• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదు’

E.G: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్లలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని MLA మద్దిపాటి వెంకటరాజు హెచ్చరించారు. గురువారం అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్లో ఆయన మాట్లాడారు. భోజనం నాణ్యతపై ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. తాను ఆకస్మికంగా పాఠశాలలను సందర్శిస్తానన్నారు

February 20, 2026 / 06:46 AM IST

మడూరు జడ్పీ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు..!

MDK: చిన్న శంకరంపేట మండలంలోని మడూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు సర్పంచ్ గుడి కాడి దివ్యభారతి లింగం గౌడ్ గురువారం నాలుగు సీసీ కెమెరాలు అందించారు. ఇవి విద్యార్థులకు క్రమశిక్షణ, అలాగే రక్షణకు తోడ్పడతాయని తెలిపారు. కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ దివ్యభారతికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 06:46 AM IST

దిలీప్ కుటుంబానికి పోలీసుల అండ

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం కంచర్ల గ్రామానికి చెందిన 2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ అకాల మరణం ఆ బ్యాచ్ సభ్యులను కలచివేసింది. గురువారం దిలీప్ కుటుంబాన్ని పరామర్శించిన తోటి బ్యాచ్‌మేట్స్, వారి పిల్లల చదువుల కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గంపల సతీష్, గొర్రె తిరుపతి, ఆకుల సతీష్, ముజాల కైలాష్, అనిల్, తీగల మహేష్ ఆధ్వర్యంలో ఈ నగదును అందజేశారు.

February 20, 2026 / 06:43 AM IST

‘హే బలవంత్’ రివ్యూ&రేటింగ్

సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన చిత్రం ‘హే బలవంత్’. చిన్నప్పటి నుంచి కృష్ణ(సుహాస్)కి తన తండ్రి బలవంత్(నరేష్) చేసే బిజినెస్‌పై ఆసక్తి. కానీ అతడి తండ్రి అంగీకరించడు. బలవంత్‌కి హార్ట్ స్ట్రోక్ రావడంతో వ్యాపారం తానే చూసుకుంటానని ఆఫీసుకి వెళ్తాడు. తండ్రి చేసే రహస్య వ్యాపారం ఏంటనేది కథాంశం. కామెడీతో మెప్పించినప్పటికీ.. సెకండాఫ్ కాస్త స్లోగా సాగడం మైనస్. రేటింగ్ 2.5/5.

February 20, 2026 / 06:43 AM IST

గుంపర్రులో వైసీపీ కార్యవర్గ సమావేశం

W.G: గుంపర్రు గ్రామ వైసీపీ కార్యవర్గ సమావేశం గురువారం నియోజకవర్గం ఇన్‌ఛార్జి గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ, మండల అనుబంధ కమిటీల నియామకం, పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం చేపట్టాల్సిన చర్యలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. గ్రామ అధ్యక్షుడిగా సుబ్బారావును ఎన్నుకున్నారు.

February 20, 2026 / 06:40 AM IST

ప్రైవేటు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

JGL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23న ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి తెలిపారు. ఎంజీబీ మోటార్, ఆటో ఏజెన్సీస్ కరీంనగర్ సంస్థలో ఐటీఐ, ఐటీఐ-డీజిల్ మెకానిక్, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు, ఎంపికైన వారు కరీంనగర్లో పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

February 20, 2026 / 06:40 AM IST

విద్యా రంగ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు

ASF: విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను నిన్న పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

February 20, 2026 / 06:40 AM IST

ఎస్కేయూ పరిధిలో ఎనిమిది మంది విద్యార్థులు డిబార్

ATP: ​శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 8 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. అనంతపురం నగరంలోని ఎస్ఎల్ఎన్, శ్రీవాణి డిగ్రీ కళాశాలల్లో ముగ్గురు చొప్పున, గోరంట్లలోని ఎస్వీపీఎం కళాశాలలో ఇద్దరు విద్యార్థులను పట్టుకున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ వెల్లడించారు.

February 20, 2026 / 06:38 AM IST

హైదరాబాద్ పౌరుల కోసం ‘మై క్యూర్’ యాప్

హైదరాబాద్‌లోని కొత్త కార్పొరేషన్ల పరిధిలో పౌర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ‘మై క్యూర్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. పారిశుధ్యం, వీధిలైట్లు, ఆస్తిపన్ను, జనన, మరణ ధృవీకరణ పత్రాల వంటి సేవలను ప్రజలు ఇంటి నుంచే పొందవచ్చు. గతంలోని మైజీహెచ్ఎంసీ యాప్ స్థానంలో వచ్చిన ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫోటోలు, వీడియోలతో ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు.

February 20, 2026 / 06:38 AM IST

నేడు కొప్పవరం జంక్షన్లో ఎంపీ ‘ప్రజాదర్బార్’

KKD: సామర్లకోట మండలం కొప్పవరం జంక్షన్ వద్ద గల రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఎంపీ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చు.

February 20, 2026 / 06:37 AM IST

నేడు జిల్లాలో జాబ్ మేళా

GDWL: జిల్లాలో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ నేడు శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనుంది. కలెక్టరేట్లోని ఎఫ్ 30/1లో ఉదయం 11 గంటలకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి 18-35 సంవత్సరాల వయసు ఉన్న ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు హాజరు కావాల్సిందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.శ్రీ చరణ్ దీప్ వెల్లడించారు.

February 20, 2026 / 06:36 AM IST

26 నుంచి జనసేన సభ్యత్వ నమోదు: నాదెండ్ల

AP: జనసేన ఐదోవిడత సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘జెన్‌జీ సరికొత్తగా ఆలోచిస్తోంది. వారి ఆలోచనలు పార్టీకి ఉపయోగపడతాయి. యువనాయకత్వాన్ని పెంపొందించాలి’ అని సూచించారు. అలాగే, స్థానిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను వీరమహిళలు అందిపుచ్చుకుని సభ్యత్వనమోదులో మహిళల్ని పార్టీకి దగ్గర చేయాలని అన్నారు.

February 20, 2026 / 06:36 AM IST

ఆస్పిరేషన్ బ్లాక్ అభివృద్ధిపై కలెక్టర్ దృష్టి

NRPT: నర్వ ఆస్పిరేషన్ బ్లాక్లో జిల్లా కలెక్టర్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ నెల 24న నీతి ఆయోగ్ అదనపు మిషన్ డైరెక్టర్ సందర్శన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దకడుమూర్ గ్రామంలో పీఎం శ్రీ పాఠశాల పథకం కింద కేటాయించిన వార్షిక బడ్జెట్ వ్యయం, కొనసాగుతున్న పాఠశాల కార్యక్రమాలు, టాయిలెట్ సౌకర్యాలను పరిశీలించారు.

February 20, 2026 / 06:36 AM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తొలి రోజు ఆమనగల్లులో నిన్న సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ ఛైర్‌పర్సన్ గీతా నరసింహ, మున్సిపల్ ఛైర్మన్ పత్యనాయక్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:35 AM IST

నక్ష సర్వే తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కొనసాగుతున్న యూఎల్బీ (నక్ష) సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి గురువారం తనిఖీ చేశారు. 13 మంది బృందంతో 11 వార్డుల్లోని 158 బ్లాకుల్లో ఏడీఎస్ ల్యాండ్ సర్వే చేపట్టిన విధానాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు జిల్లాలో 3,854 ఇళ్లు, 1,048 వ్యవసాయ భూభాగాలు (1,024 ఎకరాలు) సర్వే పూర్తయ్యాయి.

February 20, 2026 / 06:33 AM IST