చి 9 నుంచి ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. MAR 9, 10న మహిళా అభ్యర్థులకు, 12, 13న AP పురుష అభ్యర్థులకు, 15, 16న TG పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా అభ్యర్థులు నేరుగా పాల్గొనవచ్చు.
TPT: తిరుపతి పోస్టల్ కాలనీకి చెందిన ఆశాల భర్తతో విడిపోయి తన కుమార్తె దుర్గతో కలిసి ఉంటుంది. చెన్నంపల్లికి చెందిన రెడ్డి కుమార్‌తో సహజీవనం చేస్తుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని అడ్డుగా ఉన్న కుమార్తెను చంపేశారు. మృతదేహాన్ని స్వర్ణముఖి నది దగ్గర పూడ్చిపెట్టారు. తన బిడ్డ, మనవరాలు కనబడుటలేదని ఆశాలత తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో చైనా నూతన సంవత్సర ముగింపు వేడుకల సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ‘బాయ్ తీ కాంగ్’ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జేడ్ చక్రవర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని చైనా భక్తులు ఈ సంప్రదాయ వేడుకను జరుపుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బియ్యం కేకులు, అగరుబత్తులు, దీపాలతో ప్రత్యేక పూజలు చేశారు.
MLG: మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ లీక్ అవుతున్న విషయం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులుగా భారీగా నీరు బయటకు వస్తున్నా, సంబంధిత అధికారులు మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టు ‘NTRNeel’. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ SMలో వైరలవుతోంది. మార్చి నెలాఖరులో రామోజీ ఫిల్మ్ సిటీలో NTRపై ఓ సాంగ్‌తో పాటు యాక్షన్ సీన్ కూడా షూట్ చేయన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ NTR కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.
MHBD: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజక్షన్ అవసరమనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ కుటుంబ పరిస్థితి చూసి చలించిన దంతాలపల్లికి చెందిన యువకులు విరాళాలు సేకరించారు. మొదటి రోజు సేకరించిన మొత్తం రూ.35వేలను పునర్విక కుటుంబానికి అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు.
MBNR: అడ్డాకల్ మండలం కందూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపులో రూ.5.08 లక్షల ఆదాయం లభించినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు సమర్పించుకున్నారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి భక్తుల రద్దీ పెరుగుతోందన్నారు.
కోనసీమ: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు ముమ్మిడివరం MLA దాట్ల సుబ్బరాజు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌లతో కూడిన ప్రత్యేక పెయింటింగ్‌ను MLA కుటుంబ సభ్యులు మంత్రికి అందజేశారు. లోకేశ్ అందరినీ పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు.
MDCL: మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలో వందరోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది. ప్లాన్ ప్రారంభించిన అధికారులు 100 రోజుల పాటు నిర్వహిస్తారు. రోడ్లు మొత్తం క్లీన్ చేయడం, దోమల బెడద తగ్గించడం, పరిశుభ్రం, పచ్చదనం, అభివృద్ధి సహా అనేక అంశాలను ఇందులో జోడించినట్లుగా తెలిపారు. కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కింది స్థాయి అధికారులకు ఆదేశించారు.
NRPT: మక్తల్‌లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలకు 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్, మైనార్టీ గురుకుల కాలేజ్, స్కాలర్స్ ప్రైవేటు జూనియర్ కాలేజ్‌లలో పరీక్షలు జ...
CTR: బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయన్ని సీఐ కత్తి శ్రీనివాసరావు తెలిపారు. పాలేరు గ్రామానికి చెందిన గిరిజ(51) అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా 25 మందు బాటిల్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
SRPT- మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని చిన్న యాదగిరిగుట్టగా పిలువబడే అతి పురాతనమైన దేవస్థానంగా పిలవబడే లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఛైర్మన్ సారిక చిన్న రామయ్య ఒక ప్రకటనలో ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26 నుండి వచ్చేనెల మార్చి 5 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయన్నారు.
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో బుధవారం ఉదయం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు తెలుగు లాంగ్వేజ్ రాయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రం వద్ద కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.
BPT: చీరాల ఎమ్మెల్యే కొండయ్యపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తూ కూటమి శ్రేణులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆర్ఓబీ (ROB) నిర్మాణంపై వాస్తవాలను వక్రీకరించారని మండిపడుతూ సాక్షి పత్రిక ప్రతులను చించివేశారు. 2014-19 మధ్యే అనుమతులు వచ్చినా, ఆ తర్వాతి నిర్లక్ష్యం వల్లే పనులు ఆగిపోయాయని,ప్రజల సమస్యల కోసమే ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడారని తెలిపారు.