• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యుత్ తీగలకు తగిలి నీల్‌గాయి మృతి

ASF: పెంచికల్ పేట్ మండలం ఎల్లూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు నీలుగాయి మృతి చెందినట్లు FRO అనిల్ కుమార్ తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా SI అనిల్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ రాకేశ్ శవ పంచనామ నిర్వహించారు. అనంతరం ఖననం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

February 24, 2026 / 10:03 AM IST

బాసర ఆలయ ఇన్ఛార్జ్ ఈవోగా విజయరామరావు

NRML: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ఇన్ఛార్జ్ ఈవోగా విజయరామారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో అంజనీదేవి సెలవుపై వెళ్లడంతో, నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పని చేసిన అనుభవం ఉండటంతో ఆలయ వ్యవహారాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

February 24, 2026 / 10:02 AM IST

నాని పుట్టినరోజు.. విషెస్‌ చెప్పిన దర్శకుడు

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పోస్ట్ చేశాడు. ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని నాని అన్నప్పుడల్లా, తనపై ఉన్న నమ్మకం చూసి భయమేస్తుందని అన్నాడు. ‘దసరా’ కోసం నానిని ఎంతో హింసించినా, నియమాలు ఉల్లంఘించినా ఆయన తనను ప్రోత్సహించారని తెలిపాడు. తనను నమ్మిన ‘ధరణి’కి, ఇప్పుడు నమ్ముతున్న ‘జడల్’ (ది ప్యారడైజ్)కి రుణపడి ఉంటానంటూ నానికి...

February 24, 2026 / 10:02 AM IST

గోదావరి జలాల పెంపు

SRPT: జిల్లాకు ఎస్సారెస్పీ రెండోదశ ద్వారా ఇస్తున్న గోదావరి జలాలను సోమవారం సాయంత్రం పెంచారు.1200 క్యూసెక్కులు ఇస్తుండగా వాటిని 1613 క్యూసెక్కులకు పెంచారు. 4వ తడిగా వదులుతున్న గోదావరి జలాలను వారబందీ విధానంలో వారం రోజుల పాటు ఇవ్వనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణ, జాజిరెడ్డిగూడెం ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.

February 24, 2026 / 10:01 AM IST

కొటియా గ్రామాలపై అసెంబ్లీలో చర్చ

AP: కొటియా గ్రామాలపై అసెంబ్లీలో చర్చించారు. ఏపీ-ఒడిశా సరిహద్దులో 10 గ్రామాలపై ఒడిశా పెత్తనం ఉందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సభ దృష్టికి తెచ్చారు. 10 గ్రామాలను ఒడిశా బలవంతంగా స్వాధీనం చేసుకుందని, ఒడిశా పెత్తనంపై దృష్టి సారించాలని కోరారు. సీఎం చంద్రబాబు, Dy. CM పవన్ కళ్యాణ్‌తో చర్చిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

February 24, 2026 / 10:00 AM IST

రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి మృతి

TG: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిదిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి చెట్టును కారు ఢీ కొట్టగా.. నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ప్రమాదంలో కారు డ్రైవర్, ఇద్దరు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

February 24, 2026 / 09:58 AM IST

డబ్బు ఇవ్వలేదని భార్యపై కొడవలితో దాడి

ATP: అనంతపురం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో నాగభూషణం అనే వ్యక్తి తన భార్య గౌరమ్మపై కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 09:58 AM IST

అక్రమ కేసులకే ప్రభుత్వం ప్రాధాన్యం: నారాయణ స్వామి

చిత్తూరు: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం.. అక్రమ కేసులు అధికమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పుత్తూరులోని ఆయన నివాసంలో ఇవాళ మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కూటమి తప్పులను ప్రశ్నిస్తే అరాచకం, దౌర్జన్యం, దాడులు పెచ్చుమీరుతున్నాయన్నారు. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయని వాపోయారు.

February 24, 2026 / 09:56 AM IST

నేడు శంబరలో 5వ వారం జాతర

PPM: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవత, రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర 5వ వారం మంగళవారం జరగనుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో B.శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలియజేశారు. పటిష్ఠమైన క్యూలైన్లు, బారీకేడ్లు, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనంతో పాటు ఉచిత దర్శనం, తాగు నీరు ఏర్పాటు చేశారని చెప్పారు.

February 24, 2026 / 09:56 AM IST

HAPPY BIRTHDAY నేచురల్ స్టార్

ఇవాళ నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని ‘అష్టా చమ్మా’తో హీరోగా మారాడు. తన సహజ నటనతో ‘నేచురల్ స్టార్’గా ఎదిగాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

February 24, 2026 / 09:55 AM IST

ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీలో కార్డన్ సర్చ్

ప్రకాశం: ఒంగోలులోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 80 మందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి రికార్డులు లేని 4 ఆటోలు, 41 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహన రికార్డులు చూపిన తర్వాత వాటిని యజమానులకు అప్పగించారు. అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కాలనీలో ర్యాలీ చేపట్టారు.

February 24, 2026 / 09:55 AM IST

కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

బాపట్ల అప్పికట్ల రోడ్డులోని యారకాలువలో ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల్లో వంశీకృష్ణ మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. సోమవారం సాయంత్రం మద్యం మత్తులో ఈత పోటీకి దిగి వంశీ, చందు అనే స్నేహితులు నీటిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అధికారుల గాలింపు చర్యల తర్వాత వంశీ మృతదేహం బయటపడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

February 24, 2026 / 09:53 AM IST

కాల్పులు జరిపిన నిందితులు అరెస్ట్

TG: HYD కోఠిలో ఇటీవల కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులు జరిపి పరారైన ఇద్దరు నిందితులను యూపీలో పట్టుకున్నారు. వారిని హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. కాగా, జనవరి 31న ఉదయం 7 గంటలకు కోఠిలో ఏటిఎం వద్ద నగదు డిపాజిట్ చేస్తున్న వ్యాపారి రిషద్‌పై కాల్పులు జరిపి.. రూ. 6 లక్షల ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.

February 24, 2026 / 09:52 AM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్

NLR: నగరంలోని బాబు ఐస్క్రీం ఎదురుగా మంగళవారం ఓ వ్యక్తి మద్యం తాగి వాహనాలకు అడ్డుపడ్డాడు. ఆటోలు, కార్లు, బైకులను ఆపి వాటిని పోనివ్వకుండా హల్‌చల్ చేశాడు. కొందరు యువకులు ఆ వ్యక్తిని పక్కకు తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

February 24, 2026 / 09:52 AM IST

మహిళపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువకుడు

NLR: మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించి, ఆమెపై పెట్రోల్ పోసి ఓ యువకుడు నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళతో పాటు యువకుడు కూడా గాయపడ్డాడు. ఇద్దరూ ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

February 24, 2026 / 09:51 AM IST